MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • దావూద్ ఇబ్రహీం పిచ్చిగా ప్రేమించిన బాలీవుడ్ హీరోయిన్, ఇప్పుడేం చేస్తోందో తెలుసా..?

దావూద్ ఇబ్రహీం పిచ్చిగా ప్రేమించిన బాలీవుడ్ హీరోయిన్, ఇప్పుడేం చేస్తోందో తెలుసా..?

ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ క్రిమినెల్ దావూద్ కు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్ ను శాసించిన ఈ అండర్ వరల్డ్ డాన్.. ఓ బాలీవుడ్ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపించాడట.  

3 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Dec 19 2023, 11:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

దావూదు ఇబ్రహీం.. ఒకప్పుడు ముంబయ్  అండర్ వరల్డ్ డాన్ గా.. ఇండియాతో పాటు.. ప్రపంచ దేశాలను గడగడలాడించాడు. ప్రస్తుతం పాకీస్తాన్ లో ఉన్నట్టు.. ఆయన పై విష ప్రయోగం జరిగి... హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు వార్తలు వైరల్అవుతుండా.. దావూద్ పై రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. ఆయన హిస్టరీ మొత్తం మరోసారి బయటకు తీస్తున్నారు. దావూద్ చేసిన అరాచకాలతో పాటు.. ఆయన ప్రభావం ఏ రంగాల్లో పడిందో కూడా గుర్తు చేసుకుంటున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

1993 ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి దావూద్‌.. టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లోనే.. తెలివితేటలు ఉపయోగించి అడ్వాన్స్ గా ఆలోచించి ప్లాన్లు వేయగల  ఇబ్రహీం.. ప్రస్తుతం వయస్సు మళ్ళిపోయాడు.  ప్రస్తుతం ఆయన వయసు 67 సంవత్సరాలు అని తెలుస్తోంది. అంతే కాదు గత కొంత కాలంగా అతను అనారోగ్యంతో  బాధపడుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అంతే కాదు రీసెంట్ గా దావూద్ ఆస్పత్రి పాలైన దావూద్‌ చికిత్స పొందుతున్నట్టు కొంత మంది అంటుంటే.. ఇంకొందరు మాత్రం దావూద్ ఏకంగా మృతి చెందినట్లు ప్రచారంచేస్తున్నారు. 
 

37

అయితే అందులో నిజం లేదని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం దావూదు కు సబంధించిన కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి. ముంబయ్ లో అండర్ వరల్డ్ డాన్ గా ఉన్న దావూద్ .. అన్నిరంగాలతో పాటు సినిమా రంగంపై కూడా ప్రభావం చూపించాడు. బాలీవుడ్ స్టార్స్ చాలా మందికి అతనితో డీలింగ్స్ ఉన్నట్టు పుకార్లు ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్లత్ దావూద్ ప్రేమాకలాపాలు అప్పటలో హాట్ టాపిక్  అయ్యాయి. ముఖ్యంగా హీరోయిన్ మందాకినితో దావూద్ లవ్ ఎఫైర్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 
 

47
Mandakini

Mandakini

1980 నుంచి రెండు దశాబ్దాల పాటు.. బాలీవుడ్ ను ఏలింది మందాకిని. వెండితెర తారగా వెలుగు వెలిగింది.  బాలీవుడ్‌ లో  నటి మందాకిని అంటే పడిచచ్చిపోయేవారు.  తన అందచందాలతో అప్పటి కుర్రకారును ఓ ఊపుఊపేసి వదిలిపెట్టింది సీనియర్ బ్యూటీ.  రామ్ తేరీ గంగా మైలీ తో బాలీవుడ్ లో  కెరీర్‌ స్టార్ట్ చేసింది మందాకిని.. ఈసినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆమె అందం నటనకు ఫిదా అయిపోయి.. వరుస ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. 

57
Mandakini

Mandakini

ఎంత ఫాస్ట్ గా ఎదిగి.. స్టార్ గా మారిందో.. అంతే ఫాస్ట్ గా పతనం చెందింది ఆమె సినిమా కెరీర్. దానికి కారణం ఒక్క ఫోటో. అప్పట్లో నిర్మాతలు పీల్చి పిప్పిచేసేవాడు  దావూద్ ఇబ్రహీం.కాని ఆయన మందాకిని అందానికి ముగ్ధుడైపోయాడు.. మందాకిని చూస్తే చాలు  మత్తెక్కిపోయేవాడు. దాంతో ఆమెను పిచ్చిగా ప్రేమించాడు. చివరికి ఆమెను తన ప్రేమలో పడేశాడు. చాన్నాళ్లు కలిసి తిరిగారట. లివింగ్ రిలేషన్ లో ఉన్నారట. దాంతో మందాకిని కెరీర్ బాలీవుడ్ లో పడిపోతూ వచ్చింది. ఇద్దరి ఫోటోలు బయటకురావడంతో ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. 

67

అంతే కాదు దావూద్ తో కలిసి మందానికి కూడా చట్ట వ్యతిరేక పనులు చేస్తుంది అని ఆరోపణలు చుట్టుముట్టాయి.  దాంతో ఆమెకు సినిమాల్లో అవకాశాలు తగ్గడం స్టార్ట్ అయ్యింది.  క్రమంగా సినీ అవకాశాలు  తగ్గడంతో మందాకిని కెరీర్ పాతాళానికి పడిపోయింది. దావూద్ సినిమా వాళ్లను  హింసించడం.. అతనిపై  ఉన్న నెగెటివిటీ కారణంగా నిర్మాతలు మందాకినికి సినిమాల్లో అవకాశం ఇవ్వడం మానేశారు. దీంతో మందాకినీ ఫిల్మ్ ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయ్యింది.  ఫేమస్ డాక్టర్ కాగ్యూర్ రింపోచే ఠాకూర్ ను పెళ్లాడి దుబాయ్ లో సెటిల్ అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు కాగా వారి పేర్లు ఇనాయ, రబిల్. 

77

అలా మందాకిని ప్రేమలో మునిగి తేలిన దావూద్ ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలయ్యాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని నిఘ వర్గాలు కూడా కన్ ఫార్మ్ చేశాయి.  దావూద్‌ చాలా ఏళ్లుగా తనఫ్యామిలీతో పాటుగా పాకిస్తాన్‌లోనే ఉంటున్నాడు. అక్కడే స్థిరపడ్డాడు. అయితే అతను కరాచీలోనే ఉంటున్నట్టు పక్కా ఆధారాలున్నాయని భారత్‌ వెల్లడించింది. భారత్‌తో పాటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి  2003లోనే దావూద్‌ను మోస్ట్‌ వాంటెడ్‌ ఇంటర్నేషనల్ క్రిమినెల్ గా  ప్రకటించింది. అంతే కాదు అతని తలపై ఏకంగా రెండున్నర కోట్ల కోట్ల డాలర్ల రివార్డ్ కూడా ఉంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
పాకిస్తాన్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gay: అయ్యో.. నేను గే కాదు, అందుకోసం విడాకులు తీసుకోలేదు, హర్ట్ అయిన హీరోయిన్
Recommended image2
Peddi 11 days Collections: వీకెండ్‌లో పెద్ది జోరు.. రామ్‌ చరణ్‌ సినిమా అరుదైన మైల్‌స్టోన్‌.. టోటల్‌ కలెక్షన్లు
Recommended image3
OTT Movies: స్టెప్ బ్రదర్ అండ్ సిస్టర్ ప్రేమించుకుని రొమాన్స్ చేస్తే, ఓటీటీలోకి అడల్ట్ మూవీతో పాటు మరిన్ని
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved