ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న 2.0 సినిమా రావడానికి ఇంకా నెల రోజులే ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఏ స్థాయిలో వసూళ్లను రాబడుతుందో అని ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖులు లెక్కలు వేసుకుంటున్నారు. శంకర్ సృష్టించిన అద్భుత సృష్టిలో గ్రాఫిక్స్ మాయాజాలం ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

ఇక రీసెంట్ గా రిలీజైన సినిమాకు సంబందించిన పోస్టర్స్ ని చూస్తుంటే అంచనాలు మరింత పెరుగుతాయని చెప్పవచ్చు. రోబో సినిమాలో హ్యాపీ దివాలి ఫోక్స్ అంటూ చిట్టి చూపించిన గన్స్ ఫైరింగ్ అందరిని ఆకట్టుకుంది. ఇక అంతకంటే ఎక్కువ స్థాయిలో మరోసారి 2.0 సినిమాలో చిట్టి తన విశ్వరూపాన్ని చూపించనున్నాడని పైన కనిపిస్తోన్న ఫొటో ద్వారా అర్ధమవుతోంది. 

ఇక సినిమా ట్రైలర్ ను నవంబర్ 3న రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇక నవంబర్ 29న ఫైనల్ గా సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది. చాలా వరకు థియేటర్స్ 2.0 సినిమా కోసం అప్గ్రేడ్ అయినట్లుగా తెలుస్తోంది. 3డి సినిమా కావడంతో బి సెంటర్లలో కూడా థియేటర్స్ టెక్నాలిజిలో మార్పులు చేస్తున్నారు.