MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ హౌస్లో సిరి, ఆగలేక ఇన్నాళ్లు దాచుకున్నదంతా ఒకేసారి కుమ్మరిస్తూ... శ్రీసత్యకు సైలెంట్ గా వార్నింగ్!

బిగ్ బాస్ హౌస్లో సిరి, ఆగలేక ఇన్నాళ్లు దాచుకున్నదంతా ఒకేసారి కుమ్మరిస్తూ... శ్రీసత్యకు సైలెంట్ గా వార్నింగ్!

బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. దీనిలో భాగంగా కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు వరుసగా ఇంట్లోకి వస్తున్నారు. అనూహ్యంగా శ్రీహాన్ కోసం అతని లవర్ సిరి వచ్చింది. రావడమే ముద్దులతో ముంచెత్తింది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Nov 24 2022, 03:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇంటికి, ప్రపంచానికి దూరమై దాదాపు మూడు నెలలు అవుతుంది. దీంతో వారిలోని హోమ్ సిక్ దూరం చేసేందుకు ఫ్యామిలీ వీక్ నిర్వహిస్తున్నారు. కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరిగా వస్తున్నారు. దీంతో హౌస్లో ఎమోషన్స్ చోటు చేసుకుంటున్నాయి. కాగా శ్రీహాన్ కోసం వారి కుటుంబ సభ్యులు కాకుండా లవర్ సిరి వచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

శ్రీహాన్ లవర్ సిరి అన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి పాల్గొనగా ఆమె కోసం వేదికపైకి శ్రీహాన్ వచ్చాడు. ఈసారి బిగ్ బాస్ హౌస్లో శ్రీహాన్ ఉన్న నేపథ్యంలో ఆయన్ని కలిసేందుకు ఫ్యామిలీ మెంబర్ కోటాలో సిరి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. 
 

37
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

మూడు నెలల విరహ వేదనంతా ఈ జంట తీర్చేసుకున్నారు. ముద్దులు, హగ్గులతో కెమెరాల ముందు రెచ్చిపోయారు. ఫ్రీజింగ్ స్టేట్ లో ఉన్న శ్రీహాన్ ప్రేయసి సిరిని చూడటంతోనే కన్నీరు పెట్టుకున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావ్ అంటూ సిరి హత్తుకుంది. హత్తుకున్న సిరిని ఫ్రీజ్ కావాలని బిగ్ బాస్ చెప్పడంతో మరింత రొమాన్స్ ఎంజాయ్ చేశారు. 
 

47
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6


అనూహ్య పరిణామం ఏమిటంటే సిరి ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. అది చూసిన శ్రీహాన్ మురిసిపోయాడు. శ్రీహాన్ పేరును తన వీపుపై టాటూగా వేయించుకుంది. కళ్ళు మూసుకో నీకు సర్పైజ్ అని సిరి తన వీపుపై ఉన్న టాటూ శ్రీహాన్ కి చూపించింది. శ్రీహాన్ నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. 
 

57
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6


కాగా హౌస్లో శ్రీహాన్ కంటెస్టెంట్ శ్రీసత్యతో సన్నిహితంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సిరికి ఎక్కడో ఒక మూలన అసహనం ఉందని స్పష్టమైంది. ఆమె సాఫ్ట్ గా శ్రీసత్యకు వార్నింగ్ ఇచ్చింది.
 

67
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6


నిన్ను శ్రీహాన్  చింకీ ఫేస్ అన్నాడని రేవంత్ సిరితో చెప్పాడు. తర్వాత క్యూట్ అన్నాను, అది చెప్పవేంట్రా? అని శ్రీహాన్ కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే శ్రీహాన్ మాటకు సిరి... క్యూట్ అని నన్ను కాదులే, శ్రీసత్యను అని ఉంటావు, చురక వేసింది.
 

77
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

శ్రీహాన్ ని నేను ఏడిపిస్తాను ఏమీ అనుకోకు అని శ్రీసత్య అన్నారు. ఖచ్చితంగా అనుకుంటాను ఏడిపించకు అని వెంటనే సిరి శ్రీసత్యకు కౌంటర్ వేసింది. ఇక శ్రీహాన్ ని కలవడానికి ఒక చిన్న పిల్లాడు వచ్చాడు. అతడి అల్లరిని ఇంటి సభ్యులు పిచ్చగా ఎంజాయ్ చేశారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Booss 10 Contestants Remuneration: అత్యధిక పారితోషికం తీసుకునే కంటెస్టెంట్ ఎవరో తెలుసా? అతి తక్కువ వారికే
Recommended image2
Madhuri Rathod: ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసింది? షాకింగ్ నిజాలు
Recommended image3
Bigg Boss 20: బిగ్ బాస్ 20 గ్రాండ్ లాంచ్.. మేరీ కోమ్ నుంచి కనికా మాన్ వరకు.. హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు వీరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved