Asianet News TeluguAsianet News Telugu

'రోబో-2' కోసం వేలం పాట!

మీకు గుర్తుందో లేదో అప్పట్లో రామ్ గోపాల్ వర్మ, మంచు విష్ణు కాంబినేషన్ లో వచ్చిన అనుక్షణం చిత్రానికి బిజినెస్ ని వేలం పాట ద్వారా చేసారు. మంచి స్పందనే వచ్చింది. మీడియా మొత్తం కవరేజ్ ఇచ్చింది. అయితే సినిమా ప్లాఫ్ అవటంతో ఆ విషయం ఎవరికీ గుర్తుండకుండా పోయింది. అయితే ఇన్నాళ్లకు మళ్లీ మరో చిత్రం వేలానికి సిద్దపడుతోంది. ఆ సినిమా మరేదో కాదు.. రోబో -2.

Auction For Rajinikanth 2.0 Movie Rights
Author
Hyderabad, First Published Oct 22, 2018, 10:17 AM IST

మీకు గుర్తుందో లేదో అప్పట్లో రామ్ గోపాల్ వర్మ, మంచు విష్ణు కాంబినేషన్ లో వచ్చిన అనుక్షణం చిత్రానికి బిజినెస్ ని వేలం పాట ద్వారా చేసారు. మంచి స్పందనే వచ్చింది. మీడియా మొత్తం కవరేజ్ ఇచ్చింది. అయితే సినిమా ప్లాఫ్ అవటంతో ఆ విషయం ఎవరికీ గుర్తుండకుండా పోయింది. అయితే ఇన్నాళ్లకు మళ్లీ మరో చిత్రం వేలానికి సిద్దపడుతోంది. ఆ సినిమా మరేదో కాదు.. రోబో -2.

ప్రముఖ దర్శకుడు శంకర్, రజనీకాంత్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం రోబో -2(2.ఓ). ఈ చిత్రం టీజర్ విడుదల అయ్యాక అంచనాలు ఆకాశాన్ని అంటాయి. దాంతో బిజినెస్ వర్గాల్లోనూ ఈ సినిమాని ఎలాగైనా తామే సొంతం చేసుకోవాలనే ఆలోచన ఎవరికి వాళ్లకే మొదలైంది. ఈ నేపధ్యంలో అందరూ పోటీ పడుతూండటంతో రైట్స్ ని వేలానికి పెట్టి ఎక్కువ మొత్తం చెల్లించిన డిస్ట్రబ్యూటర్ కు రైట్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యింది నిర్మాణ సంస్ద లైకా.

ఇక ఈ సినిమాని నవంబర్‌ 29న విడుదల చేయనున్నట్లు లైకా సంస్థ నిర్వాహకులు ఇప్పటికే ప్రకటన చేసారు. దాంతో సాధ్యమైనంత త్వరగా బిజినెస్ ని ముగించి, పబ్లిసిటీపై దృష్టి పెట్టే ఆలోచనలో ఉన్నారు.  ఈ వేలంలో పాల్గొని చిత్రాన్ని సొంతం  చేయడానికి తమిళనాట  ఏరియాకు 10 మంది చొప్పున బయ్యర్లు పోటీ పడుతున్నారని అక్కడి ట్రేడ్ వర్గాల సమాచారం.

చిత్రం విశేషాలకు వస్తే...దర్శకుడు శంకర్‌ గత చిత్రాల కన్నా అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం '2.ఓ'. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారని చెప్పుకుంటున్నారు.  ఈ బడ్జెట్ లో ఎక్కువ భాగం వీఎఫ్‌ఎక్స్‌ పనుల కోసమే ఖర్చు చేశారంటున్నారు.  

హాలీవుడ్‌ చిత్రాలకు దీటుగా ఇందులో వీఎఫ్‌ఎక్స్‌ ఉంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం 75మిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారట. అంటే మన కరెన్సీలో రూ.540కోట్లు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు 3వేల మంది టెక్నీషియన్స్  ఈ చిత్రం వీఎఫ్ ఎక్స్ కోసం పనిచేశారు. పబ్లిసిటీకు భారీగానే ఖర్చు చేస్తున్నారు.  

ఇవి కూడా చదవండి.. 

'2.0' మేకింగ్ వీడియో.. విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో!

రోబో 2.0 ఫుల్ మూవీ లీక్.. ఆన్ లైన్ లో వైరల్

రజనీ, శంకర్‌ల '2.0' చరిత్ర సృష్టిస్తుందా? ప్రత్యేకత ఇదే

రజినీ రోబో 2.0 రిలీజ్ అనుమానమే, మరింత ఆలస్యం

రోబో 2.0లో ఒక్క పాట ఖర్చు 32 కోట్లు

Follow Us:
Download App:
  • android
  • ios