Asianet News TeluguAsianet News Telugu

అమర్ దీప్ ఫ్యాన్స్ వేధిస్తున్నారు... దండం పెట్టి వేడుకున్న కీర్తి భట్!

కీర్తి భట్ కి అమర్ దీప్ ఫ్యాన్స్ నుండి వేధింపులు ఎక్కువయ్యాయట. దీంతో తన వేదన తెలియజేస్తూ వరుస వీడియోలు పోస్ట్ చేసింది. 
 

bigg boss fame amar deep fans harassment to keerthi bhat she releases  videos ksr
Author
First Published Dec 8, 2023, 8:14 PM IST

బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఒక కంటెస్టెంట్ కి సపోర్ట్ గా మాట్లాడితే మరొక కంటెస్టెంట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దాడికి దిగుతున్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. కాగా సీరియల్ నటి, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ కీర్తి భట్ ని అమర్ దీప్ ఫ్యాన్స్ వేధిస్తున్నారట. బూతులు తిడుతూ ట్రోల్ చేస్తున్నారట. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఇంస్టాగ్రామ్ లో వీడియోలు పోస్ట్ చేశారు. కీర్తి గౌతమ్ కృష్ణకు సపోర్ట్ చేసిన క్రమంలో కీర్తి భట్ పై అమర్ ఫ్యాన్స్ వేధింపులకు పాల్పడుతున్నారట. 

గౌతమ్ కృష్ణతో నాకు ఎలాంటి పరిచయం లేదు. అయితే ఇండివిడ్యువల్ గా ఆడుతున్నాడని అతనికి సపోర్ట్ చేశాను. అతనిలో నన్ను నేను చూసుకున్నాను. ఎవరికి సపోర్ట్ చేయాలనేది నా వ్యక్తిగత విషయం. మీకు ఎందుకు కోపం వస్తుంది. నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నాకు ప్రియాంక, మానస్, మహేష్ తప్ప ఎవరూ సపోర్ట్ చేయలేదు. హౌస్లో ఉంది నా ఫ్రెండ్స్. వాళ్లకు పరోక్షంగా నేను సపోర్ట్ చేస్తున్నాను. 

మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా? అమ్మ కడుపులో నుండే పుట్టారు కదా? ఇలాంటి బూతులు ఎలా మాట్లాడతారు. నేను ప్రతి ఒక్కరి ఐడీలు నోటు చేసుకుంటాను. మీ ఇంటికి వచ్చి రోడ్డు మీద కొడతాను. మీ తల్లి చేతే కొట్టిస్తాను... అని కీర్తి భట్ ఫైర్ అయ్యారు. తనను అసభ్య పదజాలంతో దూషించడంతో కీర్తి భట్ ఆవేదన చెందారు. అమ్మాయిలను గౌరవించండి. నాది తప్పు ఉంటే మీ కాళ్ళు మొక్కుతా. దయచేసి దూషించకండని కీర్తి భట్ అన్నారు. 

కీర్తి ఇంస్టాగ్రామ్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కీర్తి బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్ట్ చేసింది. స్ట్రాంగ్ ప్లేయర్ గా ఆమె ఫైనల్ కి వెళ్ళింది. కీర్తి భట్ 3వ స్థానంలో నిలిచింది. సీజన్ విన్నర్ గా సింగర్ రేవంత్ నిలిచాడు. శ్రీహాన్ రన్నర్ గా ఉన్నాడు. కీర్తి ఇటీవల ఎంగేజ్మెంట్ జరుపుకుంది. ప్రేమించిన వ్యక్తిని త్వరలో వివాహం చేసుకోనుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios