Asianet News TeluguAsianet News Telugu

కాలికి ఒక చెప్పుతో సమంత పరుగులు... ఇంతకీ ఏమైంది?

సమంత లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఆసక్తి రేపుతోంది. కాలికి ఒక్క చెప్పు మాత్రమే ఉన్న సమంత పరుగులు పెడుతున్న ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. 

samantha runs with single slipper what happen to her
Author
Hyderabad, First Published Aug 25, 2021, 4:35 PM IST

టాలీవుడ్ చార్మింగ్ క్వీన్ సమంత ఏమి చేసినా హాట్ టాపిక్ అవుతుంది. దశాబ్దానికి పైగా టాలీవుడ్ ని ఏలుతున్న సమంత క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి తరువాత కూడా సమంత పాపులారిటీ, ఫేమ్ కొంచెం కూడా తగ్గలేదు. అందుకే దర్శక నిర్మాతలు సమంత డేట్స్ కోసం ఎదురు చూస్తే పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఇక డిజిటల్ ఎంట్రీలో కూడా సమంత రికార్డ్స్ నెలకొల్పింది. ఆమె ప్రధాన పాత్రలో విడుదలైన ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ సూపర్ హిట్ టాక్ తెచ్చకుంది. 


మరోవైపు సమంత శాకుంతలం లాంటి పాన్ ఇండియా చిత్రం కూడా చేస్తున్నారు. దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం చిత్రాన్ని పౌరాణిక గాథగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్ వేసిన భారీ సెట్స్ లో శాకుంతలం మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఈ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రిన్సెస్ భరత రోల్ చేయడం విశేషం. అలాగే విజయ్ సేతుపతి హీరోగా నయనతార నటిస్తున్న తమిళ చిత్రం కాతు వాకుల రెండు కాదల్ మూవీలో సమంత నటిస్తున్నారు. 


కాగా సమంత లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఆసక్తి రేపుతోంది. కాలికి ఒక్క చెప్పు మాత్రమే ఉన్న సమంత పరుగులు పెడుతున్న ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. సదరు ఫొటోకు కామెంట్ గా... నా జీవిత గాథ, సిండ్రెల్లా తన మిస్సింగ్ స్లిప్పర్.. ఈ సందర్భంలో ఆమె అందం డైమండ్.. అంటూ కామెంట్ చేశారు. ఒక్క కాలికి మాత్రమే చెప్పు కలిగిన సమంత ఆ పరుగులు వెనుక ఆంతర్యం ఏమిటీ? ఇంటికీ సమంత చెప్పు ఏమైందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by S (@samantharuthprabhuoffl)

Follow Us:
Download App:
  • android
  • ios