Asianet News TeluguAsianet News Telugu

అతీంద్రియ శక్తులు,చేతబడి..రానా కొత్త సినిమా నేపధ్యం

కథకు బాగా ఇంప్రెస్ అయిన రానా వెంటనే ఓకే చెప్పేశాడని అంటున్నారు. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ మూవీగా దీనిని తెరకెక్కించనున్నారని సమాచారం. గతంలో ఈ దర్శకుడు సిద్దార్దతో గృహం అనే చిత్రం తీసారు. 

Rana Daggubati teams up with Milind Rau for a trilingual
Author
Hyderabad, First Published Sep 1, 2020, 10:39 AM IST

రీసెంట్ గా తన ప్రేయసిని వివాహమాడి జీవితంలో సెటిల్ అయిన రానా దగ్గుబాటి  ఓ హిందీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మిలింద్ రావ్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో రానా హీరోగా నటించనున్నాడు. మిలింద్ చెప్పిన కథకు బాగా ఇంప్రెస్ అయిన రానా వెంటనే ఓకే చెప్పేశాడని అంటున్నారు. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ మూవీగా దీనిని తెరకెక్కించనున్నారని సమాచారం. గతంలో ఈ దర్శకుడు సిద్దార్దతో గృహం అనే చిత్రం తీసారు. 

ఇదో హర్రర్ సినిమా. ఈ సినిమాతో రానా ఓ రేంజిలో భయపెట్టనున్నారట. కథ వింటున్నప్పుడే ఆయన భయపడ్డారట. వెంటనే ఓకే చేసేసాడట. భారత దేశంలో పురాతన విద్య అయిన చేతబడి చుట్టూ ఈ చిత్రం తిరుగుతుందని తెలుస్తోంది. ఇది పాత్ బ్రేకింగ్ సినిమా అవుతుందని రానా ఒప్పుకున్నాడని తెలుస్తోంది. 

ఇందులో వీఎఫ్ఎక్స్ కు చాలా ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని సురేశ్ బాబు, గోపీనాథ్ ఆచంట కలసి సంయుక్తంగా భారీ బడ్జెట్టుతో నిర్మిస్తారు.   తెలుగు,హిందీ,తమిళంలో ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమైంది. మరో ప్రక్క రానా వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.  ఇప్పటికే రానా చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. 'హాథీ మేరె సాథీ'.. '1945' లతో పాటుగా 'విరాటపర్వం' షూటింగ్ దశలో ఉన్నాయి. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'హిరణ్యకశ్యప' కు జోరుగా ప్రీ ప్రొడక్షన్ సాగుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios