MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • సమంతకు వచ్చిన వ్యాధి ఎంత భయంకరమైనదో తెలుసా..? నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతులు, వ్యాధి లక్షణాలు ఇవే.. ?

సమంతకు వచ్చిన వ్యాధి ఎంత భయంకరమైనదో తెలుసా..? నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతులు, వ్యాధి లక్షణాలు ఇవే.. ?

అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పింది సమంత. తాను మయోసైటిస్ అనే వింత వ్యాధితో బాధపడుతున్నట్టు సోషల్ మీడియాలో వెల్లడించింది. దాంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఇంతకీ సమంత బాధపడుతున్న ఆవ్యాధి ఏంటి..?అది అంత ప్రమాదమా..? లక్షణాలు ఏలా ఉంటాయి..? 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 29 2022, 07:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

చాలా కాలంగా సమంత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు   చాలా రోజులుగా వార్తలు వస్తునే ఉన్నాయి. అయితే గాసిప్స్ సహజం కదా అనుకున్నారు అంతా. అయితే  ఆమె కొంత కాలంగా కనిపించకపోవడం.. . అమెరికాలో చికిత్స తీసుకుంటుందని కూడా చర్చ జరిగింది. కానీ ఏప్పుడూ ఈ విషయంలో స్పందించలేదు సమంత.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

తాజాగా తన ఆనారోగ్యం గురించి రహస్యం విప్పింది సమంత.  సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.  యశోద సినిమా కు సమంత ప్రస్తుతం డబ్బింగ్ చెబుతున్న ఫోటోను పోస్ట్ చేసింది. అయితే  సమంత డబ్బింగ్ చెప్పే సమయంలో చేతికి సెలైన్ బాటిల్ ఉండటం ఫ్యాన్స్ ను  ఆందోళనకు గురి చేసింది. ఈ పోస్ట్ తో పాటు తన బ్యాధి గురించి కూడా చెప్పింద సమంత. తాను మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నానని, దానికి చికిత్స కూడా తీసుకుంటున్నట్లు సమంత పేర్కొన్నది. 

39

అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగుపడిందని.. త్వరలోనే పూర్తిగా కోలుకుంటానని కూడా చెప్పింది.  ఈ విషయం తెలియడంతో అంతా షాక్ అయ్యారు. అయితే అసలు ఏంటీ వ్యాధి.. ఎందుకు వస్తుంది..? ఎవరికి ఎక్కువగా వస్తుంది...? సమంతకు రావడానికి కారణం ఏంటీ..? అసలు ఈ  మయోసైటిస్ వ్యాధి లక్షణాలు  ఎలా ఉంటాయి అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. చాలా మంది ఈ విషయంపై గూగుల్  లో  సెర్చ్ చేస్తున్నారు. 

49

ఆటో ఇమ్యూన్  కారణంగా శరీరంలో  ఏర్పడే కొన్ని లక్షణాల కలయికను మయోసైటిస్ అని పిలుస్తుంటారు. దీని వల్ల కండరాలు బలహీనంగా మారడమే కాకుండా త్వరగా అలసట రావడం, నొప్పి ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కండరాలకు వచ్చే ఇన్‌ఫెక్షన్‌నే 'మయోసైటిస్ అని అంటున్నారు డాక్టర్లు. అయితే ఈ వ్యాధి రకరకాలుగా ఉంటుంది. అందులో సమంతకు వచ్చిన వ్యాధి ఏ రకమో ఆమె తెలుపలేదు. 

59

ఈ వ్యాధితో బాధపడేవారి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంటుంది. మయోసైటిస్ లో చాలా రకాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా వచ్చేవాటిలో పాలిమయోసైటిస్ ఒకటి.  ఇది వచ్చినవారికి  కండరాల నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ చిన్న పని చేసినా తొందరగా అలిసిపోతారు. కొంత దూరం నడిస్తే ఆయాసపడతారు.. అంతే కాదు ఒక్కోసారి తెలియకుండానే కింద పడిపోతారు

69

ఇక మరో రకం డెర్మటోమయోసైటిస్.  దీని వల్ల వాపు కూడా ఉంటుంది. పిల్లలు మహిళల్లో  దీని లక్షణాలు ఎక్కువగా  కనిపిస్తుంటాయి. చర్మంపై దద్దుర్లు రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి వారిని చాలా ఇబ్బంది పెడతాయంటున్నారు డాక్టర్లు. 

79

ఇక మూడో రకం  ఇన్ క్లూజన్ బాడీ మయోసైటిస్  దీని వల్ల భుజాలు, నడుము, తొడ కండరాలు ఎక్కువగా  ప్రభావితం అవుతాయి. ముంజేతి, మోకాలి  కండరాలు ఈ వ్యాధి వల్ల ప్రభావితం అవుతాయి. అవి పట్టేస్తాయి.. బాగా నొప్పి కూడా ఉంటుంది. దీని వల్ల వ్యాధిగ్రస్తులు  బాగా నీరసానికి  గురవుతారు. ఇది ఎక్కువగా 50 ఏళ్ళు దాటినవారికి సంక్రమిస్తుంది. 

89

ఒక్కోసారి మయోసైటిస్ ప్రభావం తీవ్రత పెరిగితే అది శరీరంలోని ఇతర భాగాలన్నింటిపై  కూడా ప్రభావం చూపిస్తుంది. చర్మం, ఊపిరితిత్తులు, గుండెపై ఈ వ్యాధి ప్రభావం ఉంటుంది. ఈ వ్యాధి వచ్చిన వారికి ఒక్కోసారి ఊపిరి తీసుకోవడం, మింగడం కష్టంగా మారుతుంది. ఈ వ్యాధికి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ లేదు. ఉపశమనానికి మందులు మాత్రమే ఉన్నాయి. అంతే కాదు  ఈ వ్యాధి వచ్చిన వారిలో కొందరు వీల్ చైర్ కు పరిమితం అవ్వవచ్చు.. లేదా పంచానికే పరిమితం అవ్వొచ్చు. 

99

కాని తమ జీవన శైలిలో మార్పులు, ఫుడ్ విషయంలో జాగ్రత్తలు ఎక్కువ కాలం జీవించేలా కాపాడతాయి. ఇవన్నీ పాటించకపోతే 5 ఏళ్ళలోపే పేషంట్ మరణించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక సమంతకు ఏరకం  మయోసైటిస్ వచ్చింది అన్న విషయంలో క్లారిటీ లేదు. కాని సమంత యంగ్ ఏజ్ లోనే ఉంది కాబట్టి.. జాగ్రత్తలు తీసుకుంటూ.. మెడిసిన్ వాడితే త్వరగా కోలుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్నే ఆమె కూడా వెల్లడించారు. నేను చాలా వరకూ కోలుకున్నాను అని సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు సమంత. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay London Trip: బ్రిటన్‌లో ఫ్యామిలీ రీయూనియన్? భార్య సంగీతను కలవనున్న సీఎం విజయ్?
Recommended image2
Duniya Vijay Divorce: భార్యకి విడాకులు ఇచ్చిన బాలయ్య విలన్‌, భరణం కింద 2 కోట్లు.. మరో కండీషన్‌ కూడా
Recommended image3
Vijay Deverakonda: రామ్ చరణ్ కాదు, శ్రీకృష్ణుడిగా విజయ్ దేవరకొండ.. రీమేక్ మూవీపై పెరుగుతున్న అంచనాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved