సురేఖా వాణి బోల్డ్ కామెంట్స్.. ఆ హీరోకు వంద ముద్దులిస్తుందట
వయసుపెరుగుతున్నా... హీరోయిన్లను మించిన గ్లామర్ మెయింటేన్ చేస్తుంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి. పెళ్లీడుకొచ్చిన కూతురు ఉన్నా.. హాట్ హాట్ పోజులిస్తూ.. సోఫల్ మీడియాను షేక్ చేస్తుంటుంది. ఇక రీసెంట్ గా ఆమె సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

వయసు పెరిగినా పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ... హీరోయిన్ లకు సైతం పోటీ ఇస్తుంది సురేఖ వాణి . టాలీవుడ్ లో.. అక్కగా,చెల్లిగా, భార్యగా, మోడ్రన్ మదర్ గా ఎన్నో పాత్రల్లో మెరిసింది. ముఖ్యంగా స్టార్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందంకు భార్యగా సురేఖ వాణి ఎక్కువ సినిమాల్లో ఆకట్టుకుంది.
ఇక సురేఖ వాణి భర్త కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించారు.. ఇక కూతురు సుప్రీత తో కలిసి ఉంటుంది సురేఖా వాణి. అయితే సుప్రీత కూడా ప్రస్తుతం మోడలింగ్ చేస్తోంది. సోషల్ మీడియాలో సుప్రీత, సురేఖవాణి కలిసి చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఇద్దరు కలిసి హాట్ హాట్ ఫోజులిస్తూ.. ఫోటోలు వీడియోలు పెడుతుంటారు. హీరోయిన్లకు పోటీగా పొట్టి పొట్టి డ్రెస్సులేస్తూ.. అదరగొడుతుంటారు.
తన తల్లికి రెండో పెళ్లి కూడా చేయాలనుకుంది సుప్రీత. ఇక ఈ విషయంతో పాటు.. ఇండస్ట్రీలోని పలు విషయాలపై స్పందించింది నటి సురేఖా వాణి. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సురేఖా.. ఇండస్ట్రీలో తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం అంటోంది సురేఖా. అతను కనిపిస్తే.. వెంటనే 100 ముద్దులిస్తానంటూ..బోల్డ్ కామెంట్స్ చేసింది సీనియర్ బ్యూటీ.
ఇక తన పెళ్ళి ప్రస్తావన తీసుకురాగా.. తనుకు ఇప్పుడు ఆ ఆలోచన లేదంటోంది. చేసుకోవల్సి వస్తే.. తనకు భర్తకంటే కూడా బాయ్ ఫ్రెండ్ అవసరం బాగా ఉంది అంటోంది. అది కూడా ఆ బాయ్ ఫ్రెండ్ కు కొన్ని క్వాలిటీస్ ఉండాలంటూ.. కండీషన్లు పెడుతోంది సురేఖా వాణి. లైట్ గా గడ్డం ఉండాలి, ఫిట్ గా ఉండాలి, రొమాంటిక్ గా ఉండాలీ.. బాగా డబ్బుండాలి అంటూ.. కొన్ని కొన్ని క్వాలిటీస్ చెపుతోంది.
తల్లీ కూతుర్ల వీడియోల వల్ల సురేఖా వాణితో పాటు ఆమె కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియా సెలబ్రిటీ అయిపోయింది. తల్లి, కూతురు ఇద్దరు కలిసి పబ్బులకి వెళ్ళడంతో పాటు అక్కడ మందు గ్లాసులు పట్టుకుని ఫోటోలకు ఫోజులు కూడా ఇస్తుంటారు. రీసెంట్ గా బర్త్ డే వేడుకల్లో కూతురు సుప్రీతతో మందు కూడా తాగించింది సురేఖా వాణి. ఈ విషయంలో విమర్షలు కూడా ఫేస్ చేసింది.
తాము ఏం చేసినా.. ఆ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తారు తల్లీ కూతురు.. ఆ ఫోటోలకు ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడితే సుప్రీత వాళ్లకు వెంటనే కౌంటర్స్ కూడా ఇస్తూ ఉంటుంది. ఇద్దరూ గ్లామర్ షో విషయం లో కూడా తగ్గేదెలా అంటారు