Asianet News TeluguAsianet News Telugu

విషమంగా సీనియర్ నటి హేమ చౌదరి ఆరోగ్యం

సౌత్ సీనియర్ నటి హేమా చౌదరి పరిస్థితి విషయంగా ఉంది. అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన ఆమె వెంటిలేటర్ పై ఉన్నట్టు తెలుస్తోంది. 

South Senior Actress Hema Choudhary Health condition Serious JMS
Author
First Published Dec 20, 2023, 1:20 PM IST

సౌత్ లో దాదాపు అన్ని భాషల్లో నటించారు  హేమా చౌదరి. దక్షిణాది నటిగా స్టార్డమ్ అందుకున్నారు. ఎన్నో అవార్డ్ లు  అందుకున్న హేమా చౌదరి పరిస్థితి ప్రస్తుం సీరియస్ గా ఉంది. అవ్వడానికి తెలుగు నటి అయినా.. కన్నడలో ఎక్కువ సినిమాలు చేసింది నటి హేమా చౌదరి. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. బ్రెయిన్‌ హెమరేజ్‌ కారణంగా బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె చికిత్సకు స్పందించడం లేదని వైద్యులు తెలిపారు. 

కాగా ఆమె కుమారుడు విదేశాలలో ఉండగా.. వెంటనే అతను బయలుదేరినట్టు సమాచారం.  హేమా చౌదరి ఎక్కువగా కన్నడ సినిమాల్లోనే నటించినప్పటికీ తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో కూడా అమె అద్భుతమైన నటనతో మెప్పించారు. ప్రతీ భాషలో స్టార్ హీరోలతో.. స్టార్ డైరెక్టర సినిమాలలో నటించారు హేమ. ముఖ్యంగా  కన్నడలో రాజ్‌కుమార్‌, విష్ణువర్ధన్‌, అంబరీష్‌, అనంత్‌నాగ్‌, శంకర్‌నాగ్‌, రవిచంద్రన్‌ వంటి ప్రముఖ నటులతో కలిసి నటించారు. 

నాగార్జునను అరెస్ట్ చేయాలని డిమాండ్, మన్మధుడి మెడకు చుట్టుకున్న బిగ్ బాస్ వివాదం

ఇటు తెలుగులో ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణరాజు,  చిరంజీవి, మోహన్ బాబు, రాజశేఖర్ లాంటి స్టార్ల సినిమాల్లో నటించారు హేమా చౌదరి. ఇక  మలయాళంలో ప్రేమ్‌నజీర్‌ సరసన, తమిళంలో  కమల్ హాసన్‌తో లాంటి స్టార్ హీరోల సరసనమెరిశారు హేమా చౌదరి. ఇమె అసలు పేరు పేరు దుర్గప్రభా. తెలుగునటి, దబ్బింగ్ ఆర్టిస్ట్ బృందావనం చౌదరి కుమార్తె అయిన ఈమె.. ఈ కాలం దంపతులు అనే తెలుగు  సినిమాతో  వెండితెరకు పరిచయం అయ్యింది. . 1976లో పెళ్ళి కాని పెళ్ళి సినిమానుంచి హీరోయిన్ గా అవకాశలు వచ్చాయి. ఈమె దక్షిణ భారత సినిమాల్లో పెద్ద నటిగా పేరు తెచ్చుకుంది. 

అన్ని భాషల్లో కలిపి దాదాపు 200 సినిమాలకు పైగా నటించారు హేమ. కె.బాలచందర్, డి.యోగానంద్, పి.సాంబశివరావు, దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, సంగీతం శ్రీనివాసరావు, కోడి రామకృష్ణ, కె.శంకర్ లాంటి గొప్ప దర్శకుల చిత్రాల్లో హేమా చౌదరి నటించారు. పుట్టింటికి రా చెల్లి, గోరింటాకు, సుందరకాండ,మేస్త్రీ, ప్రేమాలయం వంటి సినిమలు నటిగా ఆమెకు ఎంతో పేరు తీసుకువచ్చాయి.  కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు ఎంపిక కమిటీ సభ్యురాలిగా కూడా ఉన్నారు. సువర్ణ రత్న అవార్డు, సువర్ణ పరివార్ పాపులర్ స్టార్ సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం సీరియస్ కండీషన్ లో హాస్పిటల్ లో ఉన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios