ఆటో లాంటి బైక్.. కారు లాంటి ఫీచర్స్.. లాంచ్ చేయనున్న యమహా కంపెనీ..
జపనీస్ కంపెనీ యమహా ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమను చాలా కాలంగా పరిపాలిస్తోంది. ఈ కంపెనీకి చెందిన బైక్‌లను కొనేందుకు ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఎందుకంటే కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త మోడళ్ల బైక్‌లను పరిచయం చేస్తూనే ఉంటుంది.
ప్రస్తుతం యమహా త్రీవీలర్ మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది. యమహా అందించే మొదటి త్రీ-వీలర్‌తో పోల్చితే బుల్లెట్ కూడా చిన్నబోవాల్సిందే. యమహా ట్రైసెరా తొలిసారిగా జపాన్‌లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో విడుదలైంది.
ఈ బైక్‌ను డెలివరీ చేయడానికి ముందు ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. డ్రైవింగ్‌లో రైడర్ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని కంపెనీ తెలిపింది. యమహా ట్రైసెరా హైలైట్లను పరిశీలిస్తే, ఈ బైక్‌లో రియర్ వీల్ స్టీరింగ్ ఉంది.
ఈ సిస్టం బైక్‌ను కారులా నడుపుతుంది. బ్యాక్ వీల్ తిప్పడానికి వీలుంటుందని, దీని వల్ల మలుపులలో బైక్‌ను సులభంగా తిప్పడానికి సహాయపడుతుందని కూడా నివేదించబడింది. అయితే ఈ బైక్ మరిన్ని వివరాలు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.