MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Price hike: రూ.20వేలు తగ్గిన వెండి...మరోసారి పెరిగిన పసిడి...గ్రాము ఎంతంటే?

Gold Price hike: రూ.20వేలు తగ్గిన వెండి...మరోసారి పెరిగిన పసిడి...గ్రాము ఎంతంటే?

Gold Price hike: బంగారం ధరల్లో మళ్లీ స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. గత వారం భారీ నుంచి దిగివచ్చిన పసిడి.. ఇప్పుడు వరుసగా కొద్దికొద్దిగా పుంజుకుంటోంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి మరోసారి ధరలు పెరుగుతున్నాయనే ఆందోళన మొదలైంది.

1 Min read
Author : Nandini Arava
Published : Sep 01 2026, 11:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పసిడి ప్రియులకు భారీ షాక్
Image Credit : chatgpt

పసిడి ప్రియులకు భారీ షాక్

బంగారం ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. గత వారం భారీ స్థాయిలో తగ్గిన పసిడి ధరలు.. ఇప్పుడు వరుసగా నాలుగైదు రోజులుగా క్రమంగా పుంజుకుంటున్నాయి. ఒక దశలో తులం బంగారం ధర రూ.1.70 లక్షలకు చేరడంతో భారీగా పెరిగిన పసిడి.. ఆ తర్వాత లాభాల స్వీకరణతో గణనీయంగా తగ్గింది. ఇప్పుడు మళ్లీ కొనుగోళ్లు పెరగడంతో ధరలు పైకి ఎగబాకుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రూ.1,56,930కు చేరిన బంగారం
Image Credit : X

రూ.1,56,930కు చేరిన బంగారం

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 పెరిగి రూ.1,56,930కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర కూడా రూ.150 పెరిగి 10 గ్రాములకు రూ.1,43,850గా నమోదైంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.120 పెరిగి 10 గ్రాములకు రూ.1,17,700 వద్ద కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా ధరలు తగ్గిన సమయంలో కొనుగోళ్లకు కొంత ఊరట లభించినప్పటికీ.. ఇప్పుడు మళ్లీ రేట్లు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.

34
రూ.20వేలు తగ్గిన వెండి
Image Credit : Pixabay

రూ.20వేలు తగ్గిన వెండి

మరోవైపు వెండి ధరలు మాత్రం బంగారానికి భిన్నంగా భారీగా తగ్గుతున్నాయి. ఒక్కరోజే కిలో వెండిపై రూ.5,000 తగ్గుదల నమోదైంది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.55 లక్షల వద్ద ఉంది. గత నెలలో కిలో వెండి ధర సుమారు రూ.2.75 లక్షల స్థాయిలో ఉండగా.. ప్రస్తుతం దాదాపు రూ.20 వేల మేర తగ్గింది. దీంతో వెండి కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి మాత్రం ఈ తగ్గుదల కొంత ఊరటనిస్తోంది.

44
మార్కెట్ రేటు చూడాలి
Image Credit : Getty

మార్కెట్ రేటు చూడాలి

అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరల కదలికలు, డాలర్ విలువ, పెట్టుబడిదారుల కొనుగోళ్లు, లాభాల స్వీకరణ వంటి అంశాలు దేశీయ బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతుంటాయి. అందుకే బంగారం, వెండి ధరలు రోజురోజుకూ మారుతూ ఉంటాయి. ఆభరణాలు కొనుగోలు చేసే వారు మార్కెట్‌లోని తాజా రేటుతో పాటు మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
జెన్‌జీలు ఇలాంటి సిప్ప‌ర్‌ల‌లో నీళ్లు ఎందుకు తాగుతున్నారు.? అస‌లు వీటి ఉప‌యోగం ఏంటి?
Recommended image2
Mutual Funds: రూ.5 లక్షలు ఉంటే చాలు.. రూ.80 లక్షల జాక్‌పాట్ కొట్టే సింపుల్ ట్రిక్
Recommended image3
UPI Charges: పండగ వేళ వ్యాపారులకు ఊరట.. యూపీఐ ఛార్జీల అమ‌లుపై కీల‌క నిర్ణ‌యం
Related Stories
Recommended image1
Gold Rate Today: బంగారం సీన్ రివర్స్..రెండ్రోజుల్లో రూ.6వేలు పతనం, కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్
Recommended image2
Gold Price Crash: మళ్లీ పశ్చిమాసియాలో ముదిరిన యుద్ధం..పాతాళానికి పడిపోతున్న పసిడి, సిల్వర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved