Asianet News TeluguAsianet News Telugu

మళ్లీ బూతా? ‘నేక్ డ్’ హీరోయిన్ కొత్త సినిమా ట్రైలర్

”రాత్రి మీరు సన్నిహితంగా గడిపారా, అరవింద్ కు ఎవరైనా శత్రువులు ఉన్నారా”.. అంటూ పోలీస్ ఆఫీసర్ తన విచారణలో నిజాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ట్రైలర్ లో కనిపించింది. ”నువ్వు రెండు సార్లు మర్డర్ అటెంప్ట్ చేశావ్, అందుకు ఆధారాలు ఉన్నాయి”.. అని అడగటం ఉంది

Sri Rapaka s New Web Movie Titled The Lust, A Murder Mistery JSP
Author
Hyderabad, First Published Oct 15, 2020, 8:42 AM IST

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘నేక్ డ్’ ఫేమ్ ‘శ్రీ రాపాక’ నటిస్తున్న కొత్త వెబ్ మూవీ ”ద లస్ట్, ఎ మర్డర్ మిస్టరీ”. థర్డ్ ఐ సినిమాస్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. ‘ఎస్ కే ఎన్’ దర్శకత్వం వహిస్తున్నారు. అశోక్ షిండే ”ద లస్ట్, ఎ మర్డర్ మిస్టరీ” మూవీకి కథను అందిస్తూ నిర్మిస్తున్నారు. ఈ వెబ్ మూవీలో అమిత్ తివారీ, శ్రీ గగన్, ఛత్రపతి శేఖర్, ఆనంద్ భారతి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఎక్స్ ట్రా మారిటల్ అఫైర్స్ అండ్ క్రైమ్’ నేపథ్యంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే విధంగా ”ద లస్ట్, ఎ మర్డర్ మిస్టరీ” చిత్రం ఉండబోతోంది. ఈ మూవీ మేకింగ్ క్వాలిటీ ఆకట్టుకునేలా ఉంటుంది. ”ద లస్ట్, ఎ మర్డర్ మిస్టరీ” సినిమా ట్రైలర్  రిలీజైంది.

ఈ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే – ఒక పోలీస్ ఆఫీసర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా… ”మీ కింద ఫ్లాట్ లో మర్డర్ జరిగింది…అరవింద్ ను ఎందుకు చంపావ్” అంటూ ఓ మహిళను ప్రశ్నిస్తాడు. ”రాత్రి మీరు సన్నిహితంగా గడిపారా, అరవింద్ కు ఎవరైనా శత్రువులు ఉన్నారా”.. అంటూ పోలీస్ ఆఫీసర్ తన విచారణలో నిజాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ట్రైలర్ లో కనిపించింది. ”నువ్వు రెండు సార్లు మర్డర్ అటెంప్ట్ చేశావ్, అందుకు ఆధారాలు ఉన్నాయి”.. అని అడగటం ఉంది

 ”వెన్ సెడిషన్ ఓవర్ రైడ్స్, యు విల్ క్రాస్ ద లైన్” అని క్యాప్షన్స్ కనిపిస్తున్నాయి. ”కామం మిమ్మల్ని లొంగదీసుకున్నప్పుడు… మీరు హద్దులు దాటేస్తారు” అని అర్థాన్ని ఇస్తూ ట్రైలర్ ఆసక్తిని కలిగిస్తోంది. ”ద లస్ట్, ఎ మర్డర్ మిస్టరీ” వెబ్ మూవీని త్వరలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేస్తామని నిర్మాత అశోక్ షిండే తెలిపారు. ఇందుకు మేజర్ ఓటీటీలతో సంప్రదింపులు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

మేఘనా చౌదరి, అర్చనా సింగ్, అర్జున్ శేఖర్, సంజన తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ మూవీకి సంగీతం – టి. రాజేష్, సినిమాటోగ్రఫీ -ఎంఎన్ బాలా, ఎడిటర్ -బీఎన్ఆర్, డైలాగ్స్ – నిరంజన్, సహ నిర్మాతలు – రాజ్ కుమార్ షిండే, దేవేంద్ర శివరే, అనిల్ భండారి, కథ, నిర్మాత – అశోక్ షిండే, స్క్రీన్ ప్లే , దర్శకత్వం – ఎస్ కే ఎన్

Follow Us:
Download App:
  • android
  • ios