కేజీఎఫ్ 2 సినిమా విడుదలైన పదిహేను రోజుల్లోనే దాదాపు 1000 కోట్ల కలెక్లన్లు సాధించి ఉత్తరాధిలోనూ సంచలనం సృష్టించింది. పాన్ ఇండియా లెవెల్లో ఇప్పటివరకు రూ. 1000 కోట్లు వసూళ్లు సాధించిన నాల్గవ చిత్రంగా నిలిచింది. 

ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ 2  (KGF 2)హవా హద్దూ అదుపూ లేకుండా  కొనసాగుతోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. రాకింగ్ స్టార్ యశ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచీ  కలెక్షన్ల సునామీ సృష్టిస్తూనే ఉంది.  ఎన్నో ఎక్సపెక్టేషన్స్  మధ్య విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఏప్రిల్ 24న విడుదలైన ఈ సినిమా తొలిరోజే ఏ సినిమాకు రాని వసూళ్లు సాధించింది. ఇప్పటికే హిందీలో రూ. 350 కోట్లు సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసిన యశ్.. ఇప్పుడు మరో  రెండు సంచనల రికార్డ్ సృష్టించాడు.

‘KGF చాప్టర్ 2’ USAలో ఇప్పటిదాకా $7 మిలియన్లు (అన్ని భాషలు) వసూలు చేసింది.  మరియు ఈ ఘనత సాధించిన నాల్గవ దక్షిణ భారత చిత్రంగా నిలిచింది. USA డిస్ట్రిబ్యూటర్‌కి ఈ చిత్రం అత్యంత లాభదాయకమైన వెంచర్ గా చెప్పాలి. ఇక తెలంగాణలో ఈ సినిమా రూ.40 కోట్ల మార్కును దాటేసింది. రాష్ట్రంలో రూ.40 కోట్ల షేర్ రాబట్టింది. తద్వారా ఈ రికార్డు సాధించిన మొదటి మరియు ఏకైక డబ్బింగ్ సినిమాగా నిలిచింది. ఈ రికార్డ్ లు చూస్తున్న స్టార్ హీరోలు...తమకు టార్గెట్ సెట్ చేసిన ఈ సినిమా వంక ఆశ్చర్యంగానూ,ఇబ్బందిగా చూస్తున్నారు. ముఖ్యంగా ఆచార్య డిజాస్టర్ అందరిలోనూ కంగారు పుట్టిస్తోంది. కేజీఎఫ్ 2 లాంటి సినిమా తియ్యకపోతే జనం చూడరా అని ఆలోచనలో పడిపోతున్నారు.

మరో ప్రక్క కేజీఎఫ్ 2 సినిమా విడుదలైన పదిహేను రోజుల్లోనే దాదాపు 1000 కోట్ల కలెక్లన్లు సాధించి ఉత్తరాధిలోనూ సంచలనం సృష్టించింది. పాన్ ఇండియా లెవెల్లో ఇప్పటివరకు రూ. 1000 కోట్లు వసూళ్లు సాధించిన నాల్గవ చిత్రంగా నిలిచింది. పాన్ ఇండియా సినిమా హిస్టరిలో ఇప్పటివరకు రూ. 1000 కోట్ల కలెక్షన్లు సాధించిన చిత్రాలు మూడు. అవి.. దంగల్, బాహుబలి 2,ఆర్ఆర్ఆర్. తాజాగా యశ్ నటించిన కేజీఎఫ్ 2 సైతం వందకోట్ల క్లబ్‏లో చేరింది. 

ఇప్పటివరకు ఈ సినిమా రూ. 1062 కోట్ల వసూళ్లు సాధించింది. ఇందులో సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలలో నటించారు. ఇక కేజీఎఫ్ 2 కంటే కేజీఎఫ్ 3 అంతకు మించి ఉండబోతున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యశ్ చెప్పిన సంగతి తెలిసిందే.