సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు శంకర్ '2.0' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో అమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. 

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయబోతుంది చిత్రబృందం. ఈ మేరకు చెన్నైలోని సత్యం సినిమాస్ ని వేదికగా ఎన్నుకుంది. ఈ వేడుకలో చిత్రబృందంతో రజినీకాంత్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ వేడుకలో దర్శకుడు శంకర్.. ఇది కేవలం 3డి సినిమా మాత్రమే కాదని.. సౌండ్ ఫార్మాట్ లో వస్తోన్న తొలి ఇండియన్ సినిమా 2.0 అని అన్నారు.

4డి ఎఫెక్ట్ మన సీటు కిందనే స్పీకర్స్ ఉన్నాయనే ఫీలింగ్ ని కలిగిస్తుందని అన్నారు. నవంబర్ 29న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా అనేక రికార్డులను తిరగరాస్తుందని అన్నారు. అలానే ఈ సినిమా కోసం రజినీకాంత్ ఎంతగా కష్టపడ్డాడనే విషయాన్ని సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ గుర్తుచేసుకున్నారు.

ఈ వయసులో కూడా పనిపై ఆయనకున్న ఆసక్తిని గౌరవిస్తానని, ఈ సినిమాలో రజినీకాంత్ 18 కేజీల బరువున్న కాస్ట్యూమ్ ని ధరించినట్లు చెప్పారు. రజినీకాంత్ ఎప్పటికీ నా ఫేవరేట్ హీరో అని వెల్లడించారు.  

ఇవి కూడా చదవండి.. 

రోబో 2.0 ట్రైలర్ లాంచ్ మొదలైంది!

రోబో '2.0'ని రిజెక్ట్ చేసిన ఆ ఇద్దరు హీరోలు!

స్పెషల్ ఈవెంట్ తో 2.0 హంగామా?

2.0: హ్యాపీ దివాలి ఫోక్స్.. రిపీటే..!

'రోబో-2' కోసం వేలం పాట!

'2.0' మేకింగ్ వీడియో.. విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో!

రోబో 2.0 ఫుల్ మూవీ లీక్.. ఆన్ లైన్ లో వైరల్

రజనీ, శంకర్‌ల '2.0' చరిత్ర సృష్టిస్తుందా? ప్రత్యేకత ఇదే

రజినీ రోబో 2.0 రిలీజ్ అనుమానమే, మరింత ఆలస్యం

రోబో 2.0లో ఒక్క పాట ఖర్చు 32 కోట్లు