సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు శంకర్ రోబో '2.0' సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. నవంబర్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండో రోజుల్లో ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయనుంది చిత్రబృందం. దీనికోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు శంకర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. సినిమాలో విలన్ పాత్ర కోసం అక్షయ్ కుమార్ కంటే ముందు ఇద్దరు స్టార్ హీరోలను సంప్రదించినట్లు వారు అంగీకరించలేదని వెల్లడించారు.

శంకర్ రూపొందించిన 'ఐ' సినిమా ఆడియో లాంచ్ కి ముఖ్య అతిథిగా హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ స్వార్జ్ నెగ్గర్ హాజరయ్యారు. అదే సమయంలో 2.0 సినిమా కోసం ఆయన్ని సంప్రదించినట్లు కానీ ఆయన అంగీకరించలేదని అన్నారు.

సినిమాలో విలన్ పాత్ర చాలా కీలమైనది కావడంతో ఆ స్థాయికి తగ్గ నటుడిని తీసుకోవాలని కమల్ హాసన్ ని సంప్రదించగా.. పూర్తి కథ విన్న తరువాత దీనికంటే 'భారతీయుడు' సీక్వెల్ చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపారట కమల్ హాసన్. అక్షయ్ కుమార్ కి కథ నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నట్లు శంకర్ తెలిపారు. ఈ సినిమాలో అతడి పాత్రకి చాలా షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది. 

 

ఇవి కూడా చదవండి.. 

స్పెషల్ ఈవెంట్ తో 2.0 హంగామా?

2.0: హ్యాపీ దివాలి ఫోక్స్.. రిపీటే..!

'రోబో-2' కోసం వేలం పాట!

'2.0' మేకింగ్ వీడియో.. విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో!

రోబో 2.0 ఫుల్ మూవీ లీక్.. ఆన్ లైన్ లో వైరల్

రజనీ, శంకర్‌ల '2.0' చరిత్ర సృష్టిస్తుందా? ప్రత్యేకత ఇదే

రజినీ రోబో 2.0 రిలీజ్ అనుమానమే, మరింత ఆలస్యం

రోబో 2.0లో ఒక్క పాట ఖర్చు 32 కోట్లు