భర్తకు దూరంగా ఉంటోన్న స్నేహా..? కారణమేంటి..? వైరల్ అవుతున్న న్యూస్
ఫిల్మ్ ఇండస్ట్రీలో చలా మంది స్టార్స్ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అందులో కొంత మంది అన్నోన్యంగా కాపురాలు చేసుకుంటుంటే.. మరికొంత మంది మాత్రం విడాకులతో వీధిన పడ్డారు. ఇక ఈ లిస్ట్ లోకి తాజాగా స్నేహ దంపతులు కూడా వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది.

Sneha Prasanna
హీరోయిన్ స్నేహ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు సావిత్రి.. తరువాత సౌందర్య.. ఆతరువాత కాస్త ఆకోవలోనే ఉంటుంది స్నేహ. హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన బ్యూటీ.. ఆరువాత పెళ్ళి చేసుకుని సెటిల్ అయ్యింది.
హీరోయిన్ స్నేహ.. నటుడు ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకుంది, హ్యాపీగా తన లైఫ్ ను లీడ్ చేస్తుంది. ఇద్దరు తారలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకున్నారు. అంతే కాదు ఇద్దరు పిల్లలతో స్నేహ చాలా హ్యాపీగా ఉంది అని ఫ్యాన్స్ కూడా సంబర పడ్డారు
అంతే కాదు సోషల్ మీడియాలో, పలు సందర్భాలలో స్నేహా ఫ్యామిలీతో సందడి చేస్తూ వస్తోంది ఈ క్యూట్ ఫ్యామిలీని చూసి అంతా ఆనందపడుతున్న టైమ్ లో.. సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. స్నేహ తన భర్తకు దూరంగా ఉందంటు రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి. వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు దీనికి కారణం అని తెలుస్తుంది.
నటుడు ప్రసన్నను ప్రేమించిన స్నేహా.. దాదాపు ఐదేళ్లు టైమ్ తీసుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్ళి పెద్దలకు ఇష్టం లేకపోవడంతో.. బలవంతంగా ఒప్పించి పెళ్లాడారట. దాంతో అప్పటి నుంచి ఏదో రకంగా గొడవలు అవుతూ వస్తున్నాయట. అవి కాస్తా.. భార్య భర్తల గొడవలుగా మారిపోయాయని సమాచారం.
Sneha Prasanna
అయితే కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ కారణంగా స్నేహ ప్రసన్నల మధ్య దూరం పెరిగిందని ..ఈ కారణంగానే మాట మాట పెరిగి స్నేహ, ప్రసన్నకు దూరంగా వేరే ఇంట్లో ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ వార్త తెలుసుకున్న అభిమానులు బాధపడిపోతున్నారు .
ఈ విషయంలో నిజం ఎంత ఉందో తెలియదు కాని. ప్రస్తుతం ఈన్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు కూడా ఇలా అయితే ఎలా అంటూ.. రకరకాల కామెంట్లు పెడుతున్నారు జనాలు.