MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • పవన్ తో నటిస్తే ఆ హీరోయిన్ కెరీర్ గోవిందా... ఆ బ్యాడ్ సెంటిమెంట్ కి బలైన పూర్ హీరోయిన్స్ వీరే!

పవన్ తో నటిస్తే ఆ హీరోయిన్ కెరీర్ గోవిందా... ఆ బ్యాడ్ సెంటిమెంట్ కి బలైన పూర్ హీరోయిన్స్ వీరే!

సెంటిమెంట్స్ చూడడానికి సిల్లీగా ఉంటాయి కానీ.. ప్రతిసారి జరుగుతుంటే నమ్మాల్సిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన నటిస్తే ఆ హీరోయిన్ సంగతి అంతే. ఈ సెంటిమెంట్ పలువురు హీరోయిన్స్ విషయంలో నిజమైంది.   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Sep 02 2022, 05:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Pawan Kalyan Heroines

Pawan Kalyan Heroines

పవన్ కళ్యాణ్ ఫస్ట్ హీరోయిన్ సుప్రియ నుండి దేవయాని, రేణు దేశాయ్, మీరా  జాస్మిన్, అమీషా పటేల్, నికీషా పటేల్ ఇలా ఎందరో ఈ సెంటిమెంట్ కి బలయ్యారు. పవన్ కి జంటగా నటించాక పరిశ్రమ నుండి కనుమరుగైన హీరోయిన్స్ ఎవరో చూద్దాం... 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Pawan Kalyan Heroines

Pawan Kalyan Heroines


అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుప్రియ పవన్ డెబ్యూ మూవీ 'ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి'లో హీరోయిన్ గా నటించారు. తర్వాత ఆమె కనిపించలేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా గూఢచారి లాంటి చిత్రాలు చేశారు. పవన్-దేవయాని కాంబినేషన్ లో వచ్చిన సుస్వాగతం సూపర్ హిట్ అందుకుంది. దేవయాని మాత్రం హీరోయిన్ గా సక్సెస్ కాలేదు. 

37
Pawan Kalyan Heroines

Pawan Kalyan Heroines


తొలిప్రేమ టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా ఉంది. ఆ చిత్ర హీరోయిన్ కీర్తి రెడ్డి ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. పవన్ సెంటిమెంట్ కి బలైన ఆమె పరిశ్రమలో కనుమరుగైపోయారు. తమ్ముడు ఫేమ్ ప్రీతి జింగ్యానీ పరిస్థితి కూడా సేమ్, మంచి పాపులారిటీ తెచ్చుకొని కూడా కెరీర్ లో ఎదగలేకపోయారు. 

47
Pawan Kalyan Heroines

Pawan Kalyan Heroines

ఇక బద్రి సినిమాలో హీరోయిన్స్ గా నటించిన అమీషా పటేల్,రేణూ దేశాయ్ కూడా ఈ బ్యాండ్ సెంటిమెంట్ ని అధిగమించలేక పోయారు. రేణు ఆయన్నే పెళ్లి చేసుకొని కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టగా, అమీషా పటేల్ మాత్రం నిలదొక్కుకోలేకపోయారు. బద్రి అనంతరం తెలుగులో ఆమె చేసిన నరసింహుడు అట్టర్ ప్లాప్.  కాగా గుడుంబా శంకర్ సినిమాలో పవన్ తో జతకట్టే ఛాన్స్ కొట్టేసింది మీరా జాస్మిన్. ఈ మూవీ పరాజయం కాగా మీరా జాస్మిన్ కెరీర్ కూడా గాల్లో కలిసిపోయింది.

57
Pawan Kalyan Heroines

Pawan Kalyan Heroines


బంగారం అంటూ బరిలో దిగిన మీరా చోప్రా పరిస్థితి అగమ్యగోచరం. పవన్ బంగారం ప్లాప్ కావడంతో పాటు మీరా కెరీర్ కి చరమ గీతం పాడింది. ఇక జల్సాలో జతకట్టిన ఇలియానా కళ్ళముందే కనుమరుగై పోయింది. బాలీవుడ్ అంటూ ముంబై పోయి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. జల్సా తర్వాత ఆమె టైం రివర్స్ అయ్యింది. 

67
Pawan Kalyan Heroines

Pawan Kalyan Heroines

పవన్ సెంటిమెంట్ కి బలైన మరో యంగ్ హీరోయిన్ నికీషా పటేల్. పవన్ తో ఛాన్స్ కొట్టేశానని ఎగిరి గంతేసిన ఆమె ఆనందం ఆవిరైపోయింది. ఆమె హీరోయిన్ గా నటించిన పులి అట్టర్ ఫ్లాప్ అయ్యింది.ఆపై నికీషా పటేల్ కి చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. మెల్లగా ఫేడ్ అవుటై ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోయింది. పంజా సినిమాలో పవన్ కి జంటగా కనిపించిన సారా జేన్ దియాస్, అంజలి లావణ్య ఎటెళ్ళారో దేవుడికే తెలియాలి.

77
Anu Immanuel

Anu Immanuel

అజ్ఞాతవాసి చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటించారు. కీర్తి సురేష్ పవన్ సెంటిమెంట్ ని అధిగమించి స్టార్ అయ్యింది. అను ఇమ్మానియేల్ మాత్రం బలైంది. ఆమెకు కనీస అవకాశాలు లేవు. దాదాపు ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది. ఇలా పదికి పైగా హీరోయిన్స్ పవన్ తో నటించి పరిశ్రమ నుండి వెళ్లిపోయారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: షాలిని, రోహిత్ కి ఝలక్ ఇచ్చిన ఆడియన్స్..డేంజర్ జోన్ లో ఉన్నదెవరో పరోక్షంగా చెప్పేసిన నాగార్జున
Recommended image2
Kayadu Lohar: స్టైలిష్ శారీలో ప్యారడైజ్ బ్యూటీ.. కయాదు లోహర్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్
Recommended image3
Deepika Padukone: రెండో బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె.. గుడ్ న్యూస్ షేర్ చేస్తూ పోస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved