సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం '2.0'. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన సినిమా ట్రైలర్ ఈ అంచనాలను మరింతగా పెంచేసింది. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో హీరో రజినీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

''ఈ సినిమా కోసం శారీరకంగా, మానసికంగా చాలా శ్రమ పడాల్సివచ్చింది. దాదాపు 12 కేజీలా సూట్ వేసుకొని షూటింగ్ చేయడం కష్టమనిపించేది. సినిమా 3డీలో తెరకెక్కిస్తున్న కారణంగా ఒకే షాట్ ని ఎనిమిది నుండి తొమ్మిది సార్లు తీయాల్సి వచ్చేది.

ఒక దశలో సినిమా చేయలేనని చెప్పేశా.. కానీ శంకర్ నన్ను ఒప్పించారు. షూటింగ్ మధ్యలో నా ఆరోగ్యం పాడైంది. దీంతో షూటింగ్ ఆలస్యమైంది. ఆ సమయంలో నిర్మాతలు నాకు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. ఈ సినిమా తరువాత శంకర్ కి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. నిర్మాతలు నన్నో అక్షయ్ నో నమ్మి రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టలేదు.

కేవలం శంకర్ ని నమ్మి పెట్టారు. శంకర్ ఇండియన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కెమరూన్. శంకర్, రాజమౌళి, రాజ్ కుమార్ హిరాని లాంటి వారు జెమ్స్ ఆఫ్ ఇండియన్ సినిమా'' అంటూ ప్రశంసించారు. 

ఇవి కూడా చదవండి.. 

రాజమౌళికి శంకర్ ప్రశంస!

రోబో '2.0' ట్రైలర్ ఇదిగో..!

విశాల్ కి అక్షయ్ రిప్లై.. తమిళంలో స్పీచ్!

'2.0' కోసం రజినీ 18 కేజీల కాస్ట్యూమ్స్ ధరించారు.. ఏఆర్ రెహ్మాన్!

రోబో 2.0 ట్రైలర్ లాంచ్ మొదలైంది!

రోబో '2.0'ని రిజెక్ట్ చేసిన ఆ ఇద్దరు హీరోలు!

స్పెషల్ ఈవెంట్ తో 2.0 హంగామా?

2.0: హ్యాపీ దివాలి ఫోక్స్.. రిపీటే..!

'రోబో-2' కోసం వేలం పాట!

'2.0' మేకింగ్ వీడియో.. విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో!

రోబో 2.0 ఫుల్ మూవీ లీక్.. ఆన్ లైన్ లో వైరల్

రజనీ, శంకర్‌ల '2.0' చరిత్ర సృష్టిస్తుందా? ప్రత్యేకత ఇదే

రజినీ రోబో 2.0 రిలీజ్ అనుమానమే, మరింత ఆలస్యం

రోబో 2.0లో ఒక్క పాట ఖర్చు 32 కోట్లు