సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు శంకర్ '2.0' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో అమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది. 

ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం చెన్నైలోని సత్యం సినిమాస్ లో జరుగుతోంది. ఈ వేడుకలో పాల్గొన్న అక్షయ్ కుమార్ తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు. దర్శకుడు శంకర్ కేవలం డైరెక్టర్ మాత్రమే కాదని.. సైంటిస్ట్ అని ఈ సినిమా కోసం అంతగా కష్టపడినట్లు వెల్లడించారు. ఆయన నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు చెప్పారు.

ఇలాంటి ఓ ఎపిక్ లో నటించే అవకాశం ఇచ్చినందుకు శంకర్ కి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో మేకప్ వేసుకోవడానికి మూడున్నర గంటలు పట్టేదని, అదే మేకప్ తీయడానికి గంటన్నర సమయం పట్టేదని అన్నారు. ఇటువంటి సినిమాలో నటించే ఛాన్స్ రావడం అదృష్టంగా భావిస్తున్నాని చెబుతూ.. తమిళ ప్రేక్షకుల కోసం తన కొంత తమిళంలో ప్రిపేర్ అయిన స్పీచ్ ని చెప్పి వారిని ఖుషీ చేశారు.

ఆ తరువాత విశాల్.. అక్షయ్ కుమార్ ఫిట్ నెస్ సీక్రెట్ గురించి ఓ వీడియో ద్వారా  ప్రశ్నించగా.. దానికి అతడు నా శరీరాన్ని దేవాలయంలా చూసుకుంటానని.. ఈ విషయంలో తనను ఎవరూ ప్రేరేపించారని ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటానని వెల్లడించారు. 

ఇవి కూడా చదవండి.. 

'2.0' కోసం రజినీ 18 కేజీల కాస్ట్యూమ్స్ ధరించారు.. ఏఆర్ రెహ్మాన్!

రోబో 2.0 ట్రైలర్ లాంచ్ మొదలైంది!

రోబో '2.0'ని రిజెక్ట్ చేసిన ఆ ఇద్దరు హీరోలు!

స్పెషల్ ఈవెంట్ తో 2.0 హంగామా?

2.0: హ్యాపీ దివాలి ఫోక్స్.. రిపీటే..!

'రోబో-2' కోసం వేలం పాట!

'2.0' మేకింగ్ వీడియో.. విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో!

రోబో 2.0 ఫుల్ మూవీ లీక్.. ఆన్ లైన్ లో వైరల్

రజనీ, శంకర్‌ల '2.0' చరిత్ర సృష్టిస్తుందా? ప్రత్యేకత ఇదే

రజినీ రోబో 2.0 రిలీజ్ అనుమానమే, మరింత ఆలస్యం

రోబో 2.0లో ఒక్క పాట ఖర్చు 32 కోట్లు