MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Venkatesh: రోజాతో వెంకటేష్ సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇద్దరి మధ్య అసలు గొడవ ఇదే

Venkatesh: రోజాతో వెంకటేష్ సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇద్దరి మధ్య అసలు గొడవ ఇదే

Venkatesh: బాలయ్య, చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసిన రోజా.. వెంకటేష్ తో మాత్ర ఎక్కువగా మూవీస్ చేయకపోవడానికి కారణం ఏంటి? వీరిద్దరి మధ్య గ్యాప్‌కు అసలు కారణమేంటి? నటి రోజా వెల్లడించిన నిజాలు

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 19 2026, 10:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మూడు భాషల్లో స్టార్ హీరోయిన్ గా..
Image Credit : Asianet News

మూడు భాషల్లో స్టార్ హీరోయిన్ గా..

90ల కాలంలో టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోయిన హీరోయిన్లలో రోజా ఒకరు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి టాలీవుడ్ అగ్ర హీరోలతో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది రోజా. తెలుగులో మాత్రమే కాదు.. తమిళంలో విజయ్ కాంత్, శరత్ కుమార్, రజినీకాంత్ లాంటి స్టార్స్ కు జంటగా నటించి మెప్పించింది. కన్నడ సినిమాల్లో కూడా మెరిసిన ఈ తార..తెలుగులో విక్టరీ వెంకటేష్‌తో మాత్రం చాలా తక్కువ సినిమాల్లో మాత్రమే స్క్రీన్ పంచుకున్నారు. కారణం ఏంటో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రోజా భర్త వల్ల ఏం జరిగిందంటే?
Image Credit : Asianet News

రోజా భర్త వల్ల ఏం జరిగిందంటే?

రోజా వెంకటేష్ మధ్య తీవ్రమైన గొడవలు లేకపోయినప్పటికీ, కొన్ని అనుకోని పరిస్థితులు, మధ్యవర్తుల పొరపాట్లు , కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వారి కాంబినేషన్ నిలిచిపోయిందని రోజా ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వివరించారు. రోజా చెప్పిన వివరాల ప్రకారం..వీరిద్దరి మధ్య గ్యాప్ రావడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది దర్శకుడు, రోజా భర్త సెల్వమణి సినిమా రీమేక్ వివాదం. దర్శకుడు సెల్వామణి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఒక సినిమా పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి.

ఆ సమయంలో తమిళంలో విజయకాంత్ నటించిన ఒక సినిమా భారీ విజయం సాధించడంతో, అదే కాస్టింగ్‌తో సెల్వాకు తెలియకుండా వెంకటేష్, విజయశాంతి కాంబినేషన్‌లో ఆ రీమేక్‌ను ప్రొడ్యూసర్ ప్రారంభించారు. తమకు తెలియకుండా ఈ నిర్ణయం తీసుకోవడం, డేట్లు కేటాయించడం దర్శకుడు సెల్వాను తీవ్రంగా బాధించింది. ఆయన బాధపడటం చూసి.. అప్పటికే సెల్వను ప్రేమిస్తున్న రోజా కూడా ఫీల్ అయ్యారు..

35
అసలు విషయంపై రోజా క్లారిటీ..
Image Credit : Asianet News

అసలు విషయంపై రోజా క్లారిటీ..

ఈ ఘటన వల్ల వెంకటేష్, రోజాల మధ్య మానసికంగా చిన్నపాటి గ్యాప్ మొదలైంది. ఇక వీరిద్దరి మధ్య గ్యాప్ కు కారణమైన మరో సంఘటన కూడా ఉంది. 'పోకిరి రాజా' షూటింగ్ టైమ్ లో ఇది జరిగింది. వెంకటేష్, రోజా కాంబినేషన్‌లో వచ్చిన 'పోకిరి రాజా' సినిమా చిత్రీకరణ మైసూర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుండగా.. వారు నటించిన ఒక పాట రీల్ ల్యాబ్‌లో కట్ అయిపోవడంతో దాన్ని మళ్లీ రీషూట్ చేయాల్సి వచ్చింది.

ఆ సమయంలో రోజా ముందే ప్రొడక్షన్ టీమ్‌కు ఒక స్పష్టమైన విషయం చెప్పారు. అక్టోబర్ 22న సెల్వా పుట్టినరోజు ఉన్నందున, అక్టోబర్ 21 కల్లా తను హైదరాబాద్ వెళ్ళిపోవాలని, దానికి అనుగుణంగానే డేట్లు సర్దుబాటు చేయాలని కోరారు.ప్రొడక్షన్ టీమ్ సరేనని చెప్పి రోజాను పిలిపించినప్పటికీ.. అక్టోబర్ 22 ఉదయం వరకు చిన్న ప్యాచ్‌వర్క్ షూటింగ్ కూడా చేయకుండా ఆమెను అక్కడే ఉంచేశారు. తన వ్యక్తిగత సమయానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో అసహనానికి గురైన రోజా, ప్రొడక్షన్ టీమ్‌కు సమాచారం ఇచ్చి నేరుగా ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోయారు.

45
మధ్యవర్తుల వల్ల పెరిగిన దూరం
Image Credit : Asianet News

మధ్యవర్తుల వల్ల పెరిగిన దూరం

ఈ ఘటన తర్వాత ప్రొడక్షన్ యూనిట్ వారు తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి వెంకటేష్ కి తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని రోజా అభిప్రాయపడ్డారు. "వెంకటేష్ చెప్పినా వినకుండా రోజా కోపంతో వెళ్లిపోయింది" అని ఆయనకు చెప్పి ఉంటారని, దానివల్ల ఆయన తనపై కోపంగా ఉండి ఉంటారని ఆమె అన్నారు. ఆ తర్వాత ఈ విషయంలో రోజా కూడా వెంకటేష్‌కి నేరుగా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఆయనకే తెలుస్తుందిలే అని వదిలేశారు. అప్పటి నుంచి ఎందుకో వెంకటేష్ తన సినిమాల్లో రోజాను తీసుకోవడం మానేశారట. తమిళంలో సూపర్ హిట్ అయిన 'ఉన్నాడైతిల్ ఎన్నై కొడుతేన్' ఆధారంగా తెలుగులో వెంకటేష్ నటించిన 'రాజా' సినిమాలో రోజాకు రావలసిన అవకాశం సౌందర్యకు దక్కింది. తమిళంలో ఈ పాత్ర చేసినందుకు రోజాకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. అయినా సరే.. తనపై కోపం తగ్గకపోవడం వల్లే ఆ సినిమాలో అవకాశం రాలేదని ఆమె భావించారు.

55
రోజా మంత్రి అయ్యాక వెంకటేష్ ఏమన్నారు.
Image Credit : Asianet News

రోజా మంత్రి అయ్యాక వెంకటేష్ ఏమన్నారు.

వెంకటేష్ కు తనకు మధ్య ఎలాంటి ప్రత్యక్ష శత్రుత్వం, ద్వేషం లేదని రోజా స్పష్టం చేశారు. ఆ తర్వాత ఎప్పుడు కానిపించినా.. ఎదురైనా వెంకటేష్ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారని తెలిపారు. రోజా మంత్రి అయిన తర్వాత కూడా ఒక సారి ప్లైట్ లో కనిపించి.. "యు డిజర్వ్ ఇట్" అని ఆయన అభినందించారని, సినీ ఇండస్ట్రీలో ఉండే కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే తమ కాంబినేషన్‌లో ఎక్కువ సినిమాలు రాలేకపోయాయని రోజా స్పష్టం చేశారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
దగ్గుబాటి వెంకటేష్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Villains Turned Comedians: ఒకప్పుడు టెర్రర్ విలన్లు.. ఇప్పుడు కామెడీ స్టార్స్! రూటు మార్చిన 5గురు నటులు
Recommended image2
Jailer 2: జన నాయకన్ రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అయిన జైలర్ 2.. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ఇన్ని కోట్లా?
Recommended image3
Nidhhi Agerwal: తెలుగు అబ్బాయిలంటేనే ఇష్టం, పెళ్లి కూడా చేసుకుంటా, నిధి అగర్వాల్ కామెంట్స్ వైరల్
Related Stories
Recommended image1
Hitler Movie Review: మోహన్ బాబు వల్ల డిజాస్టర్స్ నుంచి బయటపడ్డ చిరంజీవి, డైరెక్టర్ ను భయపెట్టిన మెగా ఫ్యాన్స్.. హిట్లర్ మూవీ రివ్యూ
Recommended image2
Balakrishna: భోజనం ప్లేట్‌లో ఆ కూర లేకపోతే బాలయ్యకు ముద్ద దిగదు, బాలకృష్ణ ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved