ఏం నడుము బాబోయ్, జూ.ఇలియానా ఇదిగో .. మెలికలు తిప్పుతూ మతి చెడగొడుతున్న అరియనా
అరియనా ప్రస్తుతం బుల్లితెరపై క్రేజీ బ్యూటీ. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది. తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది.

బిగ్ బాస్ 4 అరియనా ప్రస్తుతం బుల్లితెరపై క్రేజీ బ్యూటీ. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది. తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది.
ఇటీవల సోషల్ మీడియాలో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీతో జిమ్ వీడియోలు, ఇంటర్వ్యూలు చేయడంతో అరియనాకు ఫుల్ పబ్లిసిటీ లభించింది. దీనితో అరియనా సోషల్ మీడియాలో ఏం చేసిన వైరల్ అవుతోంది.
గత ఏడాది అరియనా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇటీవల విడుదలైన రాజ్ తరుణ్ 'అనుభవించు రాజా' చిత్రంలో అరియనా స్పెషల్ రోల్ లో మెరిసింది. ఆమెకు ఇదే తొలి చిత్రం.
అరియనా సోషల్ మీడియాలో క్యూట్ లుక్స్ తో యువత హృదయాలు దోచుకుంటోంది. నెమ్మదిగా అరియనా ఎక్స్ ఫోజింగ్ పెంచుతోంది. వెండి తెరపై రాణించాలని అనుకుంటోందో ఏమో.. అనసూయ, శ్రీముఖి లాంటి యాంకర్స్ తరహాలో తన అందాలు ఘాటుగా చూపించాలని డిసైడ్ అయింది.
తాజాగా అరియనా వయ్యారంగా చేసిన ఫోటో షూట్ చూస్తే కుర్రాళ్ల మతి చెడిపోవడం ఖాయం. కళ్ళు చెదిరేలా ఉన్న నడుముని మెలికలు తిప్పుతూ అరియనా కలర్ ఫుల్ డ్రెస్ లో ఇచ్చిన ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలకు మీరే క్యాప్షన్ పెట్టండి అని అరియనా నెటిజన్లని కోరింది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఆంధ్ర ఇలియానా అంటూ పొగిడేస్తున్నారు. అసలు ఇంత అందమైన నడుముని ఎలా మైంటైన్ చేస్తున్నావు అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
అరియనా నాభి సొగసుకి కుర్రాళ్ళ ఫ్యూజులు చెదిరిపోతున్నాయి. మరికొందరు నెటిజన్లు జూనియర్ ఇలియానా అంటున్నారు. మొత్తంగా అరియనా తన నడుము అందాలతో ఇలియనాగా మారుతోంది.