Asianet News TeluguAsianet News Telugu

పెళ్ళే అవ్వలేదు అప్పుడే విడిపోయారు..? ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన విద్యుత్ జమ్వాల్

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో పెళ్ళిళ్ళు పెటాకులవుతున్నాయి... కొంతమంది పెళ్ళి కాకుండానే బ్రేకప్  చెప్పుకుంటున్నారు.ఈక్రమంలో టాలీవుడ్ లో విలన్ .. బాలీవుడ్ లో హీరో విద్యుత్ కూడా  ప్రస్తుతం బ్రేకప్ కు రెడీ అవుతున్నాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే.. పెళ్లి అవ్వకుండానే ఈ స్టార్ కపుల్ వీడిపోతున్నారు. 

vidyut jammwal And  nandita mahtani Brackup Roumers JMS
Author
First Published Mar 23, 2023, 6:07 PM IST


ఫిల్మ్ ఇండస్ట్రీలో పెళ్లిల్లు విడాకులు కామన్..సహజీవనాలు.. సరదా తిరుగుళ్లకు లెక్కే ఉండదు.  అయితే అందరూ అలా ఉండరు కాని చాలా వరకూ.. స్టార్లు కాంప్రమైజ్ అనే కాన్సెప్ట్ పక్కన పెట్టి.. ఇష్టమైతే కలిసి ఉందాం.. కష్టమైతే విడిపోదాం అన్నట్టు తమకు నచ్చిన జీవితం తాము జీవిస్తున్నారు. ఈక్రమంలో మరో స్టార్ హీరో కూడా ప్రస్తుతం బ్రేకప్ కు రెడీ అవుతున్నాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే.. పెళ్లి అవ్వకుండానే ఈ స్టార్ కపుల్ వీడిపోతున్నారు. 

విద్యుత్ జమ్వాల్ టాలీవుడ్ కు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. హ్యాండ్సమ్ హీరోగా.. సౌత్ లో కూడా మంచి ఫాలోయింగ్ సాధించాడు హీరో.. విద్యుత్ .. ఫ్యాషన్ డిజైనర్ నందితా మహ్తానీతో 3 ఏళ్ల క్రితం ప్రేమలో పడ్డాడు. ప్రేమలో అయితే పడ్డారు కాని వీరు పెళ్లి చేసుకోలేదు.  ఆ తర్వాత కొన్నాళ్లకు  2021 సెప్టెంబరులో వీళ్లిద్దరికీ ఎంగేజ్ మెంట్ మాత్రమే జరిగింది. పెళ్ళి గురించి పెద్దగా పట్టించుకోవకుండా చెట్టాపట్టాలు వేసుకుని తెగ తిరిగారు. తిరగడేమే కాదు.. కలిసి సహజీవంనం కూడా చేశారట స్టార్స్. 

ఇక ఈ ఇద్దరు వారి ప్రేమని గోప్పగా చెప్పుకుంటూ.. సోషల్ మీడియాలో వరుసగా ఫోస్ట్ లు కూడా పెట్టారు. ఇక త్వరలో పెళ్ళి చేసుకుని హ్యాపీగా ఉంటారు అనుకున్న టైమ్ లో ... ఇప్పుడు పెళ్లి చేసుకోకుండానే విడిపోయింది. రీసెంట్ గా ఓ పెళ్లికి హాజరైన విద్యుత్, నందిత ఎడమొహం పెడమొహంగా కనిపించారు. ఇది గమనించిన చాలామంది నెటిజన్స్.. ఈ జోడీ బ్రేకప్ పై కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా నందితాకు ఇప్పటికే ఓసారి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. 

అంతే కాదు బాలీవుడ్ హీరోలు రణ్ బీర్ కపూర్ , దినో మోరియా లాంటి  హీరోలతో రిలేషన్ షిప్ కూడా మెంటైన్ చేసింది.  ఆతరువాత మొన్నటి వరకూ..  విద్యుత్ తో కలిసి చక్కర్లు కొట్టింది. ఇక ఇప్పుడు అతను కూడా నందితకు బ్రేకప్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. టాలీవుడ్ విల్ విద్యుత్ జమ్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో  మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన  2011లో వచ్చిన ఎన్టీఆర్ శక్తి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అసలు ఈ సినిమాతోనే ఆయన నటుడిగా మారాడు. 

ఆసినిమాతరువాత టాలీవుడ్ లో ఆయన్ను వరుస అవకాశాలు వరించాయి. అదే ఏడాది మళ్ళీ ఎన్టీఆర్ సినిమా అయిన ఊసరవెల్లిలో కూడా  విలన్ గా కనిపించి మెప్పించాడు. అవ్వడానికి విలన్ క్యారెక్టర్ చేశాడు కాని... విద్యుత్ గ్లామర్.. టోన్డ్ బాడీతో..హ్యాండ్సమ్ గా హీరోలా ఉంటాడు. అయితే టాలీవుడ్ లో ఎక్కువ కాలం కొనసాగలేకపోయాడు విద్యుత్ జమ్వాల్. సౌత్ లో కొన్ని సినిమాల్లో విలన్ గా కనిపించాడు. ముఖ్యంగా తమిళంలోనూ బిల్లా 2, తుపాకీ లాంటి  సినిమాలు చేసి నెగెటీవ్ క్యారెక్టర్ లో అలరించాడు. 

ఆ తర్వాత వెంటనే బాలీవుడ్ కి షిప్ట్ అయిపోయాడు విద్యుత్ . అయితే సౌత్ లో విలన్ గా చేసిన ఈ హ్యాండ్సమ్ స్టార్.. హిందీలో మాత్రం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కమాండో సిరీస్ తో హిట్స్ మీద హిట్స్ కొట్టాడు. ఖుదా హఫీజ్ అనే మరో మూవీ సిరీస్ లోనూ విద్యుత్ హీరోగా చేశాడు. ఇక ఇప్పుడు కూడా బాలీవుడ్ లో హీరోగానే బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు విద్యుత్ జామ్వాల్.

Follow Us:
Download App:
  • android
  • ios