MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Karthika Deepam: మోనితను మెడబట్టి బైటికి గెంటేసిన దీప.. సౌందర్య ఇంటికి వెళ్లిన కార్తీక్,దీప?

Karthika Deepam: మోనితను మెడబట్టి బైటికి గెంటేసిన దీప.. సౌందర్య ఇంటికి వెళ్లిన కార్తీక్,దీప?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు జనవరి 11వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Jan 11 2023, 08:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య ఎందుకే ఇలా చేశావు చెప్పు అని జుట్టు పట్టుకోగా వదలండి ఆంటీ ఇప్పటికే నీ కొడుకు నా వైపు చూడడం లేదు. జుట్టు చెదిరిపోతే అస్సలు చూడడు అనడంతో దీప కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అయినా ఏం జరిగిందో నీ కొడుకు కోడలు చెప్పి ఉంటారు కదా మళ్లీ నన్ను అడుగుతున్నారు ఏంటి అని ఉంటుంది. వాళ్లు కొంతకాలం రాకపోవడానికి నేనే కారణం. కానీ నేను జైలుకు వెళ్లిన తర్వాత మాత్రం నాకు తెలియదు అని అంటుంది మోనిత. ఇప్పుడు ఏటి దీప ఏంటి కార్తీక్ నువ్వు కూడా ఇంకా చెప్పలేదా ఇన్నాళ్లు ఆంటీ వాళ్ళు కనిపించలేదు కాబట్టి చెప్పలేదంటే ఓకే ఇప్పుడు కనిపించిన తర్వాత కూడా ఎందుకు దానిని దాస్తున్నారు అని అనగా దీప కార్తిక్ బయటకు వెళ్తావా లేదా అని సీరియస్ అవుతారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

 ఏం చెప్తుంది రా ఇది మీరు నా దగ్గర ఏం దాస్తున్నారు అని సౌందర్య అడగడంతో అదేం లేదు అత్తయ్య ఇది మన కుటుంబంలో గొడవలు పెట్టాలని చూస్తోంది అని మోనితను బయటకు గెంటేయాలని చూస్తుంది దీప. అప్పుడు మోనిత అసలు నిజం చెప్పబోతుందిగా దీప బయటకు గెంటేస్తుంది. తర్వాత సౌందర్య పెద్దోడా మోనిత ఏదో వాగుతోంది ఏమిటది అనడంతో దీప కార్తిక్, ఏమీ లేదు అనడంతో మీరేమో ఏమీ లేదు అంటున్నారు అదేమో ఏదేదో వాగుతోంది అని సీరియస్ అవుతుంది సౌందర్య. ఒక క్షణం కూడా మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఇప్పుడే లగే సర్దుకొని వెళ్లి పోదాము అని అంటుంది. మరొకవైపు మోనిత టీ పాయ్ పగలగొట్టడంతో చేతికి దెబ్బ తగలగా చారుశీల ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది.

37

 ఎందుకు ఇలా చేశావు మోనిత అని అనగా కార్తీక్ పై నాకున్న ప్రేమ ఇలా చేసింది కానీ కార్తీక్ నన్ను అర్థం చేసుకోవడం లేదు అని అంటుంది. అప్పుడు చారుశీల ఎందుకు మోనిత కార్తీక్ ని వదిలేసెయ్, ఎలాగో కార్తీక్ కి నీ మీద ప్రేమ లేదు కదా అని సలహాలు ఇస్తుంది. కార్తీక్ ని మార్చడానికి ఇన్నేళ్లు నా ప్రేమ ఎలా అయినా కార్తీక్ ని మారుస్తాను చారుశీల అని అంటుంది. మరొకవైపు సౌందర్య కార్తిక్ కి భోజనం వడ్డిస్తూ ఉండగా కార్తీక్ మాత్రం దీప వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు సౌందర్య ఆలోచిస్తూ ఆ మోనిత చెప్పింది నిజమేనా నా దగ్గర ఇద్దరు ఏదైనా నిజం దాస్తున్నారా అని మనసులో అనుకుంటూ ఉంటుంది సౌందర్య. ఇప్పుడు పిల్లలు ఇద్దరు దీపని అన్నం తీసుకుని రా అని తొందర పెడుతూ ఉంటారు.

47

అప్పుడు దీప అక్కడికి రావడంతో కార్తీక్ దీప ఇద్దరూ సైగలు చేసుకుంటూ ఉండగా అది చూసి సౌందర్య వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఇద్దరూ ఏవో మూగ సైగలు చేసుకుంటున్నారు ఏదో నిజం దాస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు సౌందర్య ఏంటో చెప్పండి ఎందుకు పరద్యానంగా ఉన్నారు అని నిలదీయగా దీప కార్తీక్ నవ్వుతూ కామెడీ చేస్తూ మాట దాటేస్తారు. ఇంతలోనే అక్కడికి అంజి వస్తాడు. నీకు కూడా నిజం తెలుసు కదా అని అనగా మనం మొదట వెళ్ళినప్పుడు నాకు ఆ నిజం తెలియదు ఆ తర్వాత వెళ్తే మా అమ్మ దీపమ్మ వాళ్ళ ఇంట్లోనే పనిచేస్తుంది అప్పుడు నాకు తెలిసింది అని అంటాడు అంజి. మరొకవైపు మోనిత జరిగిన విషయాలు తలచుకొని ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.

57

ఇంతలోనే అక్కడికి చారుశీల వస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు మోనిత ఏదైనా ప్లాన్ వేసావా అనగా ఏమి ఆలోచించాలి అర్థం కావడం లేదు అందరూ ఒకటయ్యారు అని అంటుంది మోనిత. అప్పుడు నిన్ను మధ్యలో ఉపయోగించుకుందాము అనుకుంటే నేను నిజం చెప్పే తప్పు చేశాను అనడంతో జైలు నుంచి రాగానే నిన్ను ఎవరు నిజం చెప్పమన్నారు మోనిత అనడంతో ఏంటి కార్తీక్ ని దక్కించుకునే అవకాశం పోయింది అనుకుంటున్నావా అని అడగగా 12 ఏళ్ళ నుంచి ప్రేమిస్తున్న నీకే ఏమి దొరకలేదు ఇంకా నాకేం దొరుకుతుంది అని అంటుంది. ఆ సంగతి పక్కన పెట్టి ప్రస్తుతం ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించు అని అంటుంది.
 

67

ఇప్పటికి రెండుసార్లు కార్తీక్ నా నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు ఈసారి మాత్రం అలా జరగకూడదు అనే మోనిత అనడంతో ముందు కార్తీక్ మనసులో నువ్వు స్థానం సంపాదించుకో అప్పుడు కార్తిక్ కి నీ వెనకాలే వస్తాడు అని సలహాలు ఇస్తుంది. ప్రస్తుతం కార్తీక్ నీ వైపు కూడా చూడటం లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించు అనడంతో ఎలా అయినా కార్తీక్ ని దక్కించుకుంటాను అని చారుశీలతో చెబుతుంది మోనిత. ఆ తర్వాత కార్తీక్ ఎందుకు మమ్మీ వాళ్లకు కనిపించావు ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోయే వాళ్ళం కదా అని అనడంతో ఎక్కడికి వెళ్తారు బంధాలు అన్ని వదిలేసి అని అంటుంది దీప. నన్ను అంటే వదిలేసేయ్ మరి మీరు పిల్లలకు ఎలా కనిపించారు. ఎప్పుడు ఎవరిని ఎలా కలపాలో ఆ దేవుడికి బాగా తెలుసు అని అంటుంది దీప.

77

వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా సౌందర్య వీళ్లిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు వింటే తప్ప అసలు నిజం ఏంటో తెలియదు అని దీప వాళ్ళు మాట్లాడుకుంటున్న ప్రదేశానికి వెళుతుంది. అప్పుడు ఇంతలో సౌందర్య అక్కడికి రావడం చూసిన సౌందర్య మాట మార్చి ఆనందరావు గురించి మాట్లాడటంతో కార్తీక్ కూడా టాపిక్ చేంజ్ చేసి మాట్లాడుతాడు. అప్పుడు సౌందర్యకి అర్థం కాక అలాగే చూస్తూ ఉంటుంది. ఇప్పుడు సమయానికి నేను చూసాం కాబట్టి సరిపోయింది లేకపోతే అత్తయ్య మన మాటలు వినేవారు డాక్టర్ బాబు అని అంటుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 20: బిగ్ బాస్ 20 గ్రాండ్ లాంచ్.. మేరీ కోమ్ నుంచి కనికా మాన్ వరకు.. హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు వీరే
Recommended image2
Bigg Boss: బిగ్ బాస్ లో హైయెస్ట్ పెయిడ్ హోస్ట్ ఎవరు.. నాగార్జునని మించిపోయిన క్రేజీ విలన్
Recommended image3
Bigg Boss: బిగ్ బాస్ 20లో మేరీ కోమ్ గ్రాండ్ ఎంట్రీ.. వార్నింగ్ ఇచ్చిన ప్రియాంక చోప్రా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved