ప్రముఖ గాయని చిన్మయి 'మీటూ' ఉద్యమం కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలకి అండగా నిలుస్తూ తన సపోర్ట్ అందిస్తుంది. తాజాగా చిన్మయి తమిళనాడు సినీ పరిశ్రమ పరిరక్షణ సమాఖ్య తరఫున ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. 

ఈ సంధర్భంగా.. చిన్మయి మాట్లాడుతూ.. ''2013 లో నేను లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియాలో వెల్లడించాను. అప్పుడు నాపై బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు కూడా నాపై యాసిడ్ పోస్తామని హత్యా బెదిరింపులు వస్తున్నాయి.

గత వారం రోజులుగా నన్ను ప్రశ్నలతో వేధిస్తున్నారు. ఎప్పుడో జరిగిన సంఘటన గురించి అప్పుడే ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నిస్తున్నారు. వైరముత్తుపై కేసు వేయబోతున్నాను.

దానికోసం ఆధారాలను రెడీ చేసుకుంటున్నా.. సాధారణంగా ఇలాంటి విషయాల గురించి ఇంట్లో కానీ, పోలీసులకి గానీ చెబితే వాటిని నోక్కెసి ఇంట్లో కూర్చోబెడతారు. మహిళల విషయంలో ఇదే జరుగుతుంది. మహిళల రక్షణ కోసమే మీటూ ఉద్యమం'' అంటూ వెల్లడించింది. 

ఇవి కూడా చదవండి.. 

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు!