- Home
- Entertainment
- Priyanka Arul Mohan Pics: లెహంగా వోణీలో మెస్మరైజ్ చేస్తున్న ప్రియాంక మోహన్.. క్యూట్ లుక్ తో ఆకట్టుకుంటోంది..
Priyanka Arul Mohan Pics: లెహంగా వోణీలో మెస్మరైజ్ చేస్తున్న ప్రియాంక మోహన్.. క్యూట్ లుక్ తో ఆకట్టుకుంటోంది..
హీరోయిన్ ప్రియాంక మోహన్ తన గ్లామర్ తో నెటిజన్లను కట్టిపడేస్తోంది. ఎంబ్రాయిడింగ్ లెహంగాలో.. క్యూట్ లుక్స్ తో కుర్రాళ్లను తన వైపు ఆకర్షిస్తోందీ సుందరి. తన లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

నేచురల్ స్టార్ నాని (Nani)నటించిన ‘గ్యాంగ్ లీడర్’ మూవీతో హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. నాని హీరోయిన్ గా మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది. ఆ తర్వాత శర్వానంద్ తో కలిసి ‘శ్రీకారం’ మూవీలో నటించి తెలుగు ఆడియెన్స్ కు మరింత దగ్గరైంది.
ఆ తర్వా త డైరెక్ట్ గా తెలుగు సినిమాలు లేదు ప్రియాంక. ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలు చేస్తూ తమిళ ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగులో అవకాశాలు రాకపోయినా.. తను నటించిన ‘డాక్టర్, ఈటీ’ చిత్రాలు తెలుగులోనూ రిలీజ్ అవడంతో ఇక్కడి అభిమానులు ఖుషీ అవుతున్నారు.
ఇటీవల రిలీజ్ అయిన ‘ఈటీ’ET మూవీలో ప్రియాంక మోహన్ చాలా స్ట్రాంగ్ రోల్ లో నటించింది. మహిళలకు జరిగే అన్యాయాలను ఎదుర్కొనే పాత్రలో ఒదిగిపోయింది. సూర్య సరసన ప్రియాంక మోహన్ కు నటించే అవకాశం రావడం ప్లస్ పాయింట్ అని చెప్పాలి.
ఈ చిత్రం విజయవంతం అవడంతో ప్రియాంకకు కూడా కలిసి వచ్చింది. తన కేరీర్ ను ఈ చిత్రం మరో మలుపు తిప్పనుందని చెప్పడం ఎలాంటి సందేహం లేదు. అయితే ఇకపై ప్రియాంక ఎంచుకునే కథల పట్ల జాగ్రత్తలు తీసుకుంటే త్వరలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ను టచ్ చేస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
అయితే, ప్రియాంక అటు వరుసగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ ప్రేయక్షకులను అలరిస్తోంది. ఇటు సోషల్ మీడియాలోనూ తన క్రేజ్ పెంచుకునేందుుకు తెగ ఆరటపడుతోంది. అందుకే లేటెస్ట్ ఫొటోషూట్లతో నెటిజన్లను ఆకర్షించే పనిలో నిమగ్నమైంది. ఈ మేరకు తాజాగా ప్రియాంక మోహన్ కొన్ని ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది.
ఈ ఫొటోల్లో హెవీ ఎంబ్రాయిడర్ లెహంగా వోణీలో మైస్మరైజ్ చేస్తోంది. ఆకట్టుకునే చూపులతో, మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ల గుండెల్లి కొల్లగొడుతోంది. అయితే ఈ ఫొటోషూట్ ను ‘షీ ఇండియా’ మ్యాగజైన్ కోసం చేసింది. రేపు ఈ మ్యాగజైన్ రిలీజ్ కానుంది. ఈటీ మూవీ తర్వాత ప్రియాంక తమిళంలోనే ‘డాన్’ అనే మరో సినిమాలో నటిస్తోంది.