సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, మెగాపవర్ స్టార్ రాంచరణ్ సైరా చిత్రాన్ని నిర్మించాడు. తన తండ్రి కోసం బడ్జెట్ కు వెనకాడకుండా దాదాపు రూ 250 కోట్లు ఈ చిత్రం కోసం వెచ్చించాడు. బాహుబలిని మించేలా ఈ చిత్రంలో విఎఫెక్స్ షాట్స్ ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

ఇదిలా ఉండగా సైరా చిత్రం విడుదలకు అవసరమైన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటోంది. తాజాగా సైరా చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు సైరా చిత్రానికి 'యుఏ' సర్టిఫికేట్ ఇచ్చారు. సెన్సార్ సభ్యులు సైరా చిత్రానికి సింగిల్ కట్ కూడా చెప్పలేదు. చిత్ర రన్ టైం కూడా ఎక్కువగానే ఉంది. సైరా చిత్రం 2:44 గంటల నిడివితో ఉండనుంది. 

స్వాతంత్ర సమరయోధుడి కథ కాబట్టి ఆమాత్రం లెంగ్త్ ఉండడం సహజమే. దర్శకుడు సురేందర్ రెడ్డి ఉయ్యాలవాడ కథని పూర్తిస్థాయిలో చూపించబోతున్నారు. సెన్సార్ పూర్తయింది కాబట్టి ఇక విడుదల మాత్రమే మిగిలి ఉంది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించింది. కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. బిగ్ బి అమితాబ్ నరసింహారెడ్డి గురువుగా ఈ చిత్రంలో కనిపిస్తారు. ఇక తమన్నా పాత్ర కూడా సైరా చిత్రంపై ఆసక్తిని పెంచుతోంది.