MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే

Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే

Asian Games 2026: ఆసియా గేమ్స్ 2026 ఉమెన్స్ క్రికెట్ ఫైనల్లో శ్రీలంకపై 147 పరుగుల తేడాతో గెలిచి భారత్ గోల్డ్ మెడల్ సాధించింది. స్మృతి మంధాన (79), దీప్తి శర్మ (3/6) సంచలన ఇన్నింగ్స్ తో భారత్ విక్టరీ కొట్టింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 22 2026, 01:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శ్రీలంకకు చుక్కలు చూపించి ఆసియా గేమ్స్ గోల్డ్ కొట్టిన భారత్
Image Credit : X

శ్రీలంకకు చుక్కలు చూపించి ఆసియా గేమ్స్ గోల్డ్ కొట్టిన భారత్

ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్ టోర్నీలో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. జపాన్‌లో జరిగిన హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకను ఏకంగా 147 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్‌లో స్మృతి మంధాన విధ్వంసక హాఫ్ సెంచరీకి తోడు రిచా ఘోష్ మెరుపులు తోడవడంతో భారత్ 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం ఛేజింగ్‌లో భారత బౌలర్లు దీప్తి శర్మ, షెఫాలీ వర్మ దెబ్బకు శ్రీలంక కేవలం 69 పరుగులకే కుప్పకూలింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బ్యాటర్ల విశ్వరూపం: బోర్డుపై 216 రన్స్
Image Credit : X/BCCIWomen

బ్యాటర్ల విశ్వరూపం: బోర్డుపై 216 రన్స్

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ సూపర్ స్టార్ట్ ఇచ్చారు. తొలి వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి శ్రీలంక బౌలర్లను చెండాడారు. స్మృతి మంధాన 45 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 79 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇన్నింగ్స్ ఆఖరిలో రిచా ఘోష్ కేవలం 20 బంతుల్లో 49* పరుగులు చేసి స్టేడియాన్ని హోరెత్తించింది. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఆసియా గేమ్స్ మహిళల క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యధిక టీమ్ స్కోరుగా రికార్డు సృష్టించింది.

35
దీప్తి, శ్రేయాంక మ్యాజిక్: 69 రన్స్ కే లంక ఆలౌట్
Image Credit : X/BCCIWomen

దీప్తి, శ్రేయాంక మ్యాజిక్: 69 రన్స్ కే లంక ఆలౌట్

217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే షాక్‌లు తగిలాయి. కెప్టెన్ చమరి (29) కాసేపు పోరాడినా, ఆమెను దీప్తి శర్మ అవుట్ చేయడంతో లంక పతనం ఆగలేదు. భారత స్పిన్నర్ల దెబ్బతో శ్రీలంక మిడిలార్డర్ కుప్పకూలింది. శ్రీలంక బ్యాటర్లు ఒకరివెనుక ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 15.4 ఓవర్లలోనే ఆ జట్టు 69 పరుగులకు ఆలౌట్ అయింది. దీప్తి శర్మ 6 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా, శ్రేయాంక పాటిల్, షెఫాలీ వర్మ, శ్రీ చరణి తలా 2 వికెట్లతో లంకను దెబ్బకొట్టారు.

45
టీమిండియా ఖాతాలో సంచలన రికార్డులు
Image Credit : X/BCCIWomen

టీమిండియా ఖాతాలో సంచలన రికార్డులు

ఈ హిస్టారికల్ విక్టరీతో భారత మహిళల క్రికెట్ జట్టు పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.

• బిగ్ విక్టరీ: టీ20 క్రికెట్‌లో పరుగుల పరంగా భారత్‌కు ఇది అతిపెద్ద విజయం (147 పరుగులు).

• వరుసగా 8 విజయాలు: పొట్టి ఫార్మాట్‌లో భారత్‌కు ఇది వరుసగా 8వ విజయం. 2018 నాటి 7 మ్యాచ్‌ల విజయ పరంపర రికార్డును దాటేసింది.

• రెండో గోల్డ్ మెడల్: 2023 ఆసియా గేమ్స్‌లో పసిడి నెగ్గిన భారత్, ఇప్పుడు 2026లో వరుసగా రెండోసారి ఆసియా గేమ్స్ స్వర్ణాన్ని గెలుచుకుంది.

• అత్యధిక సిక్సర్లు: ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఏకంగా 13 సిక్సర్లు బాదారు. ఒకే టీ20 ఇన్నింగ్స్‌లో భారత్ కొట్టిన అత్యధిక సిక్సర్లు ఇవే.

55
డబుల్ ధమాకా: ఆసియా కప్, ఆసియా గేమ్స్ మనవే
Image Credit : X/BCCIWomen

డబుల్ ధమాకా: ఆసియా కప్, ఆసియా గేమ్స్ మనవే

వారం రోజుల క్రితమే ఆసియా కప్ గెలిచిన భారత మహిళల జట్టు, ఇప్పుడు ఆసియా గేమ్స్ గోల్డ్ కూడా గెలుచుకుని ఆసియా ఖండంలో తిరుగులేని ఆధిక్యాన్ని చాటుకుంది. క్వార్టర్స్‌లో జపాన్‌ను, సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను, ఫైనల్లో శ్రీలంకను ఏకపక్షంగా ఓడించిన భారత్ టోర్నీ అంతటా అసలు కాంపిటీషనే లేకుండా ఆధిపత్యం చెలాయించింది. వికెట్ పడగొట్టి విజయముద్ర వేయగానే శ్రేయాంక పాటిల్, సహచర ప్లేయర్లు జాతీయ జెండాతో మైదానంలో సంబరాలు చేసుకున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
మహిళల క్రికెట్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
భారత జాతీయ క్రికెట్ జట్టు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
virat kohli: ఆ ఆశ్ర‌మానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అస‌లేం జ‌రిగిందంటే
Recommended image2
Team India New Captain: టీమిండియాకు కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్లు.. పూర్తి వివరాలు ఇవే
Recommended image3
స్మృతి మంధాన చేతికి టీమిండియా పగ్గాలు.. హర్మన్‌ప్రీత్ స్థానంలో కొత్త కెప్టెన్
Related Stories
Recommended image1
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Recommended image2
Smriti Mandhana: బిగ్గెస్ట్ మైల్‌స్టోన్.. ప్రపంచంలో మొదటి ప్లేయర్‌గా స్మృతి మంధాన సరికొత్త రికార్డు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved