దేశం మెచ్చిన సినీ దర్శకుడు శంకర్ గత ఏడాది నుంచి 2.0 సినిమాను విడుదల చేయడానికి తీవ్రంగా కష్టపడ్డాడు. ఫైనల్ గా నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో 2.0 సినిమా విడుదల కానుంది. దాదాపు 500కోట్లకు పైగా సినిమా కోసం ఖర్చు చేశారని తెలుస్తోంది. 

రిలీజ్ డేట్ కు పెద్దగా సమయం లేకపోవడంతో ఇప్పటినుంచే సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ ను పెంచాలని అనుకుంటున్నారు. ముందుగా ట్రైలర్ తో 2.0 సందడి మొదలు కానుంది. నవంబర్ 3న సినిమా ట్రైలర్ ను శంకర్ రిలీజ్ చేయనున్నారు. అభిమానులు ఎక్కువగా దానికోసమే ఎదురుచూస్తున్నారు. ఇక మొత్తంగా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ అయిపోయినట్టుగా తెలుస్తోంది. 

తెలుగులో కూడా శంకర్ ఒక ఈవెంట్ ను నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు వచ్చే అవకాశం ఉందట. గతంలో ఐ సినిమాకు శంకర్ రాజమౌళి త్రివిక్రమ్ లాంటి దర్శకులను ఇన్వైట్ చేసిన సంగతి తెలిసిందే.