ప్రస్తుతం ఉన్న చాలా మంది హీరోలు అభిమానులతో కలిసిపోతూ.. పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగమవుతూ మానవత్వాన్ని చాటుతున్నారు. 

ప్రస్తుతం ఉన్న చాలా మంది హీరోలు అభిమానులతో కలిసిపోతూ.. పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగమవుతూ మానవత్వాన్ని చాటుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ కూడా తన మంచితనాన్ని మరోసారి బయటపెట్టాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సెలబ్రిటీలు కనిపిస్తే వారితో ఫోటో దిగాలని ఎగబడుతుంటారు అభిమానులు. ఇలాంటి సందర్భాల్లో సెలబ్రిటీలు పెద్ద పట్టించుకోకుండా వెళ్లిపోతుంటారు. ఈ మధ్యకాలంలో అటువంటి సంఘటనలు చాలానే చూశాం. అయితే బన్నీ మాత్రం తన కారు ఆపి మరీ ఫ్యాన్స్ తో ఫోటో దిగాడు.

అసలు విషయంలోకి వస్తే.. ఈరోజు బన్నీ కొత్త సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. అవి పూర్తి చేసుకొని కారులో ఇంటికి పయనమవుతుండగా.. ఇద్దరు దివ్యాంగులు బన్నీకి అభివాదం చేస్తూ కనిపించారు.

అది గమనించిన బన్నీ వెంటనే కారు దిగి వారిని ఆప్యాయంగా పలకరించి వారు కోరినట్లుగా వారితో ఫోటో దిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు బన్నీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.