MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Price Hike: యూటర్న్ తీసుకున్న బంగారం.. మోత మోగించిన పసిడి, స్వర్ణ ప్రియులకు భారీ షాక్

Gold Price Hike: యూటర్న్ తీసుకున్న బంగారం.. మోత మోగించిన పసిడి, స్వర్ణ ప్రియులకు భారీ షాక్

Gold Price Hike: బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 2 రోజులు తగ్గిన పసిడి ఇప్పుడు రివర్స్ అయింది. అంతర్జాతీయంగా పరిస్థితులు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెట్టుబడిదారులపై ప్రభావం చూపుతున్నాయి. సురక్షిత పెట్టుబడిగా బంగారం వైపు మళ్లడంతో డిమాండ్ పెరిగింది.

2 Min read
Author : Nandini Arava
Published : Sep 03 2026, 11:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
యూటర్న్ తీసుకున్న బంగారం
Image Credit : Getty

యూటర్న్ తీసుకున్న బంగారం

బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. వరుసగా రెండు రోజుల పాటు తగ్గిన పసిడి రేట్లు ఇప్పుడు ఒక్కసారిగా రివర్స్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు పెట్టుబడిదారులపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మళ్లడంతో పసిడి ధరలకు మళ్లీ డిమాండ్ పెరిగింది.

ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు ఏ పరిణామం చోటుచేసుకుంటుందోనన్న ఆందోళనతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్లలో రిస్క్ పెరిగిన సమయంలో సాధారణంగా సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు డబ్బును మళ్లించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే ధోరణి కనిపించడంతో గోల్డ్ రేట్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీంతో ఇటీవల కనిపించిన ధరల తగ్గుదలకు బ్రేక్ పడింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అంతర్జాతీయంగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు
Image Credit : iSTOCK

అంతర్జాతీయంగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై మార్కెట్ అంచనాల్లో వచ్చిన మార్పులు కూడా బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఫెడ్ పాలసీపై ఇన్వెస్టర్ల అంచనాలు మారడంతో అంతర్జాతీయంగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్లు ఇప్పుడు మళ్లీ పైకి కదిలాయి.

34
రూ.3,330 పెరిగిన పసిడి
Image Credit : Getty

రూ.3,330 పెరిగిన పసిడి

సెప్టెంబర్ 3న దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,350గా నమోదైంది. గత ధరతో పోలిస్తే ఇది ఏకంగా రూ.3,330 పెరిగింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,400గా ఉంది. దీనిపై ఒక్కరోజులో రూ.3,050 పెరుగుదల కనిపించింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నవారికి మళ్లీ ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది.

44
రూ.1,55,350కు చేరిన బంగారం
Image Credit : Getty

రూ.1,55,350కు చేరిన బంగారం

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,55,350గా, 22 క్యారెట్ల రేటు రూ.1,42,400గా కొనసాగుతోంది. బెంగళూరులోనూ ఇవే ధరలు ఉన్నాయి. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,55,500గా, 22 క్యారెట్ల రేటు రూ.1,42,550గా నమోదైంది. అంతర్జాతీయ పరిణామాలు, ఫెడ్ నిర్ణయాలపై అంచనాలు, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఆధారంగా రాబోయే రోజుల్లోనూ బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Badam Sabudana Kheer: అమ్మవారికి ఇష్టమైన స్పెషల్ పాయసం....ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి
Recommended image2
Amazon Flipkart Festive Sale : పండగ్ సేల్ లో భారీ డిస్కౌంట్లు చూసి కొనేస్తున్నారా? ఈ ట్రిక్స్ తో మనీ సేవ్ చేసుకోండి
Recommended image3
Gold Price Hike: పండుగల వేళ పసిడి ధరల పెరుగుదల.. హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే?
Related Stories
Recommended image1
Gold Crash: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.2,070 తగ్గిన పసిడి!
Recommended image2
Gold Price hike: రూ.20వేలు తగ్గిన వెండి...మరోసారి పెరిగిన పసిడి...గ్రాము ఎంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved