మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా ఫీవర్ రెస్టారెంట్లకు కూడా పాకింది. సైరా పేరు మీద రెస్టారెంట్లు భోజన ప్రియులకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. గుంటూరుకు చంెదిన ఆంధ్ర తాళింపు భోజన ప్రియులకు ఆఫర్ ప్రకటించింది. ఒకటి కొంటే మరోటి ఉచితంగా ఇస్తోంది.

ఆ మేరకు ఆంధ్ర తాళింపు రెస్టారెంట్ ట్వీట్ చేసింది. సైరా, బాహుబలి తెలుగు సినిమాలని గర్వంగా చెబుకుందామని ట్వీట్ లో వ్యాఖ్యానించింది. ఇతర వివరాలకు ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చింది. రాజు గారి తోట అనిల్ సుంకరదని సమాచారం. ఆయన దూకుడు, నమో వెంకటేశాయ వంటి సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. 

ఇదిలా ఉంటే, తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో గల రాజు గారి తోట ప్రత్యేకంగా రాయలసీమ వంటకాలను అందిస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రాయలసీమకు చెందిన వీరుడు కావడంతో ఆ వంటకాలను అంది్తోంది. మెగా ట్రీట్ ఓన్లీ అంటూ సైరా తాలి అని ప్రకటించుకుంది. 

రాజుగారి తోటలో జొన్న రొట్టె, రాగి సంకటి, సేమ్యా కేసరి, పచ్చి మిరప పచ్చడి, పండు మిరప పచ్చడి పప్పు, నాటుకోడి పులుసు, మటన్, మజ్జిగ వంటి వంటకాలను భోజనప్రియులకు అందిస్తోంది.