హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న సైరా టికెట్లు.. బెంగుళూరులో స్పెషల్ షోలు!
సైరా నరసింహారెడ్డి చిత్రం మరో 9 రోజుల్లో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాన్ ఇండియన్ మూవీగా రాబోతున్న సైరాపై టాలీవుడ్ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొని ఉంది.

మెగాస్టార్ అభిమానులంతో అక్టోబర్ 2నే సినిమా చూసేందుకు సిద్ధం అవుతున్నారు. నరసింహారెడ్డిగా చిరంజీవి చేసే పోరాటాలు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఉయ్యాలవాడ జీవిత చరిత్ర అంతగా ఎవరికీ తెలియదు. దీనితో సురేందర్ రెడ్డి ఈ చిత్రంలో ఏం చూపించబోతున్నారనే ఆసక్తి నెలకొని ఉంది.
ఇదిలా ఉండగా ఈ చిత్ర తారాగణం కూడా ప్రేక్షకులని ఆకర్షిస్తోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్. ఇక తమన్నా పాత్ర సైరా చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అనుష్క ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో కనిపించనుంది. పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించడం విశేషం. ఇన్ని విశేషాలున్న సైరా చిత్రాన్ని చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు.
ఇప్పటికే బెంగుళూరు నగరంలో సైరా చిత్ర బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. డిస్ట్రిబ్యూటర్స్ అక్టోబర్ 2 తెల్లవారుజామున స్పెషల్ షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్పెషల్ షోలకు టికెట్ ధరలు కూడా అదిరిపోతున్నాయి. 1200, 850, 650 రేట్లతో ఆన్లైన్ లో టికెట్లు విక్రయిస్తున్నారు.
టికెట్ ధర అధికంగా ఉన్నపటికీ స్పెషల్ షోలు చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. సైరా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.