Asianet News TeluguAsianet News Telugu

'సైరా' ప్రీమియర్ షో కలెక్షన్లు.. రికార్డులు బద్ధలవ్వాల్సిందే!

చిరంజీవి నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా సైరా రిలీజ్‌కి సర్వం సిద్దమయింది. ఒక రేంజ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సైరా యూనిట్ ఇప్పుడు ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టింది. 
 

sye raa targets overseas records in premieres collections
Author
Hyderabad, First Published Sep 24, 2019, 4:48 PM IST

స్వాతంత్య్ర పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను 'సైరా నరసింహారెడ్డి' గా రూపొందించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రీరిలీజ్ బిజినెస్ లో రికార్డులు సృష్టిస్తోన్న ఈ సినిమా బాక్సాఫీస్దగ్గర కూడా తన ప్రతాపం చూపిస్తుంది అని ట్రేడ్ పండితులుఅంచనా వేస్తున్నారు.

ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ షో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఎలాంటి ఆఫర్స్ లేకపోయినా ఎగబడి టికెట్స్ కొంటున్నారు. ఇప్పటికే అక్కడ లక్ష డాలర్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా.

ఇవి కూడా తక్కువ ఏరియాల నుండి వచ్చిన అప్డేట్ అని తెలుస్తోంది. పూర్తిగా బుకింగ్స్ మొదలైతే కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయి. ప్రస్తుతం ప్రీమియర్స్ కలెక్షన్స్‌లో బాహుబలి -2 టాప్‌లో ఉంది. 'సైరా' ఆ రికార్డ్ ని టచ్ చేయడం కష్టమే కానీ.. సెకండ్ ప్లేస్ లో నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.  

సైరా ప్రీమియర్స్‌తో రెండు మిలియన్ డాలర్స్ కొల్లగొట్టడం ఖాయం అనిపిస్తుంది. ఇక సినిమాకి హిట్ టాక్ వస్తే గనుక రికార్డులు సృష్టించం ఖాయం. ఇప్పటికే మెగాస్టార్ నటించిన 'ఖైదీ నంబర్ 150' సినిమా ప్రీమియర్స్ ద్వారా మిలియన్ డాలర్ల మార్క్ అందుకుంది.

ఆ సినిమాతో పోలిస్తే 'సైరా'లో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. ఈసారి 'సైరా' అధ్బుతాలు సృష్టించడం ఖాయమని మెగాభిమానులు నమ్ముతున్నారు. 

సైరా : నొస్సం కోట యుద్ధం విశేషాలు 

లీకైంది: ‘సైరా నరసింహారెడ్డి’ మెయిన్ ట్విస్ట్ ఇదే!

మెగాస్టార్ సైరా ఫీవర్: భోజన ప్రియులకు బంపర్ ఆఫర్లు

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న సైరా టికెట్లు.. బెంగుళూరులో స్పెషల్ షోలు!

సిరివెన్నెల లిరిక్స్.. వాళ్ళిద్దరి వాయిస్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

'సైరా' సెన్సార్ కంప్లీట్.. సినిమా రన్ టైం ఎంతో తెలుసా!

Follow Us:
Download App:
  • android
  • ios