MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నేనెవరిని డౌన్ చేయడంలేదు... ఎన్టీఆర్ పవర్ పంచ్ మెగాస్టార్ చిరంజీవి పైనేనా..?

నేనెవరిని డౌన్ చేయడంలేదు... ఎన్టీఆర్ పవర్ పంచ్ మెగాస్టార్ చిరంజీవి పైనేనా..?

బ్రహ్మాస్త్ర ప్రెస్ మీట్ సందర్భంగా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ కామెంట్స్ ఆయన చిరంజీవిని ఉద్దేఇంచి చేశారన్న మాటలు వినిపిస్తున్నాయి. మరి తారక్ విసిరిన పవర్ పంచ్ మెగాస్టార్ కేనా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 03 2022, 10:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బ్రహ్మస్త్ర స్పెషల్ ఈవెంట్ లో మాట్లాడుతూ..  ప్రపంచ సినిమా ప్రస్తుతం  ఒత్తిడికి గురవుతుంది అన్నారు.  ఆడియన్స్ కొత్తగా ఏదో  కోరుకుంటున్నారని.. దాని వల్లే ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి అన్నారు. వారికి  ఇంకా ఏదో కావాలి అని కోరుకుంటున్నారు. ఇది నమ్ముతూ.. ఆ ఒత్తిడిని తట్టుకుని నా వరకు నేను ఇంకా బాగా నటించేందుకు ప్రయత్నం చేస్తాను అన్నారు తారక్. అంతే కాదు ఇది ఒక ఛాలెంట్ గా తీసుకుని ఫిల్మ్ ఇండస్ట్రీ కష్టపడాల్సిన అవసరం ఉంది అన్నారు. అందుకే ఈ ఒత్తిడి మంచిదే... దీని వల్ల మంచి సినిమాలు బయటకు వస్తాయన్నారు తారక్. 

27

.ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించే బాధ్యత మన ముందు ఉంది అన్నారు తారక్. అది సాకారం చేస్తూ..ముందుకు వెళదాం అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. అయితే ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యులు మెగాస్టార్ చిరంజీవికి కౌంటర్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఆచార్య ఫెయిల్యూర్ తరువాత మెగాస్టార్ చిరంజీవి దర్శకులను గట్టిగా విమర్షిస్తూ వస్తున్నారు. ఇండైరెక్ట్ గా ఆచార్య దర్శకుడు కొరటాల శివ పైన కూడా గ్టటిగానే విరుచుకుపడుతున్నారు. 

37

కొరటాలకు దన్నుగా నలిచే క్రమంలోనే తారక్ ఈ  వ్యాఖ్యలు చేశారంటూ గుసగుసలాడుకుంటున్నారు ఇండస్ట్రీలో.. రీసెంట్ గా ఓ వేదికపై మాట్లాడిన చిరంజీవి.. డైరెక్టర్స్ కు చురకలంటించారు.  డైరెక్టర్స్ కరెక్ట్‌గా ఉండకపోతే.. ఫ్లాప్సే వస్తాయని చెబుతూ.. అందుకు తన సినిమానే ఎక్జాంపుల్ అన్నారు.. కొరటాల శివను వేలు ఎత్తకుండానే టార్గెట్ చేశారు.  డైరెక్టర్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండాలని, డేట్స్ క్లాష్ అవుతున్నాయనో.. ఇంకేదో కారణాలతో కంగారుకంగారుగా షూటింగ్స్ చేయవద్దని.. మీపై ఒక ఇండస్ట్రీనే ఆధారపడి ఉందని గుర్తుంచుకోవాలంటూ.. డైరెక్టర్స్‌కి పాఠాలు చెప్పారు. 

47

అయితే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య ప్లాప్ అవ్వడంతో..కొరటాలను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని ఇండస్ట్రీలో తెగ చెర్చించుకుంటున్నారు. బ్రహ్మాస్త్ర ఈవెంట్ లో ఎన్టీఆర్ ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారని.. ప్రపంచ సినిమానే ఒత్తిడిలో ఉందని.. సినిమా ప్లాప్ అయితే ఏ ఒక్కరిని నిందించాల్సిన అవసరం లేదు అంటూ తారక్ మాట్లాడిన మాటలు.. ఆయన్ను ఉద్దేశించే అంటున్నారు సినీ జనాలు. ఇలా కొరటాలను కాపాడుతూ.. ఆయన ఇండస్ట్రీలో ఒంటరి కాకుండా తారక్ కాపాడుతున్నాడంటున్నారు. 

57

అంతే కాదు ఇప్పుడందరూ అప్‌డేట్ కావాలనేలా మాట్లాడి చిరుకు ఎన్టీఆర్ పవర్ పంచ్ ఇచ్చాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ స్టార్ట్ అయ్యింది.  అందులోనూ.. ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా కొరటాల శివతో చేస్తున్నాడు. గతంలో కూడా జనతా గ్యారేజ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ను తారక్ కు ఇచ్చాడు కొరటాల. అందుకే ఎన్టీఆర్ కొంరటాలకు సపోర్ట్ గా నిలబడ్డాడంటూ.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 
 

67

ఇక రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున లాంటి స్టార్స్ నటించిన సినిమా బ్రహ్మాస్త. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈమూవీ ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. హిందీతో పాటు  తెలుగు,  తమిళ, కన్నడ,  మలయాళ  భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇక   సౌత్‌లో ఎస్.ఎస్. రాజమౌళి ఈ సినిమాను  సమర్పిస్తున్నారు. 

77

బ్రహ్మాస్త్ర ప్రమోషన్‌లో భాగంగా శుక్రవారం రామోజీ ఫిల్మ్ సిటీ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. భారీగా ఏర్పాట్లు  కూడా చేశారు. కానీ, వినాయకచవితి హడావిడి ఉండటంతో.. తాము  రక్షణ కల్పించలేమంటూ..  పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. దీంతో చివరి నిమిషంలో  వేడుకను రద్దు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ పార్క్ హయాత్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mohanlal: బస్సు జర్నీని గుర్తు చేసుకున్న మోహన్‌ లాల్‌.. అదే తన జీవితాన్ని మార్చేసిందంటూ ఎమోషనల్‌
Recommended image2
వరుస హిట్లతో దూసుకుపోతున్న దర్శకులకు చుక్కలు చూపించిన ఫ్లాప్ మూవీస్..ఈ 5 సినిమాల గురించి తెలుసా
Recommended image3
మోదీ, అమిత్ షా కు విజయ్ - రష్మిక ఆహ్వానం... రిసెప్షన్ కు ప్రధాని వస్తారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved