Asianet News TeluguAsianet News Telugu

రవితేజ ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. గ్రాండ్‌గా ఓపెనింగ్‌! ఫుల్‌ డిటెయిల్స్..

మాస్‌ మహారాజా రవితేజ స్టార్‌ హీరోగా రాణిస్తున్నారు. ఆయన కుమారుడు త్వరలోనే హీరోగా పరిచయం కాబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వారి ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

ravi teja brother son introduce as hero in tollywood movie grand opening  arj
Author
First Published Mar 23, 2023, 11:10 PM IST

మాస్‌ మహారాజా రవితేజ ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చి ఇప్పుడు ఓ పెద్ద స్టార్‌గా ఎదిగారు. ఎంతో మంది కొత్త వారికి ఆదర్శంగా నిలుస్తుంది. దర్శకుడిగా కావాలని, హీరో అయి స్టార్‌ హీరోగా రాణిస్తున్నారు. ఇటీవలే ఆయన `ధమాకా` చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. ఇప్పుడు `రావణాసుర` చిత్రంతో రాబోతున్నారు. ఇదిలా ఉంటే రవితేజ ఫ్యామిలీ నుంచి ఇప్పుడు కొత్తగా హీరో రాబోతున్నారు. రవితేజకి ఇద్దరు తమ్ముళ్లు. అందులో రఘు ఒకరు. ఆయన కుమారుడు ఇప్పుడు హీరోగా పరిచయం అవుతున్నారు. 

రఘు కొడుకులు మాధవ్‌ని హీరోగా పరిశ్రమకి ఇంట్రడ్యూస్‌ చేస్తున్నారు. తాజాగా గురువారం హైదరాబాద్‌ ఈ కొత్త సినిమా ప్రారంభమైంది. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యలమంచి రాణి సమర్పణలో ఈ చిత్రం రూపొందబోతోంది. `పెళ్లి సందD` చిత్రంతో కమర్షియల్ గా మంచి హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. తాజాగా ఈ చిత్రం రామానాయుడు స్టూడియోస్ లో ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు, నిర్మాత డి సురేష్ బాబు, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ గారు, దర్శక నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, నటుడు రఘు తదితరుల ఆశిస్సులతో పూజా కార్యక్రమాలు జరుపుకుని ప్రారంభమైంది. దర్శకులు రాఘవేంద్రరావు  చేతుల మీదుగా దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్ ను అందజేయగా, నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత జె జే ఆర్ రవిచంద్ గారు మాట్లాడుతూ ..  జేజేఆర్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీలో ఈ రోజు ప్రొడక్షన్ నెంబర్ 2 ఓపెనింగ్ జరగడం సంతోషంగా ఉంది. ఈ కార్య్రమంలో రాఘవేంద్రరావు  స్క్రిప్ట్ అందజేయడం, ఫస్ట్ షాట్ కు క్లాప్ కొట్టడం, సురేష్ బాబు కెమెరా  స్విచ్ ఆన్ చేశారు. వారికి కృతజ్ఞతలు. `పెళ్లి సందD` మూవీతోనే ప్రూవ్ చేసుకున్న దర్శకురాలు గౌరి రోణంకి రెండో చిత్రాన్ని మా బ్యానర్ లో చేయడం సంతోషంగా ఉంది. రవితేజ సోదరుడు రఘు అబ్బాయి మాధవ్ ను హీరోగా పరిచయం చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా గౌరి గారి పెళ్లి సందడి ఫ్లేవర్ లో కాకుండా పూర్తి భిన్నంగా ఉంటుంది. మంచి పాయింట్ తో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఆమె ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి.. తన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. 

రవితేజ గారు షూటింగ్ లో బిజీగా ఉండి.. ఈ ఓపెనింగ్ కు రాలేకపోయారు. మంచి ఫ్యామిలీ నుంచి వస్తోన్న మాధవ్  ఈ చిత్రంతో మంచి హిట్ కొట్టాలని ఆశిస్తున్నాను. గతంలో సాంబశివ క్రియేషన్స్ బ్యానర్ లో ఐదు చిత్రాలు చేశాను. జేజేఆర్ బ్యానర్ లో మొదటి సినిమా నవీన్ చంద్రతో చేశాను. ఇది రెండో సినిమా. ఈ చిత్రంలో అన్ని క్రాఫ్ట్స్ హైలెట్ కాబోతున్నాయి. టెక్నీషియన్స్ అందరూ ఇప్పటికే పెద్ద సినిమాలు చేసి నిరూపించుకుని ఉన్నారు. మొదట్నుంచీ నాకు సపోర్ట్ గా ఉన్న చదలవాడ శ్రీనివాసరావు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు థ్యాంక్యూ` అని అన్నారు.

దర్శకురాలు గౌరి రోణంకి మాట్లాడుతూ, `నా తల్లి దండ్రులకు, మా గురువు కే రాఘవేంద్రరావు కి థ్యాంక్యూ సో మచ్. ఓ రకంగా ఇది నా సెకండ్ డెబ్యూ మూవీగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా మమ్మల్ని దీవించడానికి వచ్చిన మా గురువు, సురేష్ బాబుకి కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను.. మా హీరో మాధవ్ ను నమ్మినందుకు నిర్మాత రవిచంద్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. వారు చెప్పినట్టుగా ఇది చాలా యూత్ ఫుల్ గా సాగే కలర్ ఫుల్ గా ఉండే సినిమా. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు  ఈ కథ విని చాలా ఇంప్రెస్ అయ్యారు. ఈ చిత్రానికి కూడా మంచి మ్యూజిక్ తో సపోర్ట్ గా నిలుస్తున్నారు అనుకుంటున్నాను` అని తెలిపారు.

హీరో మాధవ్ మాట్లాడుతూ.. హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కావడం ఆనందంగా ఉంది. ఇదొక బ్లెస్సింగ్‌ గా భావిస్తున్నా. వచ్చే నెల నుంచి సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈ చిత్రం విడుదలయ్యేంత వరకూ మీ అందరి సపోర్ట్ మాకు కావాలి` అని అన్నారు. త్వరలోనే హీరోయిన్ తో పాటు ఇతర నటీ నటుల వివరాలు తెలియజేయబోతున్నారు. ఈ సి నిమాకి అనూప్‌ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. రామ్‌ కెమెరామెన్‌గా, కిరణ్‌ కుమార్‌ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios