MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • IND vs PAK: పాకిస్తాన్ కు షాకిచ్చిన భారత్.. బీసీసీఐ సంచలన నిర్ణయం

IND vs PAK: పాకిస్తాన్ కు షాకిచ్చిన భారత్.. బీసీసీఐ సంచలన నిర్ణయం

No Bilateral Series With Pakistan: చివరిసారిగా భారత్-పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ 2012-2013 జరిగింది. పాక్ భారత్ వచ్చి ఆడింది. టీమిండియా చివరిసారిగా 2008లో పాకిస్తాన్ లో పర్యటించింది. ప్రస్తుతం ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్ లో మాత్రమే తలపడుతున్నాయి.   

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Apr 24 2025, 03:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

 No Bilateral Series With Pakistan: జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రదాడిలో 28 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల వెనుక పాకిస్తాన్ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత వెంటనే తగిన చర్యలు తీసుకుంటోంది. భారత భద్రతా వర్గాలు వెంటనే ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ మొదలుపెట్టాయి.

పాక్ తీరుపై భారత్ మరింత కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్దమవుతోంది. ఈ క్రమంలోనే భారత్ పాక్ తో క్రీడా సంబంధాలను పూర్తిగా తెంచుకుంది. ఇకపై పాకిస్తాన్ తో క్రికెట్ ఆడేది లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. పాకిస్తాన్ తో ఎటువంటి ద్వైపాక్షిక మ్యాచ్‌లు ఆడదని టీమిండియా నిర్ణయించుకుందని తెలిపారు. చివరిసారిగా భారత్ - పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ 2012-2013లో జరిగింది. పాకిస్తాన్ పరిమిత ఓవర్ల సిరీస్ ఆడటానికి భారత్ లో పర్యటించింది. 

35

ఇక టీమిండియా చివరిసారిగా 2008లో పాకిస్తాన్ లో పర్యటించింది. అప్పుడు ఆసియా కప్ ఆడారు. రాజకీయ, భౌగోళిక వైరుధ్యాల క్రమంలో భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ తో ఎలాంటి సిరీస్ లను ఆడటం లేదు. వెనకనుంచి ఉగ్రవాదాన్ని పెంచుతూ పాకిస్తాన్ కాశ్మీర్‌లో శాంతిని నాశనం చేస్తోందనీ, పర్యాటకులు-స్థానికులలో భయాన్ని రేకెత్తిస్తోందని శుక్లా తెలిపారు. అందుకే తాము ఇకపై  పాకిస్తాన్ తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్ లను ఆడకూడదని నిర్ణయించుకున్నామని తెలిపారు. 

45
IND vs PAK

IND vs PAK

కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తున్నామనీ, బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. ఐసీసీ నిబంధనల కారణంగా కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే పాకిస్తాన్ తో భారత్ మ్యాచ్ లు ఆడుతుందని తెలిపారు. 

అమాయక పర్యాటకులపై జరిగిన దారుణమైన దాడిని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఖండించారు. ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. 

55

"నిన్న పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిలో అమాయకుల ప్రాణాలను కోల్పోవడం క్రికెట్ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బాధపెట్టింది. BCCI తరపున ఈ భయంకరమైన, పిరికి చర్యను ఖండిస్తూ, మృతుల కుటుంబాలకు మా సంతాపాన్ని తెలుపుతున్నాం. వారి బాధ, దుఃఖాన్ని పంచుకుంటూ, ఈ విషాద సమయంలో మేము చేయి చేయి కలిపి నిలబడతాము" అని సైకియా అన్నారు. 

2008 ముంబై ఉగ్రవాద దాడి తర్వాత భారత గడ్డపై జరిగిన అత్యంత దారుణమైన ఉగ్రవాద దాడి నేపథ్యంలో బుధవారం సాయంత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్ సందర్భంగా మరణించిన వారి ఆత్మలకు నివాళులర్పించేందుకు బీసీసీఐ చర్యలు తీసుకుంది. రాజీవ్ గాంధీ స్టేడియంలో ఒక నిమిషం మౌనం పాటించారు, రెండు జట్ల ఆటగాళ్, అధికారులు సంతాపం తెలుపుతూ నల్లటి బ్యాండ్లు ధరించారు. బాణసంచా కాల్చడం, చీర్లీడర్ల ప్రదర్శనలు, వేడుకలు జరుపుకోలేదు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
భారత దేశం
పాకిస్తాన్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved