Asianet News TeluguAsianet News Telugu

`సలార్‌`.. ఏపీ, తెలంగాణ పెంచిన టికెట్‌ రేట్లు.. రాత్రి షోలకు అనుమతి.. థియేటర్‌ లిస్ట్ ఇదే..

`సలార్‌` సినిమా కోసం టికెట్‌ రేట్లని పెంచింది ఏపీ ప్రభుత్వం. తాజాగా జీవో జారీ చేసింది. దీంతోపాటు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా రేట్లు పెంచింది. మరి ఆ లెక్కలు ఎలా ఉన్నాయో చూస్తే, 

salaar movie ap telangana ticket price night show theatres list arj
Author
First Published Dec 19, 2023, 7:31 PM IST

పెద్ద సినిమాలకు టికెట్‌ రేట్లు పెంచుకునే వెసులుబాటు ఉన్న విషయం తెలిసిందే. `బాహుబలి`, `ఆర్‌ఆర్‌ఆర్‌`, `కేజీఎఫ్‌`, `రాధేశ్యామ్‌`, `ఆదిపురుష్‌` వంటి చిత్రాలకు టికెట్‌ రేట్లని పెంచారు. ఇప్పుడు `సలార్‌` కి కూడా రేట్లు పెంచుతున్నారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం, మరోవైపు ఏపీ ప్రభుత్వం సైతం టికెట్‌ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించింది. తెలంగాణంలో ఈ మూవీకి సింగిల్‌ థియేటర్లలో రూ.65, మల్టీప్లెక్స్ లో వంద రూపాయలు పెంచుకునే అవకాశం కల్పించింది. ఈ లెక్కన తెలంగాణలో `సలార్` సినిమాకు సింగిల్ స్క్రీన్‍ థియేటర్లలో టికెట్ రేట్లు రూ.100, రూ.175, రూ.250గా ఉండనున్నాయి. మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.370, రూ.470 వరకు ఉండబోతున్నాయి. 

ఇక ఏపీ ప్రభుత్వం కూడా టికెట్‌ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చింది. అయితే దీనికి కేవలం రూ.40 మాత్రమే పెంచుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ లెక్కన మల్టీఫ్లెక్సుల్లో ప్రస్తుతం రూ.250 ఉండగా, ఇకపై 290 కానున్నాయి. రెగ్యూలర్‌ సీట్లలో రూ.190గా ఉంటాయి. సింగిల్‌ థియేటర్లలో 190 కంటే తక్కువగానే ఉండబోతున్నాయి. 

ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం `సలార్‌` మూవీకి స్పెషల్‌ షోస్‌ కి కూడా అనుమతినిచ్చింది. ప్రధానంగా హైదరాబాద్‌లోనే ఎక్కువ థియేటర్లకు అనుమతి ఉండటం విశేషం. అర్థ రాత్రి 1గంటల నుంచి ఈ షోస్‌ని ప్రదర్శిస్తారు. ఆ థియేటర్ల లిస్ట్ చూస్తే..

1) Nexus Mall, Kukatpally 
2) AMB cinemas, Gachibowli 
3) Brahmaramba Theatre, Kukatpally
4) Mallikarjuna Theatre, Kukatpally
5) Arjun Theatre, Kukatpally
6) Viswanath Theatre, Kukatpally
7) Sandhya 70MM, RTC X Roads
8) Sandhya Theatre 35MM, RTC X Roads 
9) Rajadhani Deluxe, Dilsukhnagar
10) Sriramulu Theatre, Moosapet
11) Gokul Theatre, Erragadda
12) Sri Sai Ram Theatre, Malkajgiri
13) SVC Tirumala Theatre, Khammam
14) Vinoda Theatre, Khammam
15) Venkateswara Theatre, Karimnagar
16) Nataraj Theatre, Nalgonda
17) SVC Vijaya theatre, Nizamabad
18) Venakteswara Theatre, Mahaboobnagar
19) Srinivasa Theatre, Mahaboobnagar
20) Rahdika Theatre, Warangal.

ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కలిసి నటిస్తున్న `సలార్‌` చిత్రానికి ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించారు. శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటించింది. జగపతిబాబు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ మూవీ క్రిస్మస్ కానుకగా ఈ నెల 22న విడుదల కాబోతుంది. దీనికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్‌ అయ్యాయి. ఓవర్సీస్‌లో ఈ మూవీ బుకింగ్స్ లో దుమ్ములేపుతుంది. ఇండియాలోనూ బుకింగ్స్ ఓపెన్‌ అయ్యాయి. లిమిటెడ్‌ థియేటర్లలో ఈ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఈ సాయంత్రం ఓపెన్‌ చేయగా, థియేటర్ల వద్దనే డైరెక్ట్ గా టికెట్‌ తీసుకోవాలనే నిబంధన పెట్టారు. దీంతో ఆయా థియేటర్ల వద్ద అభిమానులు బారులు తీరారు. దీంతో థియేటర్లు కిక్కిరిసిపోయాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios