- Home
- Entertainment
- విరహ వేదనతో మైమరిపిస్తున్న ‘ఢీ’ బ్యూటీ.. మత్తెక్కించే అందంతో మయా చేస్తున్న నటి పూర్ణ..
విరహ వేదనతో మైమరిపిస్తున్న ‘ఢీ’ బ్యూటీ.. మత్తెక్కించే అందంతో మయా చేస్తున్న నటి పూర్ణ..
నటి పూర్ణ గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్ గా కావాల్సిన అన్ని అర్హతలున్న ఈ బ్యూటీ వరుస సినిమాల్లో నటిస్తూ అలరిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ తన క్రేజ్ పెంచుకుంటోంది.

మలయాళ భామ పూర్ణ (Poorna) కెరీర్ నటిగా 2004లో మొదలైంది. అంతకు ముందు ప్రొఫెషనల్ డాన్సర్ గా, మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ పాపులారిటీతోనే సినీ ఫీల్డ్ కు ఎంట్రీ ఇచ్చింది. 2007లో విడుదలైన మహాలక్ష్మీ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘సీమ టపాకాయ్’లో నటించి మరించి గుర్తింపు పొందింది.
సౌత్ లో దాదాపు అన్ని భాషల చిత్రాల్లో పూర్ణ నటించి ప్రేక్షకులను అలరించింది. విభిన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు టీవీ షోలోనూ సందడి చేస్తూ టెలివిజన్ ఆడియెన్స్ కు దగ్గరైంది. ఇప్పటికీ టీవీ ప్రేక్షకులకు పూర్ణ అంటే ప్రత్యేక అభిమానమనే చెప్పాలి.
మరోవైపు బుల్లితెరపైనా గ్లామర్ షోతో సందడి చేస్తున్నారు పూర్ణ. పలు టెలివిజన్ కార్యక్రమాల్లో జడ్జిగా, యాంకర్ గా కనువిందు చేస్తున్నారు. ‘ఢీ సీజన్ 13’లో పూర్ణ జడ్జిగా వ్యవహరించిన విషయం తెల్సిందే. కానీ లేటెస్ట్ సీజన్ నుండి ఆమె తప్పుకున్నారు. ప్రస్తుతం కామెడీ స్టార్స్ దమాకా కామెడీ రియాలిటీ షోలో జడ్జీగా కొనసాగుతున్నారు.
అటు సినిమాల్లోనూ, ఇటు బుల్లితెరపైన మెరుస్తున్న నటి పూర్ణ కేరీర్ కు ప్రస్తుతం ఎలాంటి ఢోకా లేదనే చెప్పాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రేక్షకులకు మరింతగా దగ్గరవుతోందీ బ్యూటీ. చివరిగా ‘అఖండ’ చిత్రంలో పద్మావతి పాత్రలో కనిపించింది పూర్ణ.
తెలుగు,తమిళం, మలయాళ భాషలో ప్రస్తుతం ఐదారు చిత్రాల్లో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రాలకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసుకుంది. చాలా సాఫీగా సాగిపోతున్న తన కేరీర్ పట్ల ఎలాంటి ఆందోళనకు మాత్రం గురికావడం లేదు. ఈక్రమంలో పూర్ణ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది.
ఇటీవల ఓ బిజినెస్ మాన్, జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ మరియు సీఈవో షానిద్ అసిఫ్ తో ఎంగేజ్ మెంట్ కూడా పూర్తి చేసుకుంది. తన భర్తను కూడా అభిమానులకు, ప్రేక్షకులకు పరిచయం చేసింది. కోట్ల రూపాయల ఆస్తులకు అధిపతి అయిన తన భాగస్వామిని పరిచయం చేయడం పట్ల అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు.
త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న ఈ బ్యూటీ ఆ తర్వాత సినిమాలు, టెలివిజన్ షోలలో కొనసాగుతుందా? లేకా దాంపత్య జీవితాన్ని అనుభవిస్తుందా అన్నది వేచి చూడాలి. ప్రస్తుతం మాత్రం ఎలాంటి సినిమాలకు మాత్రం పూర్ణ సైన్ చేయడం లేదని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే పూర్ణ.. సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా ఉంటోంది. మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అప్పటికే హాట్ గా కనిపించే పూర్ణ.. ట్రెండీ వేర్ లో మైండ్ బ్లాక్ చేస్తోంది. మత్తు చూపులతో కవ్వించేలా పోజులిచ్చి నెట్టింట రచ్చరచ్చ చేస్తోంది. అందాలు ఆరబోస్తూ పూర్ణ చేసిన లేటేస్ట్ ఫొటోషూట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.