కుర్తాలో అప్సరసలా ఐశ్వర్యా రాజేష్ హోయలు.. ట్రెడిషనల్ లుక్‌లో ఇంత అందంగానా?
డస్కీ బ్యూటీ ఐశ్వర్యా రాజేష్ నటనకు ప్రయారిటీ ఉన్న పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటుంది. నటిగా తానేంటో నిరూపించుకుంటుంది. మరోవైపు వరుసగా ఫోటో షూట్లతోనూ అదరగొడుతుంది. తన పిచ్చెక్కించే అందంతో మతిపోగొడుతుంది.
ఐశ్వర్యా రాజేష్ ట్రెండీ వేర్ ధరిస్తే దుమ్ము దుమారమే, ఇక ట్రెడిషనల్ వేర్‌లోనూ హాట్‌గా, అందంగా కనిపించడం ఆమె ప్రత్యేకత. తాజాగా లైట్ బ్లూ మిళితమైన వైట్ కుర్తాలో హోయలు పోయింది ఐశ్వర్య. తెల్ల పావురంలా మెరిసిపోతుంది. ఆకాశం నుంచి దిగొచ్చిన అప్సరసలా హోయలు పోతుంది. కుర్రాళ్ల గుండెల్లో ప్రేమ గంటలు మోగిస్తుంది.
స్వతహాగా హాట్‌నెస్ ఐశ్వర్యా రాజేష్ సొంతం. ఆమె ఏ డ్రెస్ వేసినా హాట్‌గానే ఉంటుంది. అందం ఓవర్ లోడ్ అవుతుంది. అప్పుడప్పుడు ట్రెండీ వేర్‌లో థైస్ అందాలతో, బిగువైన దుస్తుల్లో బాడీ కొలతలు చూపిస్తుంటుంది. ఓ రకంగా విజువల్ ట్రీట్ ఇస్తూ సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ అవుతుంది.
ఇప్పుడు వైట్ దుస్తుల్లోనూ ఐశ్వర్య అందం మరింత పెరిగింది. మరింతగా హాట్‌గానూ మారింది. అదే సమయంలో చూడ్డానికి దేవకన్యలోనూ ఆకట్టుకుంటుంది. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. అయితే ఆమె నటించిన `డ్రైవర్ జమున` చిత్రం రేపు(శుక్రవారం)విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఇలా మెరిసింది ఐశ్వర్యా.
నెటిజన్లు ఈ ఫోటోలపై స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. డస్కీ బ్యూటీ ఇంత అందంగానా? అబ్బో చూడ్డానికి రెండు కళ్లు చాలవంటున్నారు. ట్రెడిషనల్ వేర్‌లోనూ ఈ బ్యూటీ అందం ఓవర్ లోడ్ అని అంటున్నారు. మొత్తానికి తమదైన కామెంట్లతో రచ్చ లేపుతున్నారు. ఐశ్వర్యని టాక్ ఆఫ్ ఇది సోషల్ మీడియాగా మార్చేస్తున్నారు.
ఐశ్వర్యా రాజేష్ సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంది. సౌత్‌లోనే అత్యంత బిజీగా ఉన్న నటిగా రాణిస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ బిజీగా ఉంది. ఆమె తరచూ తన గ్లామర్ ఫోటోలను పంచుకుంటుంది. వెకేషన్‌లోని ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. ఇటీవల ఈ బ్యూటీ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా స్లీవ్ లెస్ డ్రెస్‌లో కనిపించింది. ఆమె హ్యాండ్స్ పై మీమ్స్ తో రెచ్చిపోయారు ట్రోలర్స్. అవి చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ చేతిలో 12 సినిమాలున్నాయి. అందులో తొమ్మిది సినిమాలు తమిళంలోనే ఉన్నాయి. మూడు మలయాళంలో ఉన్నాయి. ఓ బైలింగ్వల్ మూవీ ఉంది. ఇలా తీరిక లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. నటిగా తానేంటో నిరూపించుకుంటుంది. ఇందులో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా ఉండటం విశేషం.
ఆ మధ్య తెలుగులోనూ సినిమాలు చేసింది. `కౌసల్య కృష్ణమూర్తి`, `మిస్ మ్యాచ్`, `వరల్డ్ ఫేమస్ లవర్`, `టక్ జగదీష్`, `రిపబ్లిక్` చిత్రాల్లో నటించింది. ఏ ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేదు. దీంతో తెలుగుని దూరం పెడుతుంది. సౌత్‌లో నటనకు ప్రయారిటీ ఉన్న పాత్రలు చేస్తుంది. ఇక్కడ గ్లామర్ షోకి తాను సిద్ధంగా లేకపోవడంతో అవకాశాలు రావడం లేదని టాక్.