MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • హీరో వెంకటేష్‌పై కేసు నమోదు, హోటల్‌ వివాదంలో నాంపల్లి కోర్ట్ సీరియస్‌, ఏం జరిగిందంటే?

హీరో వెంకటేష్‌పై కేసు నమోదు, హోటల్‌ వివాదంలో నాంపల్లి కోర్ట్ సీరియస్‌, ఏం జరిగిందంటే?

హీరో వెంకటేష్‌, నిర్మాత సురేష్‌ బాబు, హీరో రానాలపై కేసు నమోదైంది. ల్యాండ్‌ వివాదంలో నాంపల్లి కోర్ట్ సీరియస్‌ అయ్యింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 12 2025, 11:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

వెంకటేష్‌ వివాదాలకు దూరంగా ఉండే హీరో. పూర్తిగా ప్రైవేట్‌ లైఫ్‌కే పరిమితం. బయట చాలా తక్కువగా కనిపిస్తారు. సినిమాలు, ఫ్యామిలీ, రామానాయుడు స్టూడియో అన్నట్టుగా ఉంటుంది. అలాంటి వెంకటేష్‌పై తాజాగా కేసు నమోదైంది. మరో రెండు రోజుల్లో ఆయన హీరోగా నటించిన `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు కావడం ఆశ్చర్యపరుస్తుంది. మరి వెంకటేష్‌ ఏంచేశాడు? వారి దగ్గుబాటి ఫ్యామిలీ ఏం చేసింది. వారిపై కేసు ఎందుకు నమోదైందనేది చూస్తే. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఫిల్మ్ నగర్‌లోని దక్కన్‌ కిచెన్‌ హోటల్‌ కూల్చివేత వివాదంగా మారింది. దీన్ని కూల్చేసింది దగ్గుబాటి ఫ్యామిలీనే. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బాధితుడిగా ఉన్న నందకుమార్ కి చెందిన దక్కన్‌ కిచెన్‌ హోటల్‌ స్థలం విషయంలో దగ్గుబాటి కుటుంబంతో వివాదం నెలకొంది. ఇది తమది అని వెంకటేష్‌, సురేష్‌ బాబులు, వారి ఫ్యామిలీ పట్టుపడుతుంది. కానీ మాది అని నందకుమార్‌ అంటున్నారు. అందులో హోటల్‌ కూడా రన్‌ చేస్తున్నారు. అయితే రెండేళ్ల క్రితమే(2022 నవంబర్‌)లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది, బౌన్సర్లతో కలిసి హోటల్‌ని పాక్షికంగా కూల్చేశారు. 
 

35

దీంతో కోర్ట్ ని ఆశ్రయించాడు నందకుమార్‌. నాంపల్లిలోని సిటీ సివిల్‌ కోర్ట్ ని ఆశ్రయించగా, ఈ కేసు పెండింగ్‌లో ఉంది. దీనిపై హైకోర్ట్ ని ఆశ్రయించగా, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్ట్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ శనివారం హోటల్‌ మొత్తాన్ని కూల్చేశారు. దీంతో నాంపల్లి కోర్ట్ వెంకటేష్‌కి, సురేష్‌ బాబు దగ్గబాటి ఫ్యామిలీకి షాకిచ్చింది. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చి వేతలో కోర్టు ఆదేశాలను పాటించని దగ్గుబాటి కుటుంబంపై ఎఫ్ ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని నాంపల్లిలోని 17వ నంబరు కోర్టు ..ఫిలిం నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 
 

45

కోర్టు ఆదేశాలతో శనివారం ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో  ఫిల్మ్ నగర్ లోని దక్కన్ కిచెన్  హోటల్ అక్రమంగా కూల్చి వేసిన ఆరోపణలపై హీరో దగ్గుబాటి వెంకటేష్‌, నిర్మాత సురేశ్ బాబు, హీరో రానా, హీరో అభిరామ్ పై  శనివారం ఫిల్మ్ నగర్ పోలీసులు 448, 452,458,120 బి సెక్షన్లపై కేసు నమోదు చేసి ఎఫ్ ఐఆర్ నమోదుతో విచారణ చేపట్టారు.

read more: నిహారికా బెడ్‌ సీన్‌ చేసినా ప్రయోజనం లేదా?, మెగాడాటర్‌ తమిళ సినిమా కలెక్షన్లు చూస్తే షాక్‌

55

సంక్రాంతికి వెంకీ సినిమా విడుదల వేళ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం ఆశ్చర్యంగా మారింది. వెంకటేష్‌ అభిమానులను కలవరానికి గురి చేస్తుంది. ఇక వెంకటేష్‌ హీరోగా నటించిన `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాకి అనిల్‌ రావిపూడి దర్శకుడు. ఇందులో మీనాక్షి చౌదరీ, ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్లుగా నటించారు. దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కాబోతుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కించడంతో మంచి బజ్‌ నెలకొంది. 

read more: విజయ్‌ 69 `భగవంత్ కేసరి` రీమేక్, అనిల్ రావిపూడికి షాకిచ్చిన కమెడియన్, దళపతికి ఎందుకు నో చెప్పాడు?

also read: సంక్రాంతి సినిమాలకు పెద్ద దెబ్బ, హైకోర్ట్ ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: నెట్‌ఫ్లిక్స్ నుంచి ప్రైమ్ దాకా.. ఈ వీకెండ్ చూడాల్సిన 5 పిచ్చి క్రేజీ సినిమాలు, సిరీస్‌లు ఇవే
Recommended image2
MS Subbulakshmi: మరణించి 20 ఏళ్లు దాటినా.. తిరుమలలో నిత్యం వినిపించే స్వరం, ఎమ్ఎస్ సుబ్బులక్ష్మి ఖాతాలో చెరపలేని రికార్డులెన్నో..
Recommended image3
Sneha Photos: ఏంజెల్‌లా మెరిసిపోతున్న స్నేహ.. పోజులతో పనిలేదు, చిన్న స్మైల్‌ చాలు.. చూస్తే ఫిదా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved