MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Automobile
  • Maruti Baleno : మీదగ్గర కేవలం రూ.11,000 ఉంటే చాలు.. సరికొత్త మారుతి బాలెనో కారు సొంతం చేసుకొండి

Maruti Baleno : మీదగ్గర కేవలం రూ.11,000 ఉంటే చాలు.. సరికొత్త మారుతి బాలెనో కారు సొంతం చేసుకొండి

కొత్త కారు కొనాలనుకునే వారిని ఆకర్షించేందుకు మారుతి బాలెనో సరికొత్త మార్పులతో మార్కెట్లోకి వచ్చేసింది. మారుతి సుజుకి తన కొత్త బాలెనోను అతి తక్కువ ధరలో అత్యాధునిక ఫీచర్లలో విడుదల చేసింది.

2 Min read
Author : Arun Kumar P
Published : Sep 08 2026, 10:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కొత్త మారుతి బాలెనో వచ్చేసింది..
Image Credit : NEXA

కొత్త మారుతి బాలెనో వచ్చేసింది..

మారుతి సుజుకి తన పాపులర్ కారు బాలెనోను సరికొత్త మార్పులతో భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కొత్త బాలెనో ప్రారంభ ధర కేవలం 6,09,900 రూపాయలు మాత్రమే… ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే కేవలం రూ.11,000 చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఈ సరికొత్త మోడల్‌ను మారుతి సుజుకి తన నెక్సా షోరూమ్‌ల ద్వారా అమ్ముతోంది. ఈసారి బాలెనో లుక్‌లోనే కాదు సేఫ్టీ, కంఫర్ట్, టెక్నాలజీ ఫీచర్లలో కూడా చాలా మార్పులు చేసింది మారుతి సుజుకి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మారుతి బాలెనో అత్యాధునిక ఫీచర్లు
Image Credit : X

మారుతి బాలెనో అత్యాధునిక ఫీచర్లు

కొత్త బాలెనోలో అతిపెద్ద హైలైట్ లెవెల్ 2 ADAS (Advanced Driver Assistance Systems). దీంతో ఈ కారు డ్రైవింగ్ మరింత సౌకర్యవంతంగా మారింది. రాడార్, కెమెరా సాయంతో పనిచేసే ఈ సేఫ్టీ సిస్టమ్‌లో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, హై బీమ్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, EBD(Electronic Brakeforce Distribution), హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఇచ్చారు.  

Related Articles

Related image1
Baleno 2026 : సరికొత్త లుక్‌లో మారుతి బాలెనో.. 2026లోనే ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది..!
Related image2
Maruti EV Car : సింగిల్ ఛార్జ్‌తో 315 కి.మీ నాన్ స్టాప్ ప్రయాణమా..! ధర కేవలం రూ.10 లక్షలేనా!!
35
కొత్త బాలెనోలో అదిరిపోయే ఇంటీరియర్
Image Credit : X

కొత్త బాలెనోలో అదిరిపోయే ఇంటీరియర్

ఫీచర్ల విషయానికొస్తే.. కొత్త బాలెనో ముందు సీట్లలో వెంటిలేటెడ్ (కూలింగ్) సదుపాయం కల్పించారు. లెథెరెట్ సీట్ కవర్లు, డ్యూయల్-టోన్ ఇంటీరియర్, 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ కనెక్టివిటీ, వైర్‌లెస్ ఛార్జింగ్, 360-డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్‌ప్లే వంటివి ఉన్నాయి. దీనికితోడు క్లారియన్ కంపెనీ ఆడియో సిస్టమ్‌ను కూడా అందించారు. సుజుకి కనెక్ట్ ఫీచర్ ద్వారా వెహికల్ సెక్యూరిటీ, ట్రిప్ సమాచారం, లొకేషన్ అలర్ట్స్, కొన్ని రిమోట్ కంట్రోల్ ఫీచర్లను కూడా వాడుకోవచ్చు.

45
కొత్త బాలెనో ఇంజిన్
Image Credit : X

కొత్త బాలెనో ఇంజిన్

కొత్త బాలెనో ఇంజిన్‌లో కూడా మార్పులు చేశారు. ఇందులో 1,197cc Z12E పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్ఠంగా 82.93 హార్స్‌పవర్‌, 112.4 న్యూటన్ మీటర్ల టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. మ్యాన్యువల్ పెట్రోల్ మోడల్ లీటర్‌కు 23.80 కిలోమీటర్లు, ఆటోమేటిక్ మోడల్ 24.77 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి ఇందులో స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ కూడా ఉంది.

55
బాలెనో సీఎన్‌జీ వేరియంట్
Image Credit : ‍X

బాలెనో సీఎన్‌జీ వేరియంట్

పెట్రోల్ మోడల్‌తో పాటు కొత్త Z12E ఇంజిన్‌తో S-CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఇచ్చారు. CNG మోడ్‌లో ఈ కారు కిలోకు 33.61 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని మారుతి సుజుకి తెలిపింది.

బయటివైపు వెడల్పైన కొత్త నెక్స్‌వేవ్ ఫ్రంట్ గ్రిల్, మార్పులు చేసిన ఫ్రంట్ బంపర్, కొత్త గార్నిష్, కొత్త ఎనిగ్మాటిక్ టీల్ కలర్ ఆప్షన్ వంటివి జోడించారు. మొత్తంగా పాత బాలెనో డిజైన్‌ను కొనసాగిస్తూనే సేఫ్టీ, కంఫర్ట్, టెక్నాలజీలో భారీ అప్‌గ్రేడ్స్‌తో ఈ కొత్త మోడల్ వచ్చింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Best Mileage Bikes: రూ. 60 వేల బడ్జెట్‌లో లీటరుకు 75 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే
Recommended image2
Tata Cars Offers : ఈ కారుపై డిస్కౌంటే రూ.3.5 లక్షలా..! టాటా బంపర్ ఆఫర్ ఇస్తోందిగా
Recommended image3
Simple Wave EV: 243 కిలో మీటర్ల మైలేజ్.. సింపుల్‌ ఎనర్జీ నుంచి అదిరిపోయే స్కూటర్ వచ్చేసింది !
Related Stories
Recommended image1
Baleno 2026 : సరికొత్త లుక్‌లో మారుతి బాలెనో.. 2026లోనే ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది..!
Recommended image2
Maruti EV Car : సింగిల్ ఛార్జ్‌తో 315 కి.మీ నాన్ స్టాప్ ప్రయాణమా..! ధర కేవలం రూ.10 లక్షలేనా!!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved