- Home
- Astrology
- Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Weekly Horoscope: ఈ వార ఫలాలు 6.9.2026 నుంచి 12.9.2026 వరకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఈ వారం రాశి ఫలాలు
ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
మేష రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చదువు, పోటీ పరీక్షలు, ఉద్యోగ ప్రయత్నాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ధైర్యం, ఉత్సాహం పెరుగుతాయి. సోదరులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో పోటీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అనవసర ఖర్చులు పెరగకుండా డబ్బును పొదుపుగా వాడడం మంచిది. ప్రేమ, దాంపత్య విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మాటల్లో ఓర్పు పాటిస్తే సమస్యలు తగ్గుతాయి.
వృషభ రాశి ఫలాలు
వృషభ రాశివారికి ఈ వారం కెరీర్, ఆర్థిక విషయాల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. మీ కష్టానికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబంలో చిన్న చిన్న మాటపట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బు విషయాల్లో కోపంగా మాట్లాడటం మంచిదికాదు. చదువు, పిల్లల విషయాల్లో మంచి పురోగతి ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఖర్చులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం, పెద్దలతో మృదువుగా మాట్లాడటం ఈ వారం మీకు మేలు చేస్తుంది.
మిథున రాశి ఫలాలు
మిథున రాశివారికి ఈ వారం ఉత్సాహంగా సాగుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో కొత్త అవకాశాలు రావచ్చు. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి మంచి సమయం. అయితే తొందరపాటు నిర్ణయాలు, కోపం వల్ల సమస్యలు రావచ్చు. డబ్బు విషయంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రేమ, చదువు, సృజనాత్మక పనుల్లో మంచి ఫలితాలు పొందవచ్చు. ఉద్యోగంలో పెండింగ్ పనులు పూర్తిచేయడానికి శ్రద్ధ అవసరం. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ వారం వేగం కంటే వివేకంతో ముందుకు సాగడం మంచిది.
కర్కాటక రాశి ఫలాలు
కర్కాటక రాశివారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం, ఉత్సాహం పెరుగుతాయి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆదాయం విషయంలో మంచి ఫలితాలు ఉన్నా, ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. కుటుంబం విషయంలో ఓర్పు అవసరం. వారం మధ్యలో ప్రయాణాలు, కమ్యూనికేషన్, సోదరులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇల్లు లేదా వాహనానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూల సమయం. పెద్దల ఆశీర్వాదం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను ఇస్తాయి.
సింహ రాశి ఫలాలు
సింహ రాశివారికి ఈ వారం ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఉద్యోగంలో మీ పనితీరుకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు వచ్చినా ధైర్యంగా స్వీకరించాలి. స్నేహితులు, పరిచయాల ద్వారా మంచి అవకాశాలు రావచ్చు. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు చేయవచ్చు. వారం మధ్యలో డబ్బు, ఒప్పందాల విషయంలో స్పష్టత పెరుగుతుంది. అయితే ప్రయాణాలు, ఇతర అవసరాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. అప్పులు, ఆస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. దాంపత్యంలో చిన్న అపార్థాలు రావచ్చు. అహంకారానికి దూరంగా ఉంటే ఈ వారం మంచి ఫలితాలు పొందవచ్చు.
కన్య రాశి ఫలాలు
కన్య రాశివారికి ఈ వారం మంచి ఫలితాలు ఉంటాయి. బుధుడి ప్రభావంతో తెలివితేటలు, ఆలోచనా శక్తి పెరుగుతాయి. ఉద్యోగంలో పెండింగ్ పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో లెక్కలు, ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కెరీర్‌లో కొత్త అవకాశాలు రావచ్చు. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. సహోద్యోగులతో అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన విషయాల్లో తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. సమయపాలన, క్రమశిక్షణ పాటిస్తే ఈ వారం మంచి ఫలితాలు పొందవచ్చు.
తుల రాశి ఫలాలు
తుల రాశివారికి ఈ వారం మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు, బాధ్యతలు రావచ్చు. మీ పనితీరుకు అధికారుల ప్రశంసలు లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా పురోగతి కనిపిస్తుంది. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. పరిచయాల ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు. వారం మధ్య నుంచి ప్రయాణాలు, ఇతర అవసరాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రేమ, పిల్లలు, పెట్టుబడుల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ, వ్యక్తిగత సంబంధాల్లో సమతుల్యత పాటించాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు.
వృశ్చిక రాశి ఫలాలు
వృశ్చిక రాశివారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకు కొత్త అవకాశాలు రావచ్చు. ఉన్నత విద్య, దూర ప్రయాణాలు, పెద్దల సహకారం వంటి విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. వారం మధ్య నుంచి ఆదాయం, కొత్త పరిచయాల ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు. అయితే తొందరపాటు పనికిరాదు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. చదువు, పిల్లల విషయాల్లో కొంత ఆలస్యం ఉండొచ్చు. ఇంట్లో చిన్న అపార్థాలు రావచ్చు. ఏ నిర్ణయం తీసుకున్నా తొందరపడకుండా ఆలోచించి ముందుకు సాగడం మంచిది.
ధనుస్సు రాశి ఫలాలు
ధనుస్సు రాశివారికి ఈ వారం మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగం, వ్యాపారంలో కొత్త అవకాశాలు రావచ్చు. పెద్దలు, గురువుల సహకారం లభిస్తుంది. ఉన్నత విద్య, దూర ప్రయాణాలు, విదేశీ అవకాశాల కోసం ప్రయత్నించే వారికి అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో మీ ఆలోచనలు, పనితీరుకు గుర్తింపు రావచ్చు. జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామితో చిన్న గొడవలు రావచ్చు. మాటల్లో ఓర్పు అవసరం. ఇంటి, వాహన విషయాల్లో తొందరపాటు మంచిదికాదు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, సంబంధాల్లో జాగ్రత్తగా ఉంటే మంచి ఫలితాలు పొందవచ్చు.
మకర రాశి ఫలాలు
మకర రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో మీ పనికి గుర్తింపు, ప్రశంసలు లభించే అవకాశం ఉంది. అయితే కొన్ని పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. వివాహం, భాగస్వామ్య విషయాల్లో మంచి పరిణామాలు చోటుచేసుకోవచ్చు. పెళ్లి కోసం చూస్తున్న వారికి మంచి సంబంధం రావచ్చు. ఆర్థికంగా అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. కుటుంబంలో సున్నితమైన విషయాలపై కోపంగా మాట్లాడకూడదు. పోటీదారులను సమర్థంగా ఎదుర్కొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఓర్పు, పొదుపు, మృదువైన మాటతీరు పాటిస్తే ఈ వారం అనుకూలంగా ఉంటుంది.
కుంభ రాశి ఫలాలు
కుంభ రాశివారు ఈ వారం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కొత్త ఆలోచనలు వచ్చినా వాటి లాభనష్టాలు చూసి ముందుకు సాగాలి. కుటుంబ ఖర్చులు, పొదుపు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో పోటీని సమర్థంగా ఎదుర్కొని మంచి ఫలితాలు సాధిస్తారు. వారం మధ్య నుంచి ముఖ్యమైన విషయాలను లోతుగా అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. అప్పులు, పన్నులు, ఆర్థిక పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలి. దాంపత్యంలో చిన్న అపార్థాలు రావచ్చు. ప్రేమ, పిల్లల విషయంలో తొందరపాటు పనికిరాదు. క్రమశిక్షణ, సంబంధాల్లో ఓర్పు పాటిస్తే ఈ వారం సాఫీగా సాగుతుంది.
మీన రాశి ఫలాలు
మీన రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని పనులు ఆలస్యమైనా, భవిష్యత్తు కోసం మంచి ప్రణాళికలు చేసుకునే అవకాశం లభిస్తుంది. చదువు, ప్రేమ, పిల్లలు, సృజనాత్మక పనుల్లో మంచి ఫలితాలు పొందవచ్చు. దాంపత్య జీవితం, వ్యాపార భాగస్వామ్య విషయాల్లో స్పష్టత పెరుగుతుంది. ఇంట్లో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే అనుకోని ఖర్చులు పెరగవచ్చు. విదేశీ అవకాశాలు రావచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఈ వారం మంచి ఫలితాలు పొందవచ్చు.

