MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి ఈ రోజు ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు మంచివి కావు

Today Horoscope: ఓ రాశివారికి ఈ రోజు ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు మంచివి కావు

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ రోజు  తలపెట్టిన కార్యాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు తప్పవు. వ్యాపారములలో జాగ్రత్త అవసరము. 

4 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jan 31 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

31  -1-2024  బుధ వారం మీ రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.
  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)

ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగి ప్రశాంత లభిస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత లభించును.ఎంతటి వారినైనా వాగ్ధాటితో ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో ధనలాభం కలుగుతుంది. ఉద్యోగాలలో అధికారుల మన్ననలు పొందగలరు.
 

313
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)

ముఖ్యమైన పనులు  పూర్తి కాగలవు . సంఘంలో గౌరవం పొందుతారు. శుభకార్యాలకు అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ధనలాభం. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. ఉత్సాహం ఆత్మవిశ్వాసం తో గడుపుతారు. ప్రయత్నాలు ఫలిస్తాయి . విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపిస్తారు.ఆర్థిక సంబంధమైన లావా దేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.
 

413
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)

తలపెట్టిన కార్యాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు తప్పవు. వ్యాపారములలో జాగ్రత్త అవసరము. సమాజంలో అవమానాలు కలగ గలవు.చేయు వ్యవహారములో కోపం అధికంగా ఉంటుంది .ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. సోదరులు తో మిత్రులతో లేనిపోని వివాదాలు రాగలవు. ఆలయాలు సందర్శిస్తారు.
 

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సమస్యలు సునాయాసంగా పరిష్కారమవుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగులు తమ శక్తి సామర్థ్యాలు నిరూపించుకుంటారు.శారీరక బాధలు పెరుగును. అధికారుల వలన భయాందోళనగాఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి . విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)

అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి.సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండను. సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు. ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనిచండి.   బంధు మిత్రుల సహాయ సహకారాలు పొందుతారు. కొంతకాలం గా పడిన శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది.

713
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)

దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు.  సమావేశాలలో పాల్గొంటారు. వాహన ప్రధానాలయందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. ధన నష్టం రాగలదు వివాహయత్నాలు సానుకూలం. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాల్లో ధనలాభం కలుగును. ఉద్యోగులకు అనుకూలం.

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)

శారీరికంగా మానసికంగా ఏదో ఒక విధంగా ఇబ్బందిలు ఉండవచ్చు. తలపెట్టిన కార్య ప్రయత్నాలు ఫలించడం కష్టతరముగా ఉండును. సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో ఆందోళనలు చెందుతారు. వృత్తిపరమైన బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో అకారణంగా కలహాలు రాగలవు. భయంకరమైన ఆలోచనలు వలన మానసిక ఒత్తిడి పెరుగును. ప్రయాణం వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగానికి సంబంధించిన వ్యవహారాల్లో ప్రయోజనకరంగా పని చెయ్యాలి.

913
telugu astrology

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)

కొత్త పనులకు శ్రీకారం చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మిత్రుల సాయంతో విజయాలు సాధిస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. సోదరులతో వివాదాలు రాకుండా చూసుకోవాలి. ఉద్యోగాల్లో గుర్తింపు పొందుతారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారములో ధన లాభం పొందగలరు.అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

1013
telugu astrology

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1)
నామ నక్షత్రాలు (యే-యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. తలపెట్టిన కార్యాలలో తగిన ప్రణాళికను సిద్ధం చేసుకుని ప్రారంభించుకుంటే మంచిది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. కష్టాన్ని తగు ప్రతిఫలం లభిస్తుంది. ఉంటా బయట బాధ్యతలు ఒత్తిడికి లోనవుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
 

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)

దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు.రావలసిన సొమ్ము అందుతుంది. సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. బంధువులతో ఆనందంగా గడుపుతారు . సమాజములో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును .నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి.వృత్తి వ్యాపారాలలో ఆశించిన ధన లాభం పొందగలరు.

1213
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)

నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ‌చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు .వ్యాపార విషయంలో అభివృద్ధి చేస్తారు. ఉద్యోగులకు అనుకూలం.
 

1313
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రాలు (దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చ)

ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.  ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.ఇతరులతో అకారణంగా విరోధాలు ఏర్పడగలవు,జాగ్రత్త వహించవలెను. వ్యాపారములో ధన నష్టము రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని ఎదుర్కొని పూర్తి చేయాలి. కుటుంబ సమస్యలు ఎదురవగలవు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.మానసిక చికాకులు.ప్రయాణాలలో ఇబ్బందులు ఎదురవుతాయి.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Transit: శని సంచారంతో ఈ 2 రాశులవారికి ఇల్లు, భూమి కొనే యోగం
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు!
Recommended image3
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved