MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • డిసెంబర్ లో కియారా-సిద్ధార్థ్ మ్యారేజ్... వేదిక వరల్డ్ మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ?

డిసెంబర్ లో కియారా-సిద్ధార్థ్ మ్యారేజ్... వేదిక వరల్డ్ మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ?

బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా-సిద్దార్థ్ పెళ్ళికి సిద్ధమవుతున్నారట. డిసెంబర్ లో వీరి వివాహం ఘనంగా జరగనుందట. బాలీవుడ్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతుంది. వీరి వివాహానికి వేదిక కూడా సిద్ధమైపోయిందట.  

1 Min read
Author : Sambi Reddy
Published : Oct 08 2022, 06:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


చాలా కాలంగా కియారా అద్వానీ సిద్దార్థ్ మల్హోత్రా ప్రేమించుకుంటున్నారు. అయితే అధికారిక ప్రకటన జరగలేదు. తమ ప్రేమ వార్తలను కియారా, సిద్ధార్థ్ ఖండించలేదు. అదే సమయంలో సమర్ధించలేదు. కాగా వారి మధ్య రిలేషన్ ఉందనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. తరచుగా కియారాతో సిద్దార్థ్ టూర్స్ కి చెక్కేస్తారు. ఇక ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కలిసి పాల్గొంటారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

సిద్దార్థ్ ఇంటికి కియారా పేరెంట్స్ వెళ్లడం అలాగే కియారా ఇంటికి సిద్దార్థ్ పేరెంట్స్ రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళది కేవలం స్నేహం అంటుకుంటే పప్పులో కాలేసినట్లే. ప్రేమ వార్తలను ఖండించడక పోవడానికి కూడా కారణం వారు ప్రేమికులు కాబట్టే అంటారు. 
 

35
Image: Sidharth Malhotra, Kiara Advani/Instagram

Image: Sidharth Malhotra, Kiara Advani/Instagram


తాజా సమాచారం ప్రకారం సిద్దార్థ్ తో కియారా పెళ్ళికి సిద్ధమయ్యారట. పెళ్ళికి ముహూర్తం, వేదిక కూడా నిర్ణయించేశారట. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసిన ఈ జంట వియన్నాలో పెళ్లి చేసుకోనున్నారట. డిసెంబర్ లో ముహూర్తం ఫిక్స్ చేశారట. మరో మూడు నెలల్లో కియారా ఇంటిలో పెళ్లి భాజా మోగడం ఖాయమే అంటున్నారు. 
 

45


దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. ప్రస్తుతం కియారా రెండు హిందీ చిత్రాలతో పాటు రామ్ చరణ్ కి జంటగా ఆర్సీ 15 లో నటిస్తున్నారు. గతంలో చరణ్ వినయ విధేయ రామ మూవీలో కియారా నటించారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్సీ 15 పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. 

55

ఇక సిద్దార్థ్ థాంక్ గాడ్, యోధ, మిషన్ మజ్ను చిత్రాల్లో నటిస్తున్నారు. మిషన్ మజ్ను మూవీలో రష్మిక మందాన హీరోయిన్ కావడం విశేషం. ఇక యోధ చిత్రంలో రాశి ఖన్నా ఆయనతో జతకడుతున్నారు. కియారా, సిద్దార్థ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ashu Reddy: అష్షు రెడ్డి ఎంగేజ్మెంట్ లో బిగ్ ట్విస్ట్.. తెరమీదకు బిగ్ బాస్ టైటిల్ విన్నర్, విషయం ఏంటంటే?
Recommended image2
దెబ్బ తిన్నాడు, మళ్ళీ లేచాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మరో రెండు క్రేజీ అప్డేట్లు
Recommended image3
Panchali Panchabhartruka: క్విక్‌ గన్‌ మురుగన్‌గా రాజేంద్రప్రసాద్‌.. `పాంచాలి పంచభర్తృక`లో నటకిరీటి రచ్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved