MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Automobile
  • Traffic Challans : వాహనదారులకు సూపర్ ఛాయిస్.. మీ బండిపై ఉన్న ట్రాఫిక్ ఫైన్స్ తక్కువకే కట్టేయండి

Traffic Challans : వాహనదారులకు సూపర్ ఛాయిస్.. మీ బండిపై ఉన్న ట్రాఫిక్ ఫైన్స్ తక్కువకే కట్టేయండి

మీ బండిపై చాలా కాలంగా ట్రాఫిక్ ఫైన్స్ పెండింగ్‌లో ఉన్నాయా? వాటిని ఎలా క్లియర్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకు ఈ సమాచారం తప్పకుండా తెలియాల్సిందే…

2 Min read
Author : Arun Kumar P
Published : Sep 09 2026, 02:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పెండింగ్ ట్రాఫిక్ ఫైన్స్ క్లియర్ చేసుకొండి
Image Credit : Gemini AI

పెండింగ్ ట్రాఫిక్ ఫైన్స్ క్లియర్ చేసుకొండి

చాలా కాలంగా కట్టకుండా ఉన్న ట్రాఫిక్ ఫైన్లను క్లియర్ చేసుకోవాలనుకునే వారికి సెప్టెంబర్ 12, 2026 చాలా ముఖ్యమైన తేదీ. ఈ సంవత్సరానికి గాను జాతీయ లోక్ అదాలత్ ఈరోజు జరగనుంది… దేశవ్యాప్తంగా లీగల్ సర్వీసెస్ అథారిటీలు ఈ లోక్ అదాలత్‌ను నిర్వహిస్తాయి. దీని ద్వారా అర్హత ఉన్న పెండింగ్ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చు. ఇందులో మీ వెహికిల్ పై ఉన్న పెండింగ్ ఫైన్స్ చాలా తగ్గింపుతో కట్టవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఏమిటీ లోక్ అదాలత్‌?
Image Credit : Asianet News

ఏమిటీ లోక్ అదాలత్‌?

కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు లేదా కోర్టుకు వెళ్లకముందే ఉన్న వివాదాలను రాజీ పద్ధతిలో పరిష్కరించడమే లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశం. చట్ట ప్రకారం రాజీకి వీలున్న కేసులను మాత్రమే ఇక్కడ పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి మీ వాహనంపై ఫైన్ ఉందని ఆటోమేటిక్‌గా మాఫీ అవుతుందని అనుకోవద్దు. కేసు స్వభావాన్ని బట్టి, సంబంధిత అధికారులు దాని అర్హతను నిర్ణయిస్తారు.

లోక్ అదాలత్‌లో ఇరు పక్షాల అంగీకారంతో, రాజీ మార్గంలో కేసును పరిష్కరిస్తారు. ఒకసారి రాజీ కుదిరితే లోక్ అదాలత్ ఇచ్చే తీర్పు అంతిమమైనది… ఇరు పక్షాలూ దీనికి కట్టుబడి ఉండాలి. ఈ తీర్పుపై సాధారణంగా అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదని జాతీయ న్యాయ సేవల అథారిటీ (NALSA) స్పష్టం చేస్తోంది. అయితే రాజీకి అర్హత లేని కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించలేరు.

Related Articles

Related image1
Traffic challans: అయ్యా బాబోయ్.. హోండా యాక్టివాపై ఏకంగా 117 చలాన్లు.. డేటా చూసి షాక్ తిన్న పోలీసులు..
Related image2
Traffic Challans: సూపర్ లేడీ..! 270 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘన.. స్కూటీపై ఏకంగా రూ.1.36 లక్షల జరిమానా.. 
34
పెండింగ్ ఫైన్స్ క్లియర్ చేసుకోవాలంటే ఏం చేయాలి?
Image Credit : AI-Generated

పెండింగ్ ఫైన్స్ క్లియర్ చేసుకోవాలంటే ఏం చేయాలి?

మీ వాహనంపై పెండింగ్ ఫైన్స్ లోక్ అదాలత్ ద్వారా క్లియర్ చేసుకోవాలని అనుకునేవారు ముందుగా కేసు స్టేటస్ చెక్ చేసుకోవడం మంచిది. వాహన రిజిస్ట్రేషన్ వివరాలు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలి. ఏ డాక్యుమెంట్లు కావాలి, ఏ కోర్టును సంప్రదించాలి అనేది కేసును బట్టి మారుతుంది. కాబట్టి సెప్టెంబర్ 12కి ముందే మీ స్థానిక జిల్లా న్యాయ సేవల అథారిటీ ప్రకటనలను చూసుకోవడం మంచిది.

44
ఫైన్ ఎంత తగ్గుతుంది?
Image Credit : Gemini AI

ఫైన్ ఎంత తగ్గుతుంది?

చాలామంది లోక్ అదాలత్ ద్వారా 'ఫైన్ సగానికి తగ్గుతుంది' లేదా 'అన్ని ఫైన్లు మాఫీ' అవుతాయి అనుకుంటారు… కానీ ఇది నిజం కాదు. లోక్ అదాలత్ అనేది ఫైన్ల తగ్గింపు పథకం కాదు, అర్హత ఉన్న కేసులను రాజీ ద్వారా ముగించే ఒక చట్టపరమైన ప్రక్రియ.

తెలుగు రాష్ట్రాల న్యాయ సేవల అథారిటీలు కూడా సెప్టెంబర్ 12, 2026న జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని అధికారికంగా ధృవీకరించాయి. కాబట్టి మీ పాత ఫైన్స్ విషయంలో అధికారిక ప్రకటనలు చూసి, సరైన పద్ధతిని పాటించడం ముఖ్యం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Maruti Suzuki: మారుతి నుంచి మైండ్ బ్లాకింగ్ కారు.. రూ. 5 లక్షలకే 34KM మైలేజ్, 6 ఎయిర్‌బ్యాగ్స్
Recommended image2
Kia Car Offers : కియా కార్లపై ఫెస్టివల్ ఆఫర్.. ఏకంగా రూ.1.5 లక్షల భారీ డిస్కౌంట్
Recommended image3
Maruti Baleno : మీదగ్గర కేవలం రూ.11,000 ఉంటే చాలు.. సరికొత్త మారుతి బాలెనో కారు సొంతం చేసుకొండి
Related Stories
Recommended image1
Traffic challans: అయ్యా బాబోయ్.. హోండా యాక్టివాపై ఏకంగా 117 చలాన్లు.. డేటా చూసి షాక్ తిన్న పోలీసులు..
Recommended image2
Traffic Challans: సూపర్ లేడీ..! 270 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘన.. స్కూటీపై ఏకంగా రూ.1.36 లక్షల జరిమానా.. 
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved