Asianet News TeluguAsianet News Telugu

Thaman : ‘సర్కారు వారి పాట’ మూవీ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ‘థమన్’.. అదిరిపోయే ట్యూన్ వదిలాడు..

నందమూరి బాలక్రిష్ణ నటించిన ‘అఖండ’ మూవీకి  మంచి మ్యూజిక్ అందించిన థమన్, సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’  మూవీకి  కూడా మ్యూజిక్ అందించనున్నారు. ఈ నేపథ్యంలో సాంగ్స్ కంపోజ్ వర్క్ షురూ చేశారు. ఈ మేరకు తన నోట ఓ ట్యూన్ ను వదిలారు థమన్.  
 

Thaman Started Music Composing For Sarkari Vaari Pata, Social Media Post
Author
Hyderabad, First Published Jan 23, 2022, 1:53 PM IST

టాలీవుడ్ లో థమన్ మ్యూజిక్ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం వస్తున్న సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్లు అంటే ఒకవైపు దేవీ శ్రీ ప్రసాద్, మరో వైపు ఎస్ఎస్ థమన్  పేరే వినిపిస్తుంది. మోస్ట్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు థమన్.  మెలోడీ, మాస్ బీట్ కంపోజ్ చేయడంలో థమన్  ప్రత్యేకత వేరే లెవల్ ఉంటుంది. 

హీరోల జోష్ కు తగ్గట్టుగా వారి అభిమానులకు నచ్చేట్టుగా మ్యాూజిక్ కంపోజ్ చేయడంలో థమన్  ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. రీసెంట్ గా  ‘అఖండ’మూవీలో మాస్ బీట్ అందించిన థమన్, ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ మూవీ సాంగ్స్ ను కంపోజ్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఒక ట్యూన్ ను తానే స్వయంగా వినిపించారు థమన్.  అయితే సర్కారు వారి పాట మూవీలోని టైటిల్ సాంగ్ కు సంబంధించిన మ్యూజిక్ ను కంపోజ్ చేస్తున్నట్టు అనిపించింది. 

ఇక సినిమా విషయానికొస్తే షూటింగ్ పనులు కొనసాగుతున్నాయి. గతేడాది   మొదట్లోనే సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్ బాబు షార్ట్ గ్యాప్ తరువాత పరుశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారిపాట సినిమాను ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేయడంతో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్తోంది. 

 

పరశురామ్ దర్శకత్వంలో బ్యాంకింగ్ రంగంలో జరిగుతున్న అతిపెద్ద కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, రామ్ ఆచంట ఈ మూవీకి పనిచేస్తున్నారు. 

కాగా, సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'సర్కారు వారి పాట' సాంగ్స్ రూపుదిద్దుకుంటున్న తరుణంలో థమన్ ఎలాంటి మ్యూజిక్ ఇస్తారోనంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు మూవీ సాంగ్స్ హిట్ గా నిలిచిన సందర్భంగా అభిమానులు ఈ మూవీ నుంచి థమన్ నుంచి ట్రెండీ మ్యూజిక్ ను కోరుకుంటున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios