MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 10: డేంజర్‌ జోన్‌లో క్రేజీ కంటెస్టెంట్, రిస్క్ లో గ్లామర్‌ బ్యూటీ, బిగ్‌ బాస్‌ ఓటింగ్‌

Bigg Boss Telugu 10: డేంజర్‌ జోన్‌లో క్రేజీ కంటెస్టెంట్, రిస్క్ లో గ్లామర్‌ బ్యూటీ, బిగ్‌ బాస్‌ ఓటింగ్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 10 రెండో వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే నామినేషన్‌లో ఉన్న వారిలో ముగ్గురు కంటెస్టెంట్లు డేంజర్‌లో ఉన్నారు. మెయిన్‌గా ఆ కంటెస్టెంట్‌ హౌజ్‌ని వీడే ఛాన్స్ ఉంది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 18 2026, 04:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రెండో వారం ఎలిమినేట్‌ అయ్యేది ఎవరు ?
Image Credit : Asianet News

రెండో వారం ఎలిమినేట్‌ అయ్యేది ఎవరు ?

బిగ్‌ బాస్‌ తెలుగు 10 రెండో వారం నామినేషన్‌కి సంబంధించిన ఓటింగ్‌ రిజల్ట్ షాకిస్తుంది. అనధికారికంగా కొందరు బిగ్‌ బాస్‌ లవర్స్ నిర్వహించిన ఓటింగ్‌లో ఇప్పుడు షాకింగ్‌ రిజల్ట్ కనిపిస్తుంది. రెండో వారం ముగ్గురు కంటెస్టెంట్లు డేంజర్‌ జోన్‌ లో ఉన్నారు. అందులో గ్లామర్‌ బ్యూటీ కూడా రిస్క్ లోనే ఉండటం ఆశ్చర్యపరుస్తోంది. అదే సమయంలో ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ కాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నామినేషన్‌లో ఉన్నది వీరే
Image Credit : Asianet News

నామినేషన్‌లో ఉన్నది వీరే

రెండో వారంలో రోహిత్‌, త్రిగుణ్‌, ముఖేష్‌ గౌడ, రాం ప్రసాద్‌, దేబ్జానీ, షాలిని, ఝాన్సీ, సృష్టి, సుధీర్‌, కృష్షుడు, వర్షిణి నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. గత వారం మాదిరిగా ఇద్దరిని ఎలిమినేట్‌ చేస్తారా? ఒక్కరే ఎలిమినేట్‌ అవుతారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. చరణ్‌ మళ్లీ హౌజ్‌లోకి వచ్చిన నేపథ్యంలో ఈ వారం ఇద్దరిని ఎలిమినేట్‌ చేసే ఛాన్స్ ఉందా అనే డౌట్‌ కలుగుతుంది.

35
ఓటింగ్‌లో టాప్‌లో రోహిత్‌, త్రిగుణ్‌
Image Credit : Asianet News

ఓటింగ్‌లో టాప్‌లో రోహిత్‌, త్రిగుణ్‌

ఈ క్రమంలో తాజాగా గురువారం వరకు నిర్వహించిన ఓటింగ్‌లో రోహిత్‌ టాప్‌లో ఉన్నాడు. దాదాపు 31 శాతం ఓటింగ్‌తో టాప్‌లో దూసుకుపోతున్నాడు. ఆ తర్వాత త్రిగుణ్‌ కూడా ముప్పై శాతం ఓటింగ్‌తో టాప్‌లో కొనసాగుతున్నారు. హౌజ్‌లో వీరిద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉంది. టాస్క్ ల్లో కూడా ఈ ఇద్దరి మధ్యే ఎక్కువగా పోటీ కనిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖేష్‌ గౌడ, రాం ప్రసాద్‌, దేబ్జానీ వంటి వారు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. వీరికి పది శాతం లోపే ఓటింగ్‌ రావడం షాకిస్తోంది.

45
డేంజర్‌లో కృష్ణుడు, వర్షిణి, సుధీర్‌
Image Credit : X/@Starmaa

డేంజర్‌లో కృష్ణుడు, వర్షిణి, సుధీర్‌

ఇక రెండో వారంలో డేంజర్‌ జోన్‌లో కృష్షుడు, సుధీర్‌, వర్షిణి ఉన్నారు. ముఖ్యంగా కృష్ణుడు, వర్షిణి మరింత డేంజర్‌లో ఉన్నారు. ఈ వారం ఎలిమినేషన్‌ జరిగితే ఈ ఇద్దరి మధ్యనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెయిన్‌గా కృష్ణుడు ఈ వారం హౌజ్‌ని వీడే ఛాన్స్ ఉందని టాక్‌. ఆయన టాస్క్ ల్లో యాక్టివ్‌గా లేడు, అదే సమయంలో కంటెంట్‌ ఇవ్వడంలోనూ కనిపించడం లేదు. ఎక్కువగా కూర్చొని సైలెంట్‌గా ఉంటున్నాడు. ఫుడ్‌ తినడానికే ప్రయారిటీ ఇస్తున్నట్టుగా ఉంది. దీంతో ఆయన ఈ వారం హౌజ్‌ ని వీడే అవకాశం ఉందని అంటున్నారు. అదే సమయంలో బిగ్‌ బాస్‌ నిర్వాహకులే ఆయన్ని పంపించినా ఆశ్చర్యం లేదంటున్నారు. మరి ఈ వారం ఎవరు హౌజ్‌ని వీడతారో చూడాలి. అయితే ఏసియానెట్‌ నిర్వహించిన ఓటింగ్‌లోనూ కృష్ణుడే ఎలిమినేట్‌ అయ్యే ఛాన్స్ ఉండటం గమనార్హం.

55
16 మందితో ప్రారంభమైన బిగ్‌ బాస్‌ తెలుగు 10
Image Credit : Youtube/@starmaa

16 మందితో ప్రారంభమైన బిగ్‌ బాస్‌ తెలుగు 10

నాగార్జున హోస్ట్ గా సెప్టెంబర్‌ 6న బిగ్‌ బాస్‌ తెలుగు 10వ సీజన్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. సెలబ్రిటీల నుంచి పది మంది, కామనర్స్ నుంచి ఆరుగురు కంటెస్టెంట్లు హౌజ్‌లోకి వచ్చారు. టెంపర్‌ వంశీ, రామ్‌ ప్రసాద్‌, జబర్దస్త్ నరేష్‌, దేబ్జానీ, ముఖేష్‌ గౌడ, కృష్ణుడు, చైత్ర రాయ్‌, వర్షిణి సౌందరాజన్‌, సుధీర్‌ రెడ్డి, త్రిగుణ్‌, అలాగే కామనర్స్ సింగర్‌ ఝాన్సీ, రోహిత్‌ నాయుడు, అమన్‌, చరణ్‌, షాలిని, సృష్టి హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి వారంలో మిడ్‌ వీక్‌లోనే చైత్ర రాయ్‌, చరణ్‌ ఎలిమినేట్‌ అయ్యారు. ఆడియెన్స్ ఓటింగ్‌ ద్వారా చరణ్‌ని మళ్లీ హౌజ్‌లోకి తీసుకొచ్చారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anali OTT Release: కోర్టు స్టేతో ఆగిపోయిన క్రైమ్ సిరీస్, అనలి ఎప్పుడు రిలీజ్ అవుతుంది?
Recommended image2
Wild Card Entry List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 వైల్డ్ కార్డ్ అఫీషియల్‌ లిస్ట్.. ఏమాత్రం పసలేదు, ఇలా అయితే కష్టమే
Recommended image3
Baa Baa Black Sheep Review: బా బా బ్లాక్ షీప్ మూవీ రివ్యూ: క్రైమ్ కామెడీగా వచ్చిన మూవీ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Pithapuramlo Ala Modalaindi Review: పిఠాపురంలో అలా మొదలైంది మూవీ రివ్యూ.. కూతురిని ఎలా పెంచాలంటే?
Recommended image2
Secret Soldier Movie Review: సీక్రెట్‌ సోల్జర్‌ మూవీ రివ్యూ.. స్నేహం, స్పై యాక్షన్‌ మేళవించిన మూవీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved