సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న రోబో '2.0'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు శంకర్ అధ్బుతాల్లో ఇది ఎప్పటికీ నిలిచిపోతుందనే నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కి భారీ స్పందన లభించింది.

ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు. దానికి సంబంధించిన వేడుక కూడా మొదలైపోయింది. ఈ వేడుకకి దర్శకుడు శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్, సంగీత దర్శకుడు రెహ్మాన్ తో పాటు హీరోయిన్ చిత్రబృందం పాల్గొన్నారు.

రజినీకాంత్ కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెన్నైలోని సత్యం సినిమాస్ లో ఈ ఈవెంట్ చోటుచేసుకుంటుంది. ట్రైలర్ ని 4డీ సౌండ్ టెక్నాలజీతో విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు ఈ టెక్నాలజీతో ఏ ఇండియన్ సినిమా విడుదల కాలేదు.

దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా గత కొద్దిరోజులుగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇవి కూడా చదవండి.. 

రోబో '2.0'ని రిజెక్ట్ చేసిన ఆ ఇద్దరు హీరోలు!

స్పెషల్ ఈవెంట్ తో 2.0 హంగామా?

2.0: హ్యాపీ దివాలి ఫోక్స్.. రిపీటే..!

'రోబో-2' కోసం వేలం పాట!

'2.0' మేకింగ్ వీడియో.. విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో!

రోబో 2.0 ఫుల్ మూవీ లీక్.. ఆన్ లైన్ లో వైరల్

రజనీ, శంకర్‌ల '2.0' చరిత్ర సృష్టిస్తుందా? ప్రత్యేకత ఇదే

రజినీ రోబో 2.0 రిలీజ్ అనుమానమే, మరింత ఆలస్యం

రోబో 2.0లో ఒక్క పాట ఖర్చు 32 కోట్లు