MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Krishnudu Elimination: హౌస్ నుంచి కృష్ణుడు అవుట్, ఏడ్చేసిన రోహిత్.. ముఖేష్, దేబ్జానీ రొమాన్స్ అదుర్స్

Krishnudu Elimination: హౌస్ నుంచి కృష్ణుడు అవుట్, ఏడ్చేసిన రోహిత్.. ముఖేష్, దేబ్జానీ రొమాన్స్ అదుర్స్

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10 నుంచి కృష్ణుడు ఎలిమినేట్ అయ్యారు. కృష్ణుడు ఎలిమినేట్ కావడంతో రోహిత్ ఏడ్చేశాడు. రోహిత్ అంత ఎమోషనల్ కావడానికి కారణం ఉంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 20 2026, 11:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బిగ్ బాస్ తెలుగు 10
Image Credit : Asianet News

బిగ్ బాస్ తెలుగు 10

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో 14వ రోజు ఆదివారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. సండే ఎపిసోడ్ కావడంతో ఎలిమినేషన్ కూడా జరిగింది. హౌస్ మేట్స్ అనేక రకాల ఎమోషన్స్ చూపించారు. శనివారం మొదలైన మాన్యుప్యులేటర్, పప్పెట్ అంశం ఆదివారం కూడా కొనసాగింది. ఇందులో భాగంగా త్రిగున్, వర్షిణి, సుధీర్, నరేష్ బలంగా తమ పాయింట్స్ వినిపించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మెంటల్ గా ప్రిపేర్ అయిన అతడు
Image Credit : Asianet News

మెంటల్ గా ప్రిపేర్ అయిన అతడు

ఇంతలో నామినేషన్స్ లో ఉన్న వారిలో సేవ్ అయిన వారిని ఒక్కొక్కరినీ నాగార్జున రివీల్ చేస్తూ వచ్చారు. చివరికి నామినేషన్స్ లో సుధీర్, కృష్ణుడు, సృష్టి మిగిలారు. ఈ ముగ్గురిలో సుధీర్ కూడా సేఫ్ అయిపోయాడు. దీనితో సృష్టి, కృష్ణుడు లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. అంతకు ముందే తాను ఎలిమినేట్ అవుతున్నట్లు, మెంటల్ గా ప్రిపేర్ అయ్యానని కృష్ణుడు త్రిగున్ కి చెప్పారు. ఆయన ఊహించిందే నిజం అయింది. కృష్ణుడు ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. సృష్టి సేఫ్ అయింది.

34
కృష్ణుడు ఎలిమినేషన్
Image Credit : Asianet News

కృష్ణుడు ఎలిమినేషన్

ఇంటి సభ్యులంతా కృష్ణుడికి ఎమోషనల్ గా వీడ్కోలు పలికారు. కృష్ణుడు ఎలిమినేట్ కావడంతో రోహిత్ ఏడ్చేశాడు. మీ కళ్ళు మా నాన్న కళ్లలా ఉంటాయి. ఈ విషయం మీకు చెప్పడానికి ఇదే అవకాశం. అందుకే చెబుతున్నా అని రోహిత్ తన తండ్రిని గుర్తు చేసుకుని ఏడ్చేశాడు. ఎలిమినేట్ అయిన కృష్ణుడు బిగ్ బాస్ స్టేజీ పైకి వెళ్లి నాగార్జునని కలుసుకున్నారు. హౌస్ లో దేబ్జానీ, అమన్, ఝాన్సీ, సృష్టి పాజిటివ్ పీపుల్ అని.. సుధీర్, ముఖేష్, వర్షిణి, చరణ్ నెగిటివ్ పీపుల్ అని కృష్ణుడు తెలిపారు.

44
రొమాన్స్ తో అదరగొట్టిన దేబ్జానీ, ముఖేష్
Image Credit : Asianet News

రొమాన్స్ తో అదరగొట్టిన దేబ్జానీ, ముఖేష్

సండే కావడంతో అంతకు ముందు హౌస్ లో ఫన్ కూడా జరిగింది. ఝాన్సీ తన గాత్రంతో ఎంటర్టైన్ చేసింది. అమన్, త్రిగున్ బిగ్ బాస్ ని ఉద్దేశించి, బిగ్ బాస్ లో ఫుడ్ ని ఉద్దేశించి రాప్ సాంగ్ పాడి అలరించారు. ఆ తర్వాత దేబ్జానీ, ముఖేష్ రొమాంటిక్ సాంగ్ కి డ్యాన్స్ చేసి అదరగొట్టారు. వాళ్ళిద్దరి కెమిస్ట్రీకి ఇతర సభ్యులు ఫిదా అయ్యారు. ఇక చరణ్, వర్షిణి పుష్ప 2 మూవీలోని ఫీలింగ్స్ సాంగ్ కి మాస్ డ్యాన్స్ చేసి అలరించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
బిగ్ బాస్ తెలుగు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Baa Baa Black Sheep Review: బా బా బ్లాక్ షీప్ మూవీ రివ్యూ: క్రైమ్ కామెడీగా వచ్చిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image2
Trisha Krishnan: త్రిష సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? ఆ ఒక్క ఫోటోతో మొదలైన రచ్చ, నిజమెంత?
Recommended image3
నగ్మా నుంచి టబు వరకు.. 50 ఏళ్లు దాటినా పెళ్లి లేకుండా, సింగిల్‌గా ఉంటున్న టాప్ 6 హీరోయిన్లు
Related Stories
Recommended image1
Mysaa Teaser Review: రష్మిక మైసా టీజర్, పాన్ ఇండియా స్టార్లు కూడా సాటిరారు.. ఆ విజువల్స్ ఏంటి భయ్యా
Recommended image2
Chiranjeevi: చిరంజీవి సినిమా రిలీజైన రోజే నేను చనిపోయినట్లు ఫీల్ అయ్యా.. ఆ మూవీని చెడగొట్టింది ఎవరో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved